Showing posts with label కృష్ణప్రియ. Show all posts
Showing posts with label కృష్ణప్రియ. Show all posts

Thursday, March 21, 2013

తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమం లో నామ సంకీర్తనం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. మరొక రోజు ప్రసారం అవుతుందట ...!
******************************************
Youtube link
 



పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల


చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్ 
*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

Wednesday, January 11, 2012

అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు..

అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు..

కాకినాడలోని అభ్యుదయ ఫౌండేషన్ వారు ఈ పోటీలను మొదట ప్రాంతీయ కేంద్రాలలో నిర్వహించి, ఆ పోటీలలో మొదటి రెండవ బహుమతులు గెలుచుకొన్న వారికి ఈ నెల రెండవ తేదీన కాకినాడలో రాష్ట్ర స్థాయి లో పోటీలు నిర్వహించారు. శ్రీ బాదం మాధవరావుగారి ఆధ్వర్యం లో జరిగిన ఈ పోటీలు గాత్రం, వీణ, ఫ్లూట్, వయోలిన్, సన్నాయి, మృదంగం, డోలు, సాక్సోఫోన్, మాండొలిన్ మొదలైన విభాగాలలో సీనియర్స్ జూనియర్స్ కి వేరువేరుగా జరిగాయి.

సుమారు డెబ్భై మంది వరకు ఈ పోటీలలో పాల్గొన్నారు. వారందరూ హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు కాకినాడల లో జరిగిన ప్రాంతీయ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి ఇక్కడకు వచ్చిన వారే. అందువల్ల పోటీలు పూర్తవటానికి రెండురోజులు పట్టింది. రెండోరోజు సాయంత్రం శ్రీ మల్లాది సూరిబాబుగారు విశిష్ట అతిధిగా జరిగిన కార్యక్రమంలో మొదటి బహుమతి గ్రహీతలతో ప్రదర్శన కూడా ఇప్పించారు.


న్యాయనిర్ణేతలుగా వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు పోటీలు ఒకే రోజులో పూర్తవక రెండవరోజు కూడా ఉండిపోవలసి వచ్చింది.  అంతమంది చిన్నపిల్లలు..( సీనియర్స్ కూడా ఇరవై ఏళ్లకు మించని వారే కావడం విశేషం) చాలా చక్కటి ప్రతిభలనంది పుచ్చుకొని ఇలాంటి సృజనాత్మక కళా రంగాలలో రాణించడం ముదావహం. 'స్పర్థయా వర్ధతే విద్యా' అన్నారు. కాని ఈ కుర్రవాళ్ళు అందరూ చాలా sportive spirit  తో మెలిగారు. పోటీలో ఒకరు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళని మిగతావారు ప్రోత్సహించడం, వాద్య కళాకారులకి తాళం వేస్తూ సహాయపడడం.. చూస్తోంటే చాలా ముచ్చటేసింది.

ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం లో ఇంతపెద్ద ఎత్తున శాస్త్రీయ సంగీతం లో పోటీలు నిర్వహిస్తూ, దాని వ్యాప్తికి కృషి చేస్తున్న అభ్యుదయ ఫౌండషన్, కాకినాడ వారు శ్లాఘనీయులు. 

మా అమ్మాయి కృష్ణప్రియకి జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసురాలు, మా శ్రీమతి కి గురువుగారు అయిన  శ్రీమతి మండ సుధారాణి గారి అమ్మాయి కుమారి ప్రత్యూష శ్రుతి రవళి కి సీనియర్స్ విబాగం లో మొదటి బహుమతి మరియు వయోలిన్ లో రెండవబహుమతి, ఉత్తమ ప్రతిభ కనబరచి నందుకుగాను బంగారు పతాకాన్ని కూడా కైవశం చేసుకొంది.  అలాగే జూనియర్స్ గాత్రం లో రెండవ బహుమతి పొందిన సువర్ణజ్యోతి (అంధ బాలిక) తన వైకల్యాన్నితన ప్రతిభతో అధిగమించి శభాష్ అనిపించుకొంది. మృదంగం లో జూనియర్స్ మొదటి బహుమతి పొందిన చిన్నారి కార్తికేయ అపర నందీశ్వరుడే అనిపించుకొన్నాడు. జూనియర్స్ వయోలిన్ లో మొదటి బహుమతి పొందిన హైదరాబాదు కి చెందిన శ్రీవత్స తొమ్మిదవ తరగతి చదువుతున్నాడట. తొమ్మిదేళ్ళ నుంచీ నేర్చుకొంటున్నాడట. సీనియర్స్ కి దీటుగా వాయించాడు.

వీరందరికీ ఆ సరస్వతీ దేవి కటాక్షం సంపూర్ణం గా లభించి భవిష్యత్తులో ఉత్తమ కళాకారులుగా ఎదిగి మన తెలుగువారికి  గర్వకారణం ఔతారని ఆశిద్దాం. 




పూర్తిగా చదవండి...

Sunday, December 11, 2011

'ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన' వారు నిర్వహించిన పోటీలు

ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన వారు ఈరోజు బాలబాలికలకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, లలిత సంగీతం, జానపద నృత్యం మొదలైన విభాగాలలో 5  నుంచి 15 సంవత్సరాల లోపు వారిని (జూనియర్స్) మరియు 15 నుంచి 25  సంవత్సరాల లోపు సీనియర్స్ కేటగిరీలలో పోటీలు జరిగాయి.
సుమారు ఒక్కో విభాగం లోనూ 30  మంది వరకూ పాల్గొన్నారు. ప్రతీ విబాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా రూ. 2116 /-, రూ. 1116/- లు ఇచ్చారు. వీరందరికీ మళ్ళీ, ప్రాంతీయ రాష్ట్రీయ స్థాయుల్లో మరలా పోటీలు నిర్వహిస్తారట.


శాస్త్రీయ సంగీతం జూనియర్స్ విభాగంలో మా అమ్మాయి కృష్ణప్రియకి ప్రథమ బహుమతి వచ్చింది. కాంభోజి వర్ణం పాడింది.
పూర్తిగా చదవండి...

Sunday, April 10, 2011

కాకినాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి శాస్త్రీయ సంగీత పోటీలు..


మా అమ్మాయి చి. కృష్ణప్రియకి కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి శాస్త్రీయ సంగీత పోటీలో జూనియర్స్ విభాగంలో ప్రైజ్ వచ్చింది.


ప్రత్యేక బహుమతి రూ. 800/- ఒక వర్ణం, ఒక కీర్తన పాడింది. న్యూస్ ఐటెం 'ఈనాడు - కాకినాడ ఎడిషన్' లో పడింది. పేరు పొరపాటుగా కృష్ణప్రియ బదులు "చిన్నారి శ్రీలత" అని పడింది. పాటకూడా అప్ లోడ్ చేద్దామని అనుకుంటూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి. మొత్తానికి చెయ్యనే లేదు.

పూర్తిగా చదవండి...

Saturday, September 18, 2010

ఆకాశవాణి లో కృష్ణప్రియ..

ఆకాశవాణి... విశాఖపట్నం కేంద్రం.. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో
ఈ రోజు చి. కృష్ణప్రియ పాడి పాటలు వింటారు.
ప్రసార సమయం: సాయంత్రం 5:౦౦, తేదీ: 18.9.2010 శనివారం.
ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

(ఇంతకీ కృష్ణప్రియ అంటే మా అమ్మాయి, మూడవ తరగతి చదువుతోంది.)

Get this widget | Track details | eSnips Social DNA
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)