ఎండాకాలం ఎండలు మండే కాలం. మా వైజాగులో వేడికి తోడు విపరీతమైన ఉక్కపోత. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు.. ఈ మధ్య నెలరోజులుగా కరెంటు కూడా తీసేస్తూండడంతో ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి. మొన్న ఒకరోజు పొద్దున్నే తీసేసి మళ్ళీ రాత్రి దాకా ఇవ్వలేదు. ఆ రోజు నేను ఆఫీసులో ఉండగా మా అమ్మగారు ఫోన్ చేసి అరడజను విసన కర్రలు కొని తెమ్మన్నారు. "అన్నెందుకు వేస్టు..!" అనుకోని బజారు కెళ్తే అయిదు రూపాయలకి ఒకటన్నాడు. ఒక్కసారి షాకయ్యా..!! వాటి ఖరీదు అంతతక్కువని అనుకోలేదు. (మా అమ్మగారూ షాకయ్యారు.. వాళ్ళ చిన్నప్పుడు పావలాకి ఒకటి, రెండూ వచ్చేవిట ) చిల్లర లేకపోవడంతో యాభై రూపాయలకి 10 కొని పట్టుకెళ్ళా. కానీ ఇంటికి వెళ్లి చూస్తే గానీ పరిస్థితి అర్థం కాలేదు. పది కూడా చాలవనిపించింది.
చీకటి పడ్డాక ఊరంతా కరెంటు లేకపోవడంతో మా ఇంట్లోవాళ్ళూ క్రింద అద్దె కున్నవాళ్ళూ అందరూ భోజనాలు ముగించి డాబా మీదకు చేరారు.
మేడ మీద చాపమీద పడుకొని విసనకర్రతో విసురుకుంటూ ఆకాశం లో నిండు చందమామని (దగ్గరలోనే 'సూపర్ మూన్' కూడా ఉందిట) చూస్తూ ఉంటే ఆహా..! పైగా కొత్త విసనకర్ర నుండి వచ్చే పచ్చి తాటాకు వాసన.. అబ్బో..మాటల్లో చెప్పలేం..!!
సరిగ్గా అప్పుడే తట్టింది ఈ తాటి చెట్టు, తాటాకు ప్రశస్తి..!
**************
అసలీ తాటి చెట్టు ప్రసక్తి రామాయణ భారతాల లోనే వుంది. శ్రీరాముడు తనమీద సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఏడు తాటి చెట్లను ఒక్క బాణం తోనే పడగొట్టాడట. తాటి చెట్టు అనగానే వేసవిలో వచ్చే తాటి ముంజులు గుర్తుకొస్తాయి. అవి తినడానికి ఇష్టపడని వాళ్ళెవరు చెప్పండి..? ఒక్కో తాటికాయలో రెండు, మూడు లేదా నాలుగు ముంజులుంటాయి. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో పల్లెటూర్లలో చెట్టు మీద నుంచీ అప్పుడే దించిన కాయల్లో ముంజులు మన బ్రోటనవేలే స్పూన్లుగా డైరెక్టుగానే తినేసేవాళ్ళం. ముంజులు ఒలిచి తట్టల్లో పెట్టుకొని ఇళ్ళకి తెచ్చి అమ్మేవారు. ఇవికాక తాటి తాండ్ర, తాటి బెల్లం, తాటి తేగలు కూడా తింటారు. తాటి కల్లు సంగతి సరేసరి. ఇప్పటికీ ఇంకా వాడుతున్న/ వాడబడుతున్న, ఎంతోమందికి నోరూరించే తాటి ఉత్పత్తి.
తాటాకుల ఉపయోగాలు అనేకం..!
