Sunday, October 16, 2011

'వేయి పడగలు' చదివేశానోచ్...!

అవును.. వేయి పడగలు నిజం గానే చదివేశాను..!
ఎన్నాళ్ళ నుంచో చదువుదామనుకొంటున్నపుస్తకం, సుమారు మూడేళ్ళ క్రితం విశాలాంధ్ర వారి పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకం, పేరు తప్ప దాని గురించి మరింకేదీ తెలియని పుస్తకం, మొత్తానికి మొదలెట్టి పూర్తిగా చదివేసాను. వారం రోజులకి పైనే పట్టింది చదవడానికి. ఎక్కడా స్కిప్ చెయ్యకుండా మొత్తం చదివాను.  దసరా ముందరి రోజుతో పూర్తయిపోయింది.

నవలను విశ్వనాధ సత్యనారాయణ గారు ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారట. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశారట. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.
 
ఆ పుస్తకాన్నికొని దగ్గర మూడేళ్ళు కావస్తున్నాదాని సైజు చూస్తేనే భయమేసి కొంత (సుమారు 850  పేజీలు), భాష గ్రాంధికం కావడం కొంత నేనుమొదలుపెట్టడానికి ధైర్యం చెయ్యలేక పోవడానికి కారణాలు. అయితే మొదలుపెట్టిన తరువాత బాగానే వెళ్ళింది. చాలా ఇంటెరెస్టింగ్ గా వెళ్ళింది. విశ్వనాధ వారి భాష, శైలి ఎంతగా హత్తుకుపోయాయంటే.. మొదలుపెట్టిన మూడోరోజునుంచీ నేను గ్రాంధికం లో మాట్లాడడం మొదలెట్టాను. (ఇంట్లోనే లెండి..!). చివరకు వచ్చేసరికి, విశ్వనాధ వారివి పుస్తకాలు ఇంకేమేమి వున్నాయో, లేదా వారి రచనల పైన సమీక్షలేమైనా దొరుకుతాయేమోనని   (ఇంటర్నెట్లో) వెతుకులాట మొదలుపెట్టాను. మొత్తానికి హహాహుహూ, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, ఏకవీర, ధూమ రేఖ, భగవంతుని మీది పగ, డా. ఎస్ గంగప్ప గారు వ్రాసిన 'వేయి  పడగలు - విశ్లేషణాత్మక విమర్శ' మొదలైన పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోగలిగాను. అలాగే పుస్తకం.నెట్ లో గుప్తపాశుపతము మొదలైన పుస్తకాల పై సమీక్షలు చూసాను. విశ్వనాధగారి రచనలను ద్వేషించి వారి పై వ్యక్తిగతంగా కూడా విషం కక్కినవారు వారి కాలం లోనే ఎందరున్నారో.. ఇప్పటికీ వారినీ, వారి రచనలనూ నెత్తిన పెట్టుకొని పూజించే వారూ అంతకంటే ఎక్కువ గానే వున్నారు.
ఈ క్రింది లింకులు చూస్తే ఆ విషయం బోధపడుతుంది. విశ్వనాధ సత్యనారాయణ గారు ఈపుస్తకం లో ఆనాటి సమకాలీన పరిస్థితులను పాత్రలకు అన్వయిస్తూ వివరిస్తారు. సంవత్సరాలు, ఋతువులూ వర్ణిస్తారు. కధా రంగం అయిన సుబ్బన్న పేటనూ, మూడు నాలుగు వందల సంవత్సరాల ఆ ఊరి చరిత్రనూ  చెబుతూ ఆ చిన్న పల్లెటూరు ఒక మోస్తరు పట్టణంగా రూపాంతరం చెందడం, దానికి దారి తీసిన పరిస్థితులూ విపులం గా చర్చిస్తారు. ఊరిలో వుండే ముఖ్య మైన కుటుంబాలైన, జమిందారు కుటుంబం, వారికి మంత్రులుగా వ్యవహరించే బ్రాహ్మణుల కుటుంబం, గణాచారి(ఈమె ఆ ఊరి కాపు యొక్క ప్రథమ సంతానం) గా పిలువబడే కాపు కుటుంబం యొక్క మూడు నాలుగు తరాలను కళ్ళముందు ఉంచుతారు. ఈ మూడు కుటుంబాల వారూ కలసి నెలకొల్పిన సుబ్రహ్మణ్యేశ్వరుడే వేయి పడగలతో అలరారుతుంటాడు. ఊరి సంప్రదాయాలూ, నమ్మకాల పట్ల తరాలు మారే కొద్దీ వచ్చే అంతరాలూ, పాత్రలకు వయసు పెరిగే కొద్దీ వారిలో కలిగే  వ్యక్తిత్వ వికాసం మొదలైన విషయాలను పాత్రల మనో విశ్లేషణ, వారి మధ్య సంభాషణల ద్వారా అద్భుతంగా నడిపిస్తారు.
*******************************************************************************
వికీపీడియా సౌజన్యంతో:
నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం మరియు దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను వారి కుమారుడు విశ్వనాధ పావనిశాస్త్రి కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు

సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు; మేరుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర ధర్మారావు - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు; కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;
గుంటూరు .సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి.
 
