Friday, December 17, 2010

తంబురా శ్రుతి..!!

పనిచేసుకొనేప్పుడు కూనిరాగం తీయని వాడు ఉండడు. అందునా శాస్త్రీయ సంగీతం నేర్చుకొనీ కూనిరాగాలు తీసేసే వాళ్లకి తంబురా శ్రుతి వింటూ పాడుకొంటే వుండే ఆనందమే వేరు...! కంప్యూటర్ లోనూ, కారులో.. శ్రుతి ఎక్కడ వస్తుంది చెప్పండి..!! మనసు రాగాల పల్లకి లో ఒలలాడుతూవుంటే శ్రుతి చక్కని పిల్లతిమ్మెరలా హాయినిస్తుంది. చక్కగా అందుబాటులో ఉండేలా శ్రుతి బాక్స్ టూల్ దొరికింది. దానిని ఫోన్ లో గానీ..లేక కంప్యూటర్ లోగానీ రన్ చేసుకొని అది వింటూ పాడుకోవడమే ఇంక..!! పైగా మన పాటని మనమే శ్రుతి సహితం గా రికార్డు కూడా చేసుకోవచ్చు.


క్రింద లింక్ ని నొక్కి ఈ టూల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆనందించండి..!!!


దీనిలో అదనపు ఆకర్షణ ఏంటంటే.. అన్ని శ్రుతులూ.. ఒక నిమిషం, ఎనిమిది నిమిషాల నిడివిలో wave sound format లో లభ్యం అవుతోంది..! మనకు కావలసిన నిడివిలో ప్లే చేసుకోవచ్చు...!!

అలాగే క్రొత్తగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టేవారికోసం సరళీ స్వరాలనుంచీ కృతుల వరకూ కూడా వున్నాయి.



(దీనిగురించి ముందే తెలిసిన వాళ్ళు కొంచం వెనక్కి వుండండి..తెలియని వాళ్ళని ముందరకి రానియ్యండి మేష్టారూ..!!)
******
Android phone users can dowload from the following link or directly from android market:

No comments:

Post a Comment

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)