Showing posts with label వపా. Show all posts
Showing posts with label వపా. Show all posts

Sunday, October 13, 2013

వడ్డాది పాపయ్య గారి తొమ్మిది దుర్గలు

బ్లాగు మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!!
 శ్రీ వడ్డాది పాపయ్య గారు వివిధ పత్రికలకు (చందమామ, స్వాతి, వేదాంత భేరి ఇత్యాది..) గీసిన దుర్గా దేవి చిత్రాలు దసరా సందర్భంగా:








సరస్వతి దేవి:
 

ఈ నవరాత్రులలో తొమ్మిది రూపాలలో కొలువుతీరే దుర్గా మాత అవతారాలను వర్ణిస్తూ మార్కండేయ విరచిత దేవీకవచమ్ లో ఈ శ్లోకంలో చెప్పబడింది:

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

 ౧.  శైలపుత్రి

౨. బ్రహ్మచారిణి
౩. చంద్ర ఘంట

౪. కూష్మాండ

౫. స్కంద మాత

౬. కాత్యాయని

౭. కాళరాత్రి

౮. మహా గౌరి

౯. సిధ్ధి ధాత్రి

శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు వారి బ్లాగులో ఈ నవ విధ దుర్గల ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆసక్తి గలవారు ఈ లింకులో చూడవచ్చు  

నవ దుర్గలు

జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే
జయ జయ తోషిత భర్గే
అంబ జయజయ కుచ జిత దుర్గే ||
 

శ్రికర సద్గుణ జాలే అంబ సింధూర రంజిత ఫాలే
పాకశాసన మణినీలే
అంబ ప్రాలేయ భూధర బాలే
 

పాలిత కిసలయ చాపే అంబ పార్వతి లోకైకదీపే
కాళిక కోమల రుపే
అంబ ఖండిత త్రిభువన తాపే ||

శంకరి సత్క్రుపాపూరే
అంబ సంభ్రుత సన్మణిహారే
సాంకవలిప్త శరిరే
అంబ సంగతాంగ కేయూరే ||

వీణా వినోదిని గిరిజే
అంబ విద్రుమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే
అంబ మదన గోపాలక సహజే ||




పూర్తిగా చదవండి...

Tuesday, November 13, 2012

వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు..!

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను. 
మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!
 పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి 
(మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)
 నరకాసురుడిని సంహరిస్తున్న సత్యభామ.
 ఇవి మూడూ 'యువ' మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు వేసిన బొమ్మలు 


పూర్తిగా చదవండి...

Sunday, March 18, 2012

వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!

               వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది.  ఇప్పటివరకు లభ్యమవుతున్న వారి పెయింటింగ్స్ లో రాగాల పేర్లతో ఉన్న ఈ క్రింది బొమ్మలు అన్నీ మన బ్లాగు మిత్రుల సౌకర్యార్థం ఒక దగ్గర ఉంచాను. యువ లో వారి పెయింటింగ్స్ కొన్ని ప్రత్యేకమైన శీర్షికలతో వచ్చాయి. కొన్ని నక్షత్రాలకు కూడా వారి చిత్రణలో, రూపమిచ్చారు. 
              అయితే వపా గారు రాగాల పేర్లతో చిత్రించిన ఈ చిత్రాలు  చూస్తే వాటి పేరుని బట్టీ, దానికి సరిపోయే సన్నివేశాన్ని చిత్రించినట్టు కనిపిస్తోంది. జన రంజని - జనాన్ని రంజింపజేసేది (సినిమా తారలా అనిపిస్తోందినాకు.. అక్కడ చూపించిన జనం సినిమా హాలులో కూర్చున్నట్టుంది), కదన కుతూహలం - యుద్ధానికి తరలుతున్న సైనికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలికే సన్నివేశం. భాగేశ్వరి రాగానికి శివుడి అర్థనారీశ్వర రూపాన్ని చిత్రించిన తీరు చూడండి. అలాగే శివరంజని, అమీర్ కల్యాణి...!!
             క్రొత్తగా సంగీతం నేర్చుకొనే వారు మొట్టమొదట అభ్యాసం చేసే సరళీ స్వరాలూ, జంటస్వరాలూ, అలంకారాలూ వంటివి మాయామాళవ గౌళ రాగం లోనే వుంటాయి. అందుకే ప్రథమ పూజలందుకొనే గణపతికి కైమోడ్పులిస్తున్నచిన్నారిని (ఎదురుగా చిన్న పియానో / హార్మోనియం తో సహా) చిత్రించినట్టున్నారు.  
            యమునా కళ్యాణికి - యమునాతీరంలో గోపికలూ, ఆలమందలూ, రాధ తో విహరిస్తున్న కృష్ణుడిని చిత్రించారు. అలాగే శ్రీ రాగానికి లక్ష్మీదేవి విష్ణువుని వరించే సన్నివేశాన్నిచిత్రించారు. (శ్రీ - అంటే లక్ష్మి కదా..!) సన్నివేశాన్ని జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనం లో ఉద్భవించిన లక్ష్మీ దేవి, ఆసనం గా పద్మం, ఉరకలెత్తుతున్న సముద్రం, అప్పుడే పాల సముద్రం లోంచీ పుట్టిన చంద్రుడు కనిపిస్తారు.  
                    'కీరవాణి' రాగానికి రతీ మన్మధులని గీస్తూ emphasis వాహనమైన చిలకకి ఇచ్చారు. అలాగే 'సారంగ' రాగానికి గీసిన బొమ్మలో జింక బొమ్మ ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాగే మిగిలిన రాగాల పేర్లకీ ఈ చిత్రాలకీ వున్నసంబంధాన్ని తెలిసిన వారెవరైనా ఇంకాస్త వివరిస్తారని ఆశిస్తున్నాను.  
కన్నడ - శహన
బేహాగ్ - మలయ మారుతం
జన రంజని
శ్రీరంజని
మేఘ రంజని