విశ్వనాధ వారి వేయిపడగలు మొదటి భాగపు చిత్రము
నవలను విశ్వనాధ వారు అంకితమిస్తూ ఇలా రాసుకొన్నారు-
నీవొక పెద్ద వెల్గువయి నీ వెలుగారిన నాదు జీవిత
వ్యావృతి యీ కవిత్వ మనునట్టీ విచిత్రపు నీడ పారె
దేవీ'అరుంధతీ ప్రముఖ దివ్యమహా పరిలీన మూర్తి
నీ వెలుగుల్ పరోక్షమయి నేటికి నీడలు పారజొచ్చెడున్
*******************************************************************************
ఈ నవల మీద సమీక్షలు చాలా తక్కువగా కనిపించాయి. భావ నిక్షిప్త బ్లాగు నిర్వహిస్తున్న శ్రీ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు వ్రాసిన సమీక్ష చాలా నచ్చింది. ఈ క్రింది లింకులు నొక్కి ఆ సమీక్షని చదవొచ్చు. సంక్షిప్తంగా కథ మొదటి మూడు భాగాల్లోనూ, చివరి భాగం లో విశ్లేషణ ఇచ్చారు.

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - రెండవ భాగం 

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగం

విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణ 

VeyiPadagalu - A review  sarath krishna బ్లాగు లో వ్రాసిన రివ్యూ (ఇంగ్లిష్ లో) చూడండి.

వేయిపడగలు – శ్రీ విశ్వనాథ సత్యనారాయణ - పుస్తకం.నెట్ లో శ్రీవల్లి రాధిక గారు వ్రాసిన సమీక్ష

వీరందరికీ పేరుపేరునా మనఃపూర్వక ధన్యవాదాలు.

డా. ఎస్ గంగప్ప గారు వ్రాసిన 'వేయి  పడగలు - విశ్లేషణాత్మక విమర్శ' పుస్తకము ఆర్కైవ్.ఆర్గ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

(ఈ నవల నా అంతట నేనుగా సమీక్ష వ్రాయడానికి.. "ఇంకా ఒకసారే కదా చదివాను...! అందుకే ఇంకోసారి చదివాకా నైనా వ్రాయగలనేమో చూస్తాన"నుకోని ఈసారికి ఇలా కానిచ్చేశాను..!)

13 comments:

 1. telugulo elaa raayalo theliyaledu. anduke tenglish lo rastunnaanu. veyi padagalu chadivi telugu vadigaa meeru charitardhulayyaaru. baddanna senani, dindukinda poka chekka vanti chinna rachanalu chadivina nenu, veyi padagalu, ramayana kalpavruksham chadavadaniki inka sahasinchaleka poyanu. mee nunchi sphoorti techukuni chaduvuthaanu.
  Viswanadhavaaru entativarinainaa lekka chesevaru kadani cheputharu. Andhra Patrika sampadakudu Sambhuprasad garitho aayana godava paddappudu, "Vijayawadalo Rathiki Bharatiki Khareedu Ardha Roopaye ani, Annarani, aa vishayam Sambhu Prasad gariki telisi, Viswanatha vari meeda Tripuraneni Ramaswamy Choudari garitho punkhanu punkhaaluga vyasalu rayinchi Bharatilo prachurincharani cheputharu.
  Jonnalagadda Radha Krishna.
  jonnalagadda3@gmail.com

  ReplyDelete
 2. రాధేశ్యాంగారు! ఆ మధ్య ఫోన్లో మీరు వేయిపడగలు చదువుతున్నాను అని చెప్పారు. ఈ పుస్తకం నా దగ్గరలేదు. మీరు చెప్పేదాకా ఇదొక జానపదకధ
  అనుకున్నాను. తప్పక కొని చదువుతాను. శ్రి విశ్వనాధలాంటి కవులు మనకున్నందుకు నిజంగా తెలుగు వాళ్ళు ధన్యులు.