మొట్టమొదటగా కాగితాలూ, పుస్తకాలూ వినియోగం లోకి రాక ముందు తాటాకులే కవుల కావ్య రచనకు ఉపయోగపడేవి. వీటిమీద ఇప్పుడు బొమ్మలుగీసి కూడా అమ్ముతున్నారు. పేదవాడి గూటికి పైకప్పుగా విరివిగా వాడతారు. వాసాలుగా తాటి దూలాలే వాడడం తెలిసిందే..! ఇప్పటి షామియానాలు రాకముందు పెళ్ళిళ్ళకి తాటాకు పందిళ్ళు వేసేవారు. విసనకర్రలు, చేదలూ(కొన్ని ప్రాంతాలలో దీనిని 'బొక్కెన' అంటారనుకుంటా)
'గిడుగు' అనబడే తాటాకు గొడుగు (దీనిలో సైజు లుండేవి..పెద్దది సుమారు 5 అడుగుల వెడల్పు వుండేది. ఇప్పటికీ పల్లెల్లో పశువుల కాపర్లు వాడుతుంటారు.), తాటాకు చాపలు కూడా తయారు చేసేవారు. ( పూర్వం పెళ్ళిళ్ళల్లోనూ లేదా ఎక్కువ మందికి భోజనాలు వండేటప్పుడు వండిన అన్నాన్ని గంజి వార్చిన తరువాత ఈ తాటాకు చాపల మీద కొంచం సేపు ఆరపోసేవారు.)

చెరకు బెల్లం, తాటి బెల్లం |

విసన కర్రలు, తాటాకు బుట్ట.. |
తాటాకుల మీద బొమ్మలు వేసే పద్ధతిని ఇక్కడ చూడండి
తాళ పత్రాలు |
గిడుగు |
పైనున్న వాటిల్లో మొదటిది తాటాకు చాప, రెండోది కొబ్బరాకుల చాప.
తాటి, కొబ్బరి ఆకులతో పెళ్లి మంటపాల అలంకరణ |
బూర (whistle ) |
రిస్ట్ వాచీ. |
తాటాకు గిలకలు.. ఇలా బంతుల లాగా తయారు చేసి దానిలో రాళ్ళు వేసి ఒక కర్రపుల్లని హాండిల్ గా పెట్టి ఆడిస్తే గలగల లాడుతూ శబ్దం చేస్తాయి. చంటి పిల్లలకి ఆటవస్తువులుగా పనికొచ్చేవి. |
తాటి రేకు టపాకాయలు. |
తాటాకు చేద లాగే ఉన్న ఈ సంగీత వాయిద్యాన్ని చూడండి. Sasando అంటారుట దీన్ని. శబ్దం మాత్రం గిటార్, మాండొలిన్ లను పోలి ఉంది. దక్షిణ ఇండోనేషియా లో కనిపించే ఈ పరికరం మీద వీనుల విందైన సంగీతం విని ఆస్వాదించండి.
ఇప్పటికీ గ్రామాల్లో పొలాలకి హద్దుగా తాటి పెండు (తాటి చెట్ల వరుస లేదా గుంపు) లనే చూపుతారు. మోటార్లు లేకమునుపు బావుల్లోంచీ పొలాలకి నీరు తోడడానికి వాడే 'ఏతాం' తాటి దుంగలతోనే చెయ్యబడేది. తాటి తోపుల్లో దయ్యాలు ఉంటాయని అని నమ్మే వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తారు.
ఇకపోతే తాటి చెట్టు కి సంబంధించిన సామెతలు తెలుగులో చాలానే వున్నాయి. మొట్ట మొదటి పేరాలో ఒకటి ఆల్రెడీ వ్రాసేశాను. కోపం తాటాకు మంటలా ఉండాలంటారు. తాడిలా పెరిగాడంటారు. తాడిని తన్నేవాడితలదన్నే వాడుంటారు తాటి చెట్టు వల్ల ఇన్ని లాభాలు ఉన్నా తాటి చెట్టు నీడ, తాగుబోతు మొగుడూ ఎందుకూ పనికిరారు అంటారు. చివరగా తాటి చెట్టు నీడ పనికిరాదన్న విషయాన్ని చెబుతూ ఏనుగు లక్ష్మణ కవి ఇలా అంటాడు:
“ధర ఖర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై
త్వరతోడన్ పరువెత్తి చేరినిలిచెన్ తాళద్రుమఛ్ఛాయ త
ఛ్ఛిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా
పొరి దైవోపహతుండు పోవునెడకుం పోవుంగదా ఆపదల్”
త్వరతోడన్ పరువెత్తి చేరినిలిచెన్ తాళద్రుమఛ్ఛాయ త
ఛ్ఛిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా
పొరి దైవోపహతుండు పోవునెడకుం పోవుంగదా ఆపదల్”
ఒక బట్టతలవాడు మండుటెండలో ప్రయాణం చేస్తూ ఎండకు బుర్ర కాలిపోతూ ఉంటే, ఆ వేడికి తట్టుకోలేక నీడకోసం తాటిచెట్టు కిందికి పరుగెత్తాడట. ఎండ నుంచి రక్షించుకోవడానికి దానికింద చేరితే చెట్టు పైనుంచి తాటిపండు అతని నెత్తిమీద పడింది. పాపం అతని తల పెద్ద చప్పుడుతో పగిలిపోయిందట . దురదృష్టవంతుడు ఎక్కడికి పోయినా ఆపదలు వెంటాడుతాయనేది కవి వ్యాఖ్య.
