కలాపోసన
ఇది నేను ఎనిమిదవతరగతి చదువుతున్నప్పుడు గీసిన బొమ్మ. నేను గీసిన బొమ్మల్లో నాకు బాగా నచ్చిన బొమ్మల్లో ఇది ఒకటి. రాముడు విల్లంబులు లేకుండా (ఇలాంటి భంగిమ అరుదు) అభయముద్ర తో వున్న ఈ బొమ్మ బాపు గారు గీసినది.
1994 లో సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనల సంకలనానికి నేను గీసిన ముఖచిత్రం.
ఒక ఏడాది రెండేళ్ళ క్రితం గీసిన బొమ్మ ఇది. ఎక్కడో చూసి గీసాను. ఎక్కడిదో, ఒరిజినల్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తులేదు.

శివ గంగా సంగీత పరిషద్, హైదరాబాద్ వారికి వేసిన బొమ్మ.. మొదటిది చిత్తు..రెండోది ఫెయిర్ చేసినది. ఇదికూడా నేదునూరిగారే అడిగి వేయించుకున్నారు. 
ఇది రఫ్ స్కెచ్ అన్నట్టుగా వేసాను. ఫెయిర్ చెయ్యడానికి అవలేదు. నేను వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసింది తక్కువే. వాటిలో ఇదీ ఒకటి.


నేను గీసిన, మరియు చేసిన బొమ్మలు ఇక్కడ  చూడండి

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)