వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది. ఇప్పటివరకు లభ్యమవుతున్న వారి పెయింటింగ్స్ లో రాగాల పేర్లతో ఉన్న ఈ క్రింది బొమ్మలు అన్నీ మన బ్లాగు మిత్రుల సౌకర్యార్థం ఒక దగ్గర ఉంచాను. యువ లో వారి పెయింటింగ్స్ కొన్ని ప్రత్యేకమైన శీర్షికలతో వచ్చాయి. కొన్ని నక్షత్రాలకు కూడా వారి చిత్రణలో, రూపమిచ్చారు.
అయితే వపా గారు రాగాల పేర్లతో చిత్రించిన ఈ చిత్రాలు చూస్తే వాటి పేరుని బట్టీ, దానికి సరిపోయే సన్నివేశాన్ని చిత్రించినట్టు కనిపిస్తోంది. జన రంజని - జనాన్ని రంజింపజేసేది (సినిమా తారలా అనిపిస్తోందినాకు.. అక్కడ చూపించిన జనం సినిమా హాలులో కూర్చున్నట్టుంది), కదన కుతూహలం - యుద్ధానికి తరలుతున్న సైనికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలికే సన్నివేశం. భాగేశ్వరి రాగానికి శివుడి అర్థనారీశ్వర రూపాన్ని చిత్రించిన తీరు చూడండి. అలాగే శివరంజని, అమీర్ కల్యాణి...!!
క్రొత్తగా సంగీతం నేర్చుకొనే వారు మొట్టమొదట అభ్యాసం చేసే సరళీ స్వరాలూ, జంటస్వరాలూ, అలంకారాలూ వంటివి మాయామాళవ గౌళ రాగం లోనే వుంటాయి. అందుకే ప్రథమ పూజలందుకొనే గణపతికి కైమోడ్పులిస్తున్నచిన్నారిని (ఎదురుగా చిన్న పియానో / హార్మోనియం తో సహా) చిత్రించినట్టున్నారు.
యమునా కళ్యాణికి - యమునాతీరంలో గోపికలూ, ఆలమందలూ, రాధ తో విహరిస్తున్న కృష్ణుడిని చిత్రించారు. అలాగే శ్రీ రాగానికి లక్ష్మీదేవి విష్ణువుని వరించే సన్నివేశాన్నిచిత్రించారు. (శ్రీ - అంటే లక్ష్మి కదా..!) సన్నివేశాన్ని జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనం లో ఉద్భవించిన లక్ష్మీ దేవి, ఆసనం గా పద్మం, ఉరకలెత్తుతున్న సముద్రం, అప్పుడే పాల సముద్రం లోంచీ పుట్టిన చంద్రుడు కనిపిస్తారు.
'కీరవాణి' రాగానికి రతీ మన్మధులని గీస్తూ emphasis వాహనమైన చిలకకి ఇచ్చారు. అలాగే 'సారంగ' రాగానికి గీసిన బొమ్మలో జింక బొమ్మ ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాగే మిగిలిన రాగాల పేర్లకీ ఈ చిత్రాలకీ వున్నసంబంధాన్ని తెలిసిన వారెవరైనా ఇంకాస్త వివరిస్తారని ఆశిస్తున్నాను.
 |
| కన్నడ - శహన |
 |
| బేహాగ్ - మలయ మారుతం |
 |
| జన రంజని |
 |
| శ్రీరంజని |
 |
| మేఘ రంజని |
|
| రంజని |
 |
| కీరవాణి |
|
|
| సారంగ |
 |
| ముఖారి |
 |
| భాగేశ్వరి |
 |
| కదనకుతూహలం |
 |
| శివరంజని - హిందోళ |
 |
| సోహిని - మేఘరంజని - మాల్కోస్ |
 |
| కాంభోజి - కాపి |
 |
| జయజయవంతి - అహిర్ భైరవి |
 |
| మేఘ మల్హార్ |
 |
| చారుకేశి |
 |
| కేదార గౌళ |
 |
| మాయామాళవగౌళ |
 |
| యమునా కల్యాణి |
 |
| యమునా కల్యాణి |
 |
| అమీర్ కల్యాణి |
 |
| శ్రీ రాగం |
 |
| మాల్కోస్ |
************************************
వపా గారి నక్షత్ర బాలలు మరో పోస్టులో..!!
పై ఫోటోలు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్యాం నారాయణ్ గారి సౌజన్యంతో...! వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.