Saturday, July 20, 2013

ఆండ్రాయిడ్ ఫోన్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ని జోడించడం ఎలా??


ఆండ్రాయిడ్ ఫోన్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ని జోడించడం ఎలా??
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson)

MultiLing Keyboard
Multiling Keyboard
Telugu Pride Telugu Editor
Telugu Pride Editorనా ఫోన్ సోనీ ఎరిక్సన్ XPERIA X10i లో తెలుగు ఫాంట్ install  చెయ్యడానికి శతవిధాల ప్రయత్నించి, కుదరక ఆఖరికి 'ఓపెరా మిని' తో పని కానిచ్చేస్తూ ఉండేవాడిని. ఈ పధ్ధతిలో తెలుగు లిపి బ్రౌజర్లో చూడడం వరకు పర్వాలేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లతో డిఫాల్ట్ గా వచ్చే అప్లికేషన్స్ (ఉదా. జి-మెయిల్, యాహూ మెయిల్ లాంటివి, తెలుగులో ఉన్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్) లో మాత్రం డబ్బాలే కనిపించేవి. మన బ్లాగు ఫోన్ లో ఓపెరా మినీ ద్వారా చూసినా కామెంట్ మనం మళ్ళీ తెలుగులో టైపు చెయ్యాలంటే అస్సలు కుదరదు. తెలుగులో టైపు చెయ్యడానికి ఆండ్రాయిడ్ మార్కెట్ లో కొన్ని తెలుగు టైపింగ్ అప్లికేషన్స్ (MultiLing Keyboard app , My Alpha app , Telugu Pride Editor లాంటివి  ) ఉన్నాయి కానీ, అన్నీ ఆవు కాంపోజిషన్ లో లాగ "ఇన్-బిల్ట్ తెలుగు ఫాంట్ - డబ్బాలు" దగ్గరకే వచ్చి ఆగేవి. ఆ టైపు రైటర్ తో టైపు చేసిన అక్షరాల రెండరింగ్ సరిగ్గా కనిపించేది కాదు. అంటే తెలుగు లిపి ఇలా కనిపించేది: (ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి)
   


ఇన్ బిల్ట్ ఫాంట్ ఉంటే ఈ సమస్యలన్నీ పోతాయి. Telugu Pride Editor,  ఐఫోన్ లో చాలా బాగా కనిపిస్తోంది. Samsung S III లాంటి కొన్ని మోడల్స్ తెలుగు ఫాంట్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ లో మాత్రమే ఆ సదుపాయం లేదు.
                వెతగ్గా వెతగ్గా అర్థమైన సంగతేమిటంటే ఫోన్ లో మనకి కావలసిన ఫాంట్లు డౌన్లోడ్ చెయ్యాలంటే మన ఫోన్ ని 'ROOT' చేసుకోవాలట. అయితే రిస్క్ ఏమిటంటే ROOT చెయ్యబడిన తరువాత / లేదా చేస్తూ ఉండగా మొదటికే మోసం వచ్చి ఫోన్ పేపర్ వెయిట్ గా తప్ప మరి దేనికీ పనికిరాకుండా పోవచ్చుట. పర్ఫెక్ట్ గా పనిచేసినా చెయ్యవచ్చుట. సాహసం శాయరా డింభకా ..! అనుకోని మొత్తానికి నా ఫోన్  ROOT చేసేసాను. పర్ఫెక్ట్ అవునో కాదో తెలీదు కానీ చిక్కులేమీ ఎదురుకాలేదు. వెంటనే యూనికోడ్ ఫాంట్ 'లోహిత్ - తెలుగు' install  చేసి చూశాను. కానీ పని చెయ్యలేదు. అసలు Install అవలేదు. సరేలే! ఫోను పాడవ్వలేదు అనుకోని  ఊరుకున్నాను.
                   ఈలోగా ఒక తమాషా అయిన పద్దతి లో గుజరాతి ఫాంట్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో install చేసిన వ్యక్తి వ్రాసిన పోస్టు కనిపించింది. దీనికి కూడా మన ఫోన్ తప్పనిసరిగా ROOT చెయ్యబడి ఉండాలి. కాన్సెప్ట్ ఏమిటంటే మనదగ్గర ఉన్న యూనికోడ్ ఫాంట్ ని, ఫోన్ లోని system ఫాంట్ (ఇన్-బిల్ట్ ఫాంట్) పేరుతో rename చేసి ఈ rename చెయ్యబడిన మన ఫాంట్ ని ఫొన్ లోని సిస్టం ఫాంట్ మీద Overwrite చేసెయ్యాలి. 

పైన పేర్కొన్న పోస్టు లో చెప్పిన స్టెప్స్ నేను ఈ క్రింది విధంగా అమలు చేసాను. 
  1. కంప్యూటర్ లో "C:\Windows\Fonts" ఫోల్డర్ లో ఉన్న యూనికోడ్ ఫాంట్ (ఉదా. గౌతమి) ని తీసుకొని  ఫోన్ యొక్క SD కార్డు లోకి copy చేశాను.  
  2. SD కార్డు లోకి copy చేసిన ఫాంట్ ని "DroidSansThai.ttf" గా rename  చేశాను. (ఈ ఫాంట్ పేరుతో మన ఫోన్ లో 'థాయ్' లిపి install చేసి ఉంటుంది. మనకి థాయ్ లిపి అక్కర్లేదు కాబట్టీ దీన్ని ఉపయోగించుకుంటున్నాం.  
  3. ఫోన్ లోకి 'ES File Explorer'  అనే app ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను
  4. ES File Explorer -  settings లో Root Explorer ని enable చేస్తే, వచ్చిన బాక్స్ లో Mount  R / W, అన్న దానిపై క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ కనిపించింది. RO (Read - Only ) లో ఉన్న సెలక్షన్ ని RW (Read & Write) కి మార్చాను. 
  5. ఇప్పుడు ES File Explorer ద్వారా స్టెప్ 2లోని ఫైల్ ని (originally "gautami.ttf" but  renamed as "DroidSansThai.ttf") తీసుకుపోయి ఆండ్రాయిడ్ ఫోన్ Root Directory లోని " /system/fonts " directory లోకి Cut - Paste పద్దతి లో Move చేసాను. ఆ ఫాంట్ పేరుతో ముందే ఇంకో ఫైల్ ఉంటుంది కాబట్టీ Overwrite  చేసాను. (Systam Files ని ఈ ప్రకారంగా మార్చడానికే  కావలసిన అనుమతులు (permissions) మన ఫోన్ ని ROOT చెయ్యడం ద్వారా సమకూరుతాయి. తద్వారా మన ఫోన్ లోకి SUPER User అనే app install  అవుతుంది. ఈ అనుమతులన్నీ ఈ Super User App అన్నదే ప్రాసెస్ చేస్తుంది.)
  6. ఇప్పుడు ఫోన్ ని restart చేశాను.

గౌతమి ఫాంట్ లో తెలుగు లిపిని స్పష్టంగా చూడచక్కగా దర్శనమిచ్చింది. 
నా ఫోన్ లో (android 2.3.3 version) ఈ పధ్ధతి పర్ఫెక్ట్ గా పని చేస్తోంది. 
(strictly THOSE who have already rooted their android phones only)

special thanks to Sri C K Patel, who worked out this wonderful Idea.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)