అందువల్ల ఒక్క నీడ విషయంలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ తాటి చెట్టుకి నూటికి నూరు మార్కులే..!!
(ఇంతలో కరెంటు వచ్చేసింది. అందరూ 'తాటాకు పంఖాలు' వదిలేసి మళ్ళీ సీలింగ్ ఫ్యానుల కిందకి చేరారు.)
మనం కూడా ఇంక ఈ ముచ్చట్లు ఆపి మళ్ళీ రేపటి వరకూ విసనకర్రలకి చెబుదాం సె 'లవ్' (Say Love)
వివరాలతో చాలా విషయాలు చెప్పారు, చాలా బాగుంది ఈ టపా.
ReplyDeleteచాలా బాగా చెప్పారు ! తాతితాoడ్రా నాకు చాలా ఇష్టం. మా తాత గారు ఒకాయన వేసవి రాగానే విసనకర్రాలు .. మామిడిపళ్ళు పంచిపెట్టి ..అప్పుడు తను తినేవారు :) ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి.
ReplyDeleteతాటి చెట్టు వల్ల నిజంగా ఎన్ని ఉపయోగాలు !? :)
బాగుందండీ! ఈ బొమ్మలన్నీ నేనూ చేశాను చిన్నప్పుడు. తాటి ముంజెలు, తేగలు చూపించి నోరూరించటం ఏమీ బాలేదు! అన్నట్టు తాటిముంజెలు తీసేసాక ఆ తాటి కాయలతో బండ్లు కట్టేవారు కదా!
ReplyDeleteaha na chinna nati roju gurtukuvatchai, nenu chinnapudu sompuram agraharam vellevadni prathe vesavi selavulo ede pani Thati munjulu .... ekkuvaga sevistey mamedi kayalu veerugudu twaraga aregepoyede ...chala santhosam manchiga gurtuchesaru
ReplyDeleteఆహా నా చిన్ననాటే రోజులు గుర్తుకోత్చాయీ , చిన్నప్పుడు నేను సోంపురం అగ్రహారం వేల్లవళం వేసవిసేలువులకు. ప్రోడున్న మద్యహన్న ఈదేపని తాటి మున్న్జులు. ఎక్కువగా తింటే మామిడే కాయలు వీడుగుడు . చిటిక్కున అరిగేపోఎది మరిచాటే రోజ్జు మల్లి సిద్దు ఐపోఎవాళ్ళం .. చాల సంతోషం గా వుంది మల్లి ఆ రోజులు రావు మల్లి చేయలేము ... ఈల గుతుకు వచాయి సంతోషం గా వుందీ....
ReplyDelete@sunil: thanks for your comment.
ReplyDeleteఅద్భుతంగా ఉందండి మీ వ్యాసం. వెనుకటికి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తాటిచెట్టు మీద వ్యాసం వ్రాసినట్టు గుర్తు. అయినా మీ వ్యాసం ఈ మండుటెండల్లో ఎంతో హాయిగొలిపింది. చక్కని వ్యాసం, బొమ్మలు అందించిన మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.
ReplyDeleteemi cheppamantaru enni cheppinaa takkuve....... chinnathanamlo happy ga undedi summer lo manakinka verepane ledu
ReplyDeleteతాటి ముచ్చట్లు బాగున్నాయి.
ReplyDeleteIt seems that the leaves that are used to write are from a slightly different tree taaLa http://te.m.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%AE%E0%B1%81
ReplyDeleteTatitandra sugar vunnavallu tinochha... Kidney stone vunnavallu
ReplyDeleteఅయ్యా, మన్నించాలి. నాకు తెలీదండీ..! మీరు ఎవరినైనా డైటీషియన్ ను సంప్రదిస్తే మంచిది.
Deletehttps://www.youtube.com/watch?v=kzoai1TDFBY&t=93s
DeleteThank You and that i have a neat offer: Where To Start Home Renovation split level kitchen remodel
ReplyDelete