Sunday, October 16, 2011

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!



యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి  బొమ్మలు  మరికొన్ని...!! 
పురాణాలకూ ఇతిహాసాలకూ సంబంధించిన బొమ్మల్లో కూడా మోడరన్ ఆర్ట్ ని చొప్పించ గలిగే శైలి వడ్డాది పాపయ్య గారి శైలి అనితర సాధ్యం. చందమామ కవర్ పేజీలు బొమ్మలు సప్తవర్ణ సమ్మేళనాలతో ఎంత గొప్పగా ఉంటాయో లోపలి బొమ్మలు సింపుల్ రేఖాచిత్రాలుగా రెండు మూడు రంగులకన్నా వాడకుండా అదికూడా ఫ్లాట్ గా అప్లై చేస్తూ అంతే depth ని కలిగి వుంటాయి. ఈ రకం గా గీయడం బహుశా ఆనాటి ప్రింటింగ్ లిమిటేషన్స్ వల్లనేమో తెలీదు. 
అయితే యువ పుస్తకం లో మాత్రం చాలా వరకు అన్నీ ఇదే శైలిని అనుసరించి గీసినవే..






ఈ రెండూ 'పావనం' పేరు తో చేసినవి. శ్యమంతక మణి బొమ్మలో కృష్ణుడి రూపు రేఖలలో  ఏదో తెలియని తేడా వున్నట్టు అనిపిస్తోంది ఎందుకో..!!


 
 

















1982 చందమామలో వచ్చిన ఈ రెండు బొమ్మలూ పైబొమ్మలను కొంత పోలి ఉండడాన్ని గమనించవచ్చు. అయితే గణపతి వివిధ రూపాలను చిత్రించేటప్పుడు పైబొమ్మలో శివ-కేశవులను తలపింప జేస్తే, క్రింది బొమ్మలో వివిధ వర్ణాలలో చిత్రించారు. శ్యమంతక మణి దృశ్యం లో క్రింది బొమ్మలో కంపోజిషన్, భావ ప్రకటన మొదలైన వాటి దృష్ట్యా నాకు క్రింది బొమ్మే నచ్చింది.   

పై బొమ్మలను  అందించిన శ్రీ శ్యాం నారాయణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 

4 comments:

  1. రాధేశ్యాం,

    వపా గారి వేసిన బొమ్మలని ఓపికగా సేకరించి అందరికీ చూపించటం ముదావహం. వపాగారు వేసిన కృష్ణుడు బొమ్మలో ఏదో తేడా ఉన్నదనిపిస్తున్నది అని వ్రాశారు. వపాగారు ఆ బొమ్మని, ఎన్ టి రామారావులాగ వెయ్యబోయి, తరువాత మధ్యలో మనసు మార్చుకున్నట్టుగా అనిపిస్తున్నది.

    మీ బ్లాగులో కుడిపక్కన కనపడుతున్న బ్లాగుల్లో "మన తెలుగు చందమామ" ఉన్నది. కాని ఆ బ్లాగు పేరు నేను ఈ మధ్యనే "అలనాటి తెలుగు చందమామ" గా మార్చాను. మీరు లింకు మార్చగలరు. పేరుమార్చబడిన బ్లాగుకు లింకు ఈ కిందివిధంగా ఉన్నది.

    http://alanaatiteluguchandamaama.blogspot.com/

    ReplyDelete
  2. మందాకిని గారూ సంతోషం అండీ..
    శివగారూ.. నేనుకూడా ఆ బొమ్మ చూసి ఎన్టీయారేనని అనుకున్నాను.
    మీ బ్లాగ్ అడ్రెస్స్ కూడా మార్చాను.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)