రంజని
కీరవాణి


సారంగ
ముఖారి
భాగేశ్వరి
కదనకుతూహలం


శివరంజని - హిందోళ
సోహిని - మేఘరంజని - మాల్కోస్
కాంభోజి - కాపి
జయజయవంతి - అహిర్ భైరవి
మేఘ మల్హార్
చారుకేశి
కేదార గౌళ 
మాయామాళవగౌళ 
యమునా కల్యాణి 
యమునా కల్యాణి
























































అమీర్ కల్యాణి
శ్రీ రాగం
మాల్కోస్


















************************************
వపా గారి నక్షత్ర బాలలు మరో పోస్టులో..!! 
పై ఫోటోలు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్యాం నారాయణ్ గారి సౌజన్యంతో...! వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.


పూర్తిగా చదవండి...

Sunday, October 16, 2011

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!



యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి  బొమ్మలు  మరికొన్ని...!! 
పురాణాలకూ ఇతిహాసాలకూ సంబంధించిన బొమ్మల్లో కూడా మోడరన్ ఆర్ట్ ని చొప్పించ గలిగే శైలి వడ్డాది పాపయ్య గారి శైలి అనితర సాధ్యం. చందమామ కవర్ పేజీలు బొమ్మలు సప్తవర్ణ సమ్మేళనాలతో ఎంత గొప్పగా ఉంటాయో లోపలి బొమ్మలు సింపుల్ రేఖాచిత్రాలుగా రెండు మూడు రంగులకన్నా వాడకుండా అదికూడా ఫ్లాట్ గా అప్లై చేస్తూ అంతే depth ని కలిగి వుంటాయి. ఈ రకం గా గీయడం బహుశా ఆనాటి ప్రింటింగ్ లిమిటేషన్స్ వల్లనేమో తెలీదు. 
అయితే యువ పుస్తకం లో మాత్రం చాలా వరకు అన్నీ ఇదే శైలిని అనుసరించి గీసినవే..






ఈ రెండూ 'పావనం' పేరు తో చేసినవి. శ్యమంతక మణి బొమ్మలో కృష్ణుడి రూపు రేఖలలో  ఏదో తెలియని తేడా వున్నట్టు అనిపిస్తోంది ఎందుకో..!!


 
 

















1982 చందమామలో వచ్చిన ఈ రెండు బొమ్మలూ పైబొమ్మలను కొంత పోలి ఉండడాన్ని గమనించవచ్చు. అయితే గణపతి వివిధ రూపాలను చిత్రించేటప్పుడు పైబొమ్మలో శివ-కేశవులను తలపింప జేస్తే, క్రింది బొమ్మలో వివిధ వర్ణాలలో చిత్రించారు. శ్యమంతక మణి దృశ్యం లో క్రింది బొమ్మలో కంపోజిషన్, భావ ప్రకటన మొదలైన వాటి దృష్ట్యా నాకు క్రింది బొమ్మే నచ్చింది.   

పై బొమ్మలను  అందించిన శ్రీ శ్యాం నారాయణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)