Sunday, October 28, 2012

దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!

ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో ఒక పాత్ర అంటూ ఉంటుంది.
 ఈనాటి భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్ కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి ల సంగతులు తేలేలోగా, నిన్నటికి నిన్న, అదృష్టవశాత్తూ కొన్నాళ్ళు ఈ దేశప్రధానిగా కాలం వెళ్ళబుచ్చిన కర్నాటక రాష్ట్ర నాయకుడు దేవగౌడ, తాజా మాజీ సీఎం యడ్యూరప్ప మరియు ఇంకొందరి మీద ఆరాష్ట్ర లోకాయుక్త విచారణకు ఆదేశించింది.
శీమతి సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాధ్రా గారు, డీ ఎల్ ఎఫ్ తో వారికున్న స్నేహాన్ని పురస్కరించుకొని వారికి ఓ నాలుగు ప్రాజెక్టులు ఇప్పిస్తే ఆ కంపెనీ వాళ్ళు ఈయనకి తమ లాభం కొంత పంచిచ్చారు అదే ఫ్రెండ్షిప్ కొద్దీ…! గడ్కరీ గారు ఎంతో ఉదారంగా తమ డ్రయివర్ ని ఒక పది కంపెనీలకి డైరెక్టర్ని చేస్తే పాపం ఆ డ్రయివరు రాముడు పది కంపెనీలకి డైరెక్టర్ని కదా అని తల ఎగరెయ్యకుండా మరింత శ్రద్ధగా తన డ్రయివరుగిరీ కొనసాగించి తన స్వామి భక్తినీ, విశ్వాస పాత్రతనూ చాటుకొన్నాడు…! ఈ రెండూ కూడా కొద్ది రోజుల వ్యవధిలో బయటకొచ్చిన సంగతులే. కొసమెరుపేంటంటే అల్లుడుగారికి క్లీన్ చిట్టూ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారి మీద విచారణకు ఆదేశించడం, రెండు నిర్ణయాలూ ఆగమేఘాల మీదే తీసుకొన్నాయి ఆయా ప్రభుత్వాలు, లేదా వ్యవస్థలు. ఇవి చాలదన్నట్టు ఒక టీవీ చానెల్ వారికీ, ఒక ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తకూ మధ్య జరుగుతున్న తంతు కూడా రోత పుట్టిస్తోంది.
http://www.thefunlearning.com/2012/09/cartoons-against-corruption-in-india.html
 ప్రభుత్వాలలో, రాజకీయ పార్టీలలో, లేదా ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి ఇలా ఉంటే రోజూ మన కళ్ళ ఎదురుగా జరిగే సంగతులు కొన్నిఇలా ఉంటాయి :
మనం రైల్వే స్టేషన్ కి మన బంధువులని తీసుకురావడానికి వెళ్తాము. అక్కడ మన కారు పార్క్ చెయ్యడానికి పది రూపాయలు తీసుకొంటాడు. మనం ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికే చూస్తాము. రుసుము వసూలు చేసేవ్యక్తి కళ్ళుగప్పి చల్లగా జారుకోవడమో, లేక పార్క్ చేయలేదని, అసలు ఆగనేలేదని దబాయించడమో చేసి బోల్డు సంబర పడిపోతాము.  తనిఖీ జరగటం లేదని తెలిసిందా ప్లాట్ ఫాం టికెట్ అసలు తియ్యనే తియ్యం. కూరలు, పళ్ళూ అమ్మే చిరువ్యాపారుల దగ్గర వాళ్ళు పొరపాటున మనకి చిల్లర ఎక్కువ ఇచ్చేసినా గప్ చుప్ గా వెళ్ళిపోతాం. మనం కొన్న వస్తువుల జాబితాలోకి పక్కవాడి వస్తువు పొరపాటున కలిసిపోయిందనుకోండి.., మొదట బిల్లు లో అది కలిసిందా లేదా చూస్తాం. కలిస్తే నానా యాగీ చేస్తాం లేదా చాలా నిజాయితీ పరుడిలాగా ఫోజు పెట్టి అది మాదికాదని చెప్తాం. ఒకవేళ బిల్లు లో కలవక పోతే మాత్రం ఆహా ఇవాళ లేచిన వేళా విశేషం.. అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ’ఆమ్ ఆద్మీ అవినీతి’ జాబితా కొండవీటి చేంతాడంత అవుతుంది. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోకావచ్చు, బిల్లు కట్టడానికి క్యూలో నిలుచున్నప్పుడు కావచ్చు, . అవకాశం దొరికిన ప్రతీసారీ పక్కవాడి దాంట్లోంచీ చిలక్కొట్టుడు కొట్టేస్తాం. కానీ మన నిజాయితీ ఇమేజికి భంగం కలగ కుండా ’సమయానికి తగు మాటలాడి’ ఒక పకడ్బందీ సాకు వెదికి, తప్పు మనది కాదంటూ తీర్మానించి, అది అవతల వాడిమీదకి తోసేసి చేతులు దులుపుకొంటాం. 