  ReplyDelete
 3. Anonymous has left a new comment on this post "'వేయి పడగలు' చదివేశానోచ్...!":

  I started reading veyipadagalu and it is very good. What his guess and opinion on the current trend of the society very true. I do not think there will be another viswanatha will born in at least next 100 years.Hats off.
  (ఈ కామెంట్ ని నేను పొరపాటున తొలగించాను. అందుకే మళ్ళీ ప్రచురించాను)

  ReplyDelete
 4. అయ్యా,

  నేను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పట్టణంలో, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజులలూ శ్రీవిశ్వనాథవారి వేయిపడగలు నవలను చదివాను. నిజానికి ఆ పుస్తకాన్ని మా నాన్నగారు తాను చదవటానికి గాను తెచ్చుకున్నారు. కాని నేను ముందుగా మొదలు పెట్టి భల్లూకపు పట్టుతో ఏకబిగిన చదివినట్లు నాకింకా బాగా గుర్తు. అప్పుడు నేను జవరం వచ్చి యింటి పట్టునే ఉన్నాననీ, ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా దాన్ని చదువుతూనే కాలక్షేపం చేసాననీ కూడా బాగా గుర్తు. ఆ తరువాత కూడ మరికొన్ని సార్లు వేయి పదగలు చదివి ఆనందించాను. చాలా గొప్ప పుస్తకం

  అలాగే అదవి బాపిరాజుగారు పుస్తకాలూ కాలేజీ రోజుల్లోనే చదివాను. ముఖ్యంగా నారాయణరావు అనే‌ నవల. దానికి కూడా అదవివారికి, వారిగురువులు విశ్వనాథవారికి ఇచ్చినట్లే ప్రథమబహుమతిని ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు ప్రదానం చేసారని చదివాను.

  ReplyDelete
 5. చాలా సంతోషం అండీ..!
  నేను అడవి బాపిరాజు నవలలేవీ చదవలేదు ఇంకా..! మంచి సమాచారం అందించి నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. నేను చదివాను 10 సంవత్సరాల ముందు .మా పాప కడుపులో ఉన్నప్పుడు. 9 నెలలు పైనే పట్టింది మొత్తం చదవడానికి.అప్పుడు నాకు వేయిపడగలు పుస్తకమే నేస్తం .నేను ఎదో చిన్న చిన్న కవితలు రాస్తుంటాను అవన్నీ నా బ్లాగ్లో రాసాను మీకు వీలయితే చదివి మీ సలహాలు చెప్పగలరు .
  నాకు శ్రీ శ్రీ రచనలంటే చాల ఇష్టం .

  ReplyDelete
 7. Inspite of trying many times to write in Telugu I am unable to do so,...Hence this in.eng.I read veyipadgalu way back 1969 soon after joining puc in just 3days.ofcourse that reading fever has culminated into high fever and unbearable head ache .It was telecasted in both Teugu &Hindi..Translated version by our late p.m. Sri P.V.Narasimha Rao garu has fetched him Kendra sahitya academy award..

  ReplyDelete
  Replies
  1. ​​Friends !!   ​​వేయిపడగలు, పుస్తకం గురుంచి, నా మిత్రుల దగ్గర నుంచి విన్న తరువాత మరియు మీ అందరి రివ్యూస్ చూసాక, ఆ పుస్తకం చదవాలని చాలా ఆశక్తి గా వుంది. దయచేసి మీరు ఎవరైనా, ఆ పుస్తకం లభ్యమయ్యే మార్గాన్ని నాకు తెలియచేయవలసింది. నేను ప్రస్తుతం పూణే లో వుండటం వల్ల , ఇక్కడ నాకు ఆ పుస్తకం దొరకదు.

   Request you to please provide some contacts or email ids of the persons/publishers, whom can I check with, to get this book.


   My email id : ramanmalladi@gmail.com

   Contact nUmber: +91 7757015338

   Delete
 8. సత్య సాయి కిరణ్
  వేయి పడగలు పిడిఎఫ్ డౌన్లోడ్ కోసం ఉంచగలరు

  ReplyDelete
 9. ​​వేయిపడగలు, పుస్తకం గురుంచి, నా మిత్రుల దగ్గర నుంచి విన్న తరువాత మరియు మీ అందరి రివ్యూస్ చూసాక, ఆ పుస్తకం చదవాలని చాలా ఆశక్తి గా వుంది. దయచేసి మీరు ఎవరైనా, ఆ పుస్తకం లభ్యమయ్యే మార్గాన్ని నాకు తెలియచేయవలసింది. నేను ప్రస్తుతం పూణే లో వుండటం వల్ల , ఇక్కడ నాకు ఆ పుస్తకం దొరకదు.
  udaykiran.guntupalli143@gmail.com

  ReplyDelete
 10. ఈ పుస్తకాన్ని ఆన్‍లైన్‍లో ఈ క్రింది లింకుల ద్వారా కొనుక్కోవచ్చు:
  http://www.telugubooks.in/products/veyi-padagalu

  http://kinige.com/book/Veyipadagalu
  చక్కని డిటిపి తో కొత్తగా కంపోజ్ చేసి ప్రింటు చేసిన హార్డ్ బౌండ్ పుస్తకం..!
  తెప్పించుకొని మొదలుపెట్టండి..!

  ReplyDelete
 11. వేయి పడగలు పుస్తకం ఫోన్ లో చదవటం వీలు అవుతుందా. ఒక వేళ అయితే ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చెప్పండి

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)