Monday, March 12, 2012

స్మృతిపథంలో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక

స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక పేరుతో విడుదలైన ఈ పుస్తకం ఘంటసాల వారి స్మృత్యర్ధం విజయనగరంలోని వారి అభిమానుల చేత ముద్రించబడింది. సాంబశివరావు గారి సంపాదకత్వంలోఅచ్చయిన ఈ పుస్తకం ఇదివరకు ఘంటసాల వారి సంస్మరణలో వివిధ పత్రికల లో వచ్చిన వ్యాసాలూ, ఘంటసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలూ మొదలైనవి గుదిగ్రుచ్చబడిన పదహారు పేజీల చిన్ని పుస్తకం. అమూల్యమైన ఈ పుస్తకం వెల  రూ. 10/-.  
ఈ పుస్తకం నాకు మా బంధువుల ద్వారా వచ్చింది. చాలా పత్రికలనుంచీ సేకరించిన ఈ వ్యాసాలు జే. వి. రాఘవులు, ఆచార్య ఆత్రేయ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మొదలైన వారు వ్రాసారు. విజయ చిత్ర, ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ఘంటసాల వారి జీవితవిశేషాలతో వచ్చిన వ్యాసాలూ కూడా వున్నాయి. అన్నిటికంటే ఘంటసాల వారే తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి గురించి వ్రాసిన వ్యాసం కూడా పొందుపరచ  బడింది..! ఇన్నిటిని ఒకే చోట కూర్చిన సంపాదకుల శ్రమకు జోహార్లు. అయితే ఈ పుస్తకం మీద అది విడుదలైన తేదీ, ముద్రించబడిన సందర్భం కూడా ఉండి వుంటే ఇంకా బాగుండేది.  
 
 

 
 
 

ఇవి 'స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక' లోని కొన్ని పేజీలు మాత్రమే..!!   
మొత్తం పుస్తకం (16 పేజీలు )పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి. 
*************
( శ్రీ రాజేంద్ర కుమార్ గారు ఈ ఫైల్ డౌన్లోడ్ అవటం లేదని అన్నారు. పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి. 
Sorry, we are unable to retrieve the document for viewing because it is too large.
You can also try to download the original document by clicking here
అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ) 
*************
 అలాగే ఘంటసాల గారి అరుదైన చిత్రాలు డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ నొక్కండి.


6 comments:

  1. పైన లింకు ఎంత నొక్కినా ఆ పీ డీ యఫ్ ఫైల్ దిగిరాను అంటోందండీ,మీ దగ్గరే తీసుకుని ఫొటో స్టాట్ తీయించుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. రాజేంద్ర గారూ,
      నాకు బాగానే దిగివస్తోంది. మళ్ళీ ఇంకోసారి చెక్ చెయ్యండి. నేనుకూడా ఫొటోలే పెట్టడానికి ప్రయత్నిస్తాను.

      Delete
    2. పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి.
      Sorry, we are unable to retrieve the document for viewing because it is too large.
      You can also try to download the original document by clicking here.
      అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది.

      Delete
  2. రాధేశ్యాం గారు శుభసాయంత్రం. ఘంటసాల వారి పుస్తకం గురించి మంచి విషయాలు చెప్పారు. పుస్తకం వెల పదిరూపాయలంటే
    చాలా ఆశ్చర్యమేసింది.

    ReplyDelete
  3. sir,

    great post, still i'm unable to download the link.

    thanks

    ReplyDelete
  4. మీఫోన్ నం తెలుపగలరు.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)