 అంటే మనలో అందరూ లేదా చాలా మంది ఏదో ఒక విధమైన అవినీతిలో తెలిసో తెలియకో, కావాలనో లేక అసంకల్పితంగానో భాగస్తులమే అన్నది నిర్వివాదం. అందువల్ల ప్రొమోషన్ లిస్ట్ లో మనతోటివాళ్ళ కన్నా పైకి ఎగబాకడానికి పై లెవెల్లో లంచమిచ్చి మేనేజ్ చెయ్యడానికి వెనుకాడం.  డ్రైవింగ్ లైసెన్సో, పాస్ పోర్టో అర్జెంటుగా కావాలంటే  లంచమిచ్చి తెచ్చుకోవడాన్ని అవినీతిగా పరిగణించం. కానీ పేపర్లో రోజుకొకటి కనిపించే అవినీతిని మాత్రం చూసిమాత్రం గుండెలు బాదుకొని తీవ్రంగా నిరసిస్తాం. మళ్ళీ అవే రాజకీయ పార్టీలు ఏదైనా తాయిలాలు ఇస్తామంటే మాత్రం ఆ నాయకులు మనకు దైవ సమానులై  పోతారు. అంటే ఇందాక గుండెలు బాదుకున్నది దానిలో మనకు (మనం అంటే మనం అనే కాదు ఆ స్కాము వల్ల లబ్ధి పొందని/ పొందలేకపోయిన/ పొందడానికి అవకాశం రాలేని వాళ్ళందరూ ) భాగం రాలేదనా…!! ఇప్పుడు ఈ అవినీతిమయ రాజకీయ పార్టీలలోకి జరుగుతున్న వలసలూ, లేదా క్రొత్త సభ్యత్వాలూ జరుగుతున్నది ఆ పార్టీల / నాయకుల మీద ప్రేమా..??!! లేక ఆయన పంచన చేరితే అవినీతి సొమ్ములో ఆయన తినగా మిగిలిన ఎంగిలి మెతుకులైనా దక్కుతాయనే మోహమా..??!! ఓ నాలుగేళ్ళు అప్రెంటీసు చేసి ఆ కిటుకేదో కనిపెడితే భవిష్యత్తుకి ఢోకా ఉండదనే కపటమా..??!!
పూర్వం ఒకప్పుడు.., చాలా దశాబ్దాల క్రితం.., ప్రాచీన కాలంలో.., నాగరికత ఇంత అభివృద్ధి చెందని కాలంలో.., (అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే.. మీకూ నాకూ మనలో ఎవ్వరికీ తెలియని కాలంలో) సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడనే పదాలు భగవంతుడికి పర్యాయపదాలుగా వాడేవారు. కలడు కలండనెడువాడు కలడో లేడో.. కానీ ఇప్పుడా పదాలు “అవినీతి భూతానికి” సరిగ్గా సరిపోతున్నట్టున్నాయి. ఎందుకనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకులూ, అధికారులూ, ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ, స్వామీజీలూ, ఒక్కరేమిటి అందరూ ఆ తాను ముక్కలే. ఈ నేపధ్యంలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడు స్థాణువై శిలామాత్రంగా మిగిలిపోతున్నాడు. 
ఒక్కడు బురదలో నడిస్తే గట్టున ఉన్నపదిమంది అసహ్యించుకుంటారు.., లేదా మొహం వాచేలా చీవాట్లు పెడతారు. అదే గట్టున ఉన్నది ఒక్కడూ, బురదలో నడుస్తున్నది పదిమంది అనుకోండి. గట్టున ఉన్న ఒక్కడినీ చూసి ఆ పదిమందీ పగలబడి నవ్వుతారు. ఇంకాస్త ముందుకెళ్ళి వాడికీ మకిలి కాస్త అంటించేసి వెక్కిరిస్తారు. ఇప్పటి రాజకీయాలు, అవినీతి బురద పూసుకొని, ఆ బురదని మరో పదిమందికి పూసి ఆ కుళ్ళు మొహాలనే నేటి తరం ఫ్యాషన్ గా చెలామణి చేసేస్తున్నాయి..! నిదర్శనం కావాలంటే సగటు భారతీయుడిని నేటి అవినీతిమయ రాజకీయాలపైన అభిప్రాయం చెప్పమనండి..! ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాధపడేవాళ్ళ కన్నా, ఆ అవినీతికి సూత్రధారి అయిన పెద్దమనిషి తెలివితేటలకి అబ్బురపడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఈ లెవెల్ అవినీతికి ఆల్రెడీ ఆమోదముద్ర పడిపోయిందన్నమాటేకదా..! ముఖ్యంగా యువతలో..!!! 
నిజంగానే దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)