Thursday, March 21, 2013

తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమం లో నామ సంకీర్తనం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. మరొక రోజు ప్రసారం అవుతుందట ...!
******************************************
Youtube link
 పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల


చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్ 
*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

Wednesday, March 13, 2013

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి
ీసు పి మీదూర్లో ఉండో గాలుగు రోజులుగేపు, టీవీ కి చూడేదు. ఇవాళళ్ళీ తిరుగప్రంలో శ్రీ శ్రీపాదినాకాణిగారికి అంత్యక్రియు జిగాయి చివి, విస్మానికి లోనయ్యాను. నిజానికి ఈ పోస్టు వ్రాద్దాముకున్ని శ్రీ పినాకపాణి గారి శతజయంతి సందర్భంగా..! మొదుపెట్టాను కాని వివిారాలల్ల ూర్తి చెయ్యేకోయాను. అదే పస్టుని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ూర్తి చెయ్యవలసి రావడం దురదృష్టకరం. 
 
పద్మభూషణ్ మెడల్ 
కర్ణాటక సంగీత లోకంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితులైన పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డా. శ్రీపాద పినాకపాణి గారు నేడు తమ నూరవ పుట్టిన రోజును స్వస్థలమైన కర్నూలు లో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా వారు మంచి హస్తవాసి గలిగిన వైద్యులుగా పేరు తెచ్చుకున్నా సంగీత లోకానికి చేసిన సేవ మరపురానిది. కర్ణాటక సంగీతం అంటే మద్రాసు, తంజావూరు లాంటి తమిళ నాడుకి చెందిన ప్రాంతాల వారు మాత్రమే పాడగలరు, వారు పాడినదే వినగలం అనుకొనే రోజుల్లో మన తెలుగువాడైన పినాకపాణి గారి కచ్చేరీలంటే తమిళశ్రోతలు చెవికోసుకొనేవారంటే వారి గాత్ర మాధుర్యం, విద్వత్తు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
వారి శిష్యులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో పేరెన్నిక గన్న వోలేటి వేంకటేశ్వర్లు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మొదలైనవారు. ఇంకా శ్రీమతి సరస్వతీ విద్యార్ధి, వారి కుమార్తె కుమారి లహరి, మల్లాది సోదరుల పేరుతో ప్రసిద్ది చెందిన శ్రీ   శ్రీరామ్ ప్రసాద్ , శ్రీ రవికుమార్ గార్ల వంటి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి కర్నాటక సంగీతాన్ని మరిన్ని తరాలు ముందుకు తీసుకుపోయే రాచ బాటలు వేసారు శ్రీ పినాక పాణి గారు. 
1993-94లో అనుకుంటా.. (నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయిఉంటుంది) నేదునూరి కృష్ణమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారు వ్రాసిన 'అన్నమయ్య పదసౌరభం' పుస్తకానికి ముఖచిత్రం వెయ్యమని అడిగారు. మల్లాది సోదరులతో  పరిచయం కలిగింది కూడా శ్రీ నేదునూరి గారి ఇంటివద్దే. అప్పుడే శ్రీపాద పినాకపాణి గారి పుస్తకం 'మనోధర్మ సంగీతం' గురించి వినడం. ఆయన గురించి, ఆ పుస్తకాన్ని గురించీ చెబుతూ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు నాకు దాని వ్రాతప్రతి కాపీని నాదగ్గర ఉంచుకోమని ఇచ్చారు. ముత్యాల్లాంటి పినాక పాణి గారి దస్తూరితో ఉన్న ఆ వ్రాత ప్రతి నా వద్ద ఇంకా భద్రంగా వుంది. తరువాత ఆపుస్తకం తితిదేవస్థానం వారు ముద్రించాక తిరుపతిలో కొనుక్కున్నాను. అలాగే పాణి గారు వ్రాసిన 'నా సంగీత యాత్ర' సంగీత ప్రపంచం లో వారి అనుభవ సారాన్ని క్రోడీకరించి,  వర్ధిష్ణు కళాకారులకి స్స్ఫూర్తిదాయకం గా ఉండే ఎన్నో సంగతులని స్పృశించారు. 

తితిదేవస్థానం వారిచే నాలుగు భాగాలుగా ముద్రించబడిన 'సంగీత సౌరభం' సంగీత లోకానికే  మకుటాయమానం.
వారి శతజయంత్యుత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం, వారి శిష్య ప్రశిష్యులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఆ రోజు వారి స్వగృహం లో జరిగిన అభినందన మరియు సన్మాన కార్యక్రమ విశేషాలు  ఈ లింక్ నొక్కి చూడండి. 
శ్రీపాద వారివే ఇంకొన్ని ఫోటోలు:వివిధ పత్రికలలో శ్రీ పినాకి గారి ంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు ఒక్క చోటే మనందరికోసం: 

గాంధర్వ వేదామృతవాణి.. పినాకపాణి -కొమాండూరి శేషాద్రి (ఆంద్ర భూమి)
 
స్వరరాగ ఝురికి వందేళ్లు (సాక్షి)

ఈ శతాబ్దపు సంగీత కళానిధి - డాక్టర్ శ్రీపాద పినాకపాణి -- ఈరంకి వెంకట కామేశ్వర్

కినిగే లో శ్రీపాద వారి పుస్తకాలు

The Masterpiece Collection - Live Concert - Dr Sripada Pinakapani (వారు పాడిన కీర్తనల ఆడియో లింక్)


అదందర్ంగా దూరర్న్ సప్తిరి వారు పినాకాణి గారితో నిర్వించిన ఇంటర్వ్య ప్రారం చారు.  (చాలా పాతి అనుకుంటా.. ! కీసం ఇరై ఏళ్ల క్రితంది. దానిలో వారి దినర్యొత్తం చూపిస్తూ, ిష్యులో వారి పాలు, డక్టు గి ప్రాక్టీసు, వ్యాయామొదైని చూపించారు. 

శ్రీపాద వారి గురించి శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి గారఈమాటెబ్ పత్రికవ్రాసిన వ్యాసం  మంచి లింక్ అందించిన 'అజ్ఞాత' కు ధన్యవాదాలు ఆంధ్రదేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు డా. శ్రీపాద పినాకపాణి గారి కుటుంబానికీ, వారి శిష్య ప్రశిష్యులకూ , అశేషమైన వారి అభిమానులకూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 
పూర్తిగా చదవండి...

Sunday, March 10, 2013

శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు బృందం ఆలపించిన ॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥

బ్లాగు మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలు.  
 


ఈ సందర్భంగా చాలాసంవత్సరాల క్రితం రేడియో లో భక్తిరంజని కార్యక్రమంలో 
శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు బృందం ఆలపించిన 
॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥ వినండి :
దారిద్ర్య దహన శివస్తోత్రం ॥
విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||1||
గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||2||

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||3||

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||4||

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపహాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||5||

భాను ప్రియాయ భవ సాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||6||

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ||7||

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ  ||8||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ 9॥

॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥

  


దీనితో పాటు నాకు చాలా ఇష్టమైన ఇంకొక శివ స్తోత్రం డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు గానం చేసిన శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం . దీని ఆడియో ఫైల్ నాదగ్గర ఉండేది కానీ సమయానికి కనిపించలేదు . మిత్రులెవరి వద్దనైనా ఉంటే  షేర్ చెయ్యగలరు .
*************************************
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం 
గానం: శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ  శుద్ధాయ దిగంబరాయ తస్మై  “న” కారయ  నమఃశివాయ   1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర  ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై “మ ” కారయ నమఃశివాయ  2

శివాయ గౌరీ వదనారవిoద సూర్యాయ దాక్షాద్వర నాశకాయ
శ్రీ నీలకంటాయ వృషద్వజాయ తస్మై  “శి”కారయ  నమఃశివాయ  3

వశిష్ట కుంభోద్భవగౌతమాది మునీంద్ర  దేవార్చిత  శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై  “వ” కారయ  నమఃశివాయ  4

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక  హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై  “య” కారయ  నమఃశివాయ 5

పంచాక్షర  మిదం పుణ్యం యః  పఠేత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి   శివేన  సహమోదతే ||
*************************************


సాంబసదాశివ  సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివా ..!!
*************************************

పైన కనిపిస్తున్న రెండు బొమ్మలూ సుమారు 12 ఏళ్ళ  క్రితం నేను వేసినవే.. !
శివ గంగా సంగీత పరిషద్, హైదరాబాద్ వారికి వేసిన బొమ్మ.. మొదటిది చిత్తు..రెండోది ఫెయిర్ చేసినది.
శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తి గారు అడిగి వేయించుకున్నారు.
*************************************
విజయనగరం లో వెలసిన శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయ విశేషాలని గురించి ఇదివరకు నా బ్లాగులో వ్రాసిన 
శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం 
చదవడానికి పై లింక్ మీద నొక్కండి  
 


 
పూర్తిగా చదవండి...

Sunday, March 3, 2013

తొంభైయ్యవ దశకం లో ప్రసారమైన దూరదర్శన్ సీరియల్స్ - 1

తొంభైయ్యవ దశకంలో దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమైన సీరియల్స్ లో సురభి సీరియల్ కు విశిష్ట స్థానం ఉంది. భారతీయ కళలనూ మరియూ సాంసృతిక వారసత్వాన్నిథీమ్ గా తీసుకొని 1993 నుండి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున ప్రసారమైంది. దూరదర్శన్ లో ఒక దశాబ్దానికి పైగా ప్రసారంయ్యాక ఈ కార్యక్రమం స్టార్ ప్లస్ కి మారిపొయింది. సిద్ధార్ద్ కక్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించి రేణుకా సహానీ/సహనే తో కలసి ప్రెజెంట్ చేసేవారు. 
ఆ కాలం లో వచ్చిన ఇతర కార్యక్రమాలలో ఇది చాలా పాపులర్ అయింది. రేణుకా సహానీ నవ్వు ఒక ఆకర్షణ కాగా చివరలో అడిగే ప్రశ్న దాని జవాబు (आज का सवाल जवाब) చెప్పే తీరు, అన్నిటినీ మించి విజేతని ఎన్నుకొనే పధ్ధతి చాలా తమాషాగా ఉండేది. ఒక పెద్ద గంగాళం లో ఆ వారం లో  సరైన జవాబుతో వచ్చిన ఉత్తరాలన్నీపోసి వాటిని కిందా మీదా కలియదిప్పి ఒక ఉత్తరం తీసి విజేతగా ప్రకటించేవారు. అప్పట్లో ఈ మొబైల్ ఫోన్లూ, ఎస్సెమ్మెస్ లూ  లేవుకదా ..!! సినిమా విజన్ ఇండియా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్మించిన సిద్ధార్థ్ కక్, తరువాత సురభి ఫౌండేషన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థ ని నెలకొల్పి భారత దేశానికి చెందిన కళలనూ, కళారూపాలను,  సంరక్షించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నడుపుతున్నారు. 
ఈ ప్రోగ్రాంకి థీమ్ మ్యూజిక్ ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం సమకూర్చారు.


టైటిల్ సాంగ్ 

పూర్తిగా భారతీయత ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి దేశంలో ఉన్న మారుమూలల ఉన్న పల్లెల్లో సైతం ఉన్న కళారూపాలను పరిచయం చేయడంలో సిద్దార్థ్ మరియు రేణుకల జంట కృతకృత్యులయ్యారు. ప్రజల స్పందన కూడా అంత గొప్పగా ఉండేది. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమానికి వచ్చే ఉత్తరాలకోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చెయ్యవలసి వచ్చేదట . అలాగే కాంపిటిషన్ పోస్టు కార్డులు కూడా పెట్టడానికి ఈ కార్యక్రమమే దోహదం చేసిందట (ఆధారం: వికీ పీడియా). 

 ఏ ఆర్ రెహమాన్ తో 'సురభి' లో వచ్చిన ఇంటర్వ్యూ 
ఈ కార్యక్రమానికి చాలా కాలం పాటు 'అమూల్' స్పాన్సరర్ గా వ్యవహరించింది.  

సురభి కార్యక్రమం మన భారతీయ కళలకు దృశ్య రూపం అయితే, వింత వింత సంగతులను మూటగట్టి కొంత ఇంచుమించు అదే కాలం లో వచ్చిన మరో సీరియల్ ’ఐసా భీ హోతాహై..!’ కొంచం సైన్స్, కొంత మ్యాజిక్ లాంటివి కలిపి ప్రేక్షకులకు ఉత్సుకత రేకెత్తించి ఆ సీరియల్ టైటిల్ ని సార్థకం చేశారు. ఆ ప్రోగ్రాం ఏంకర్ కూడా చాలా లైవ్లీ గా నిర్వహించేది. 
 

పూర్తిగా చదవండి...

Saturday, March 2, 2013

పాత తరానికి చెందిన అత్యంత పాపులర్ మోపెడ్ లూ, స్కూటర్లూ, బైకులూ..!

మాతమ్ముడు ఈ మధ్య 'మానాన్నగారు మా చిన్నతనంలో వాడిన బండి ఫోటోలు' దొరికాయంటూ క్రింది ఫోటోలు పంపాడు . చాన్నాళ్ళ తరువాత చూసేసరికీ భలే సరదా వేసింది . నేను ఆరు చదువుతున్నప్పుడు అనుకుంటా..  మా నాన్నగారు మమ్మల్ని ముందు కూర్చోపెట్టుకొని నడుపుతూ ఉంటే మేమే నడుపుతున్నట్లు ఫీలైపోయే వాళ్ళం నేనూ మాతమ్ముడూ ..! మా నాన్నగారు కొనుక్కున్న మొట్టమొదటి బండి. నేను పుట్టక మునుపు 1972 ఫిబ్రవరి లో కొన్నారు. కొన్న ఆరునెల్లకే బండి నడుపుతూ పడిపోయి కాలుకూడా విరగగొట్టు కున్నారుట.  సుమారు 12 ఏళ్ళు వాడారు. ఇదే కలర్. అంత షైనింగ్ ఉన్నట్టే మైంటైన్ చేసేవారు.  అప్పుడప్పుడు  దీని మీదే మా కుటుంబం (నాన్నగారు, అమ్మ, నేను, తమ్ముడు.. అప్పటికి మేం బాగా చిన్న వాళ్ళం లెండి ..!)  విశాఖపట్నం నుండీ భీమిలి వరకూ బీచ్ రోడ్ లో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడక్కడ బీచ్ రోడ్డు మధ్యలో సముద్రపు ఇసక మేటలు వేసేసేది . అక్కడ మాత్రం బండి తోయ్యవలసి వచ్చేది ..!
జావా జెట్ (YEZDI)


ఈ జ్ఞాపకాలు అక్కడితో ఆగలేదు..! అప్పట్లో మా నాన్నగారి సహోద్యోగుల దగ్గర ఏయే బళ్ళు ఉండేవో మాట్లాడుకుంటూ ఉంటే ఈ క్రింది సరుకంతా బయటకొచ్చింది. మన ఇంటరెస్టు కేవలం బండ్ల మీదే కాబట్టీ అంతవరకే మాట్లాడుకుందాం ..!!
సువేగా సామ్రాట్ 
 
విక్కీ
లూనా 

దీనికి ' చల్ మేరీ లూనా - ఖర్చా కమ్ , మజ్బూతీ జ్యాదా ' అంటూ  దూరదర్శన్ లో చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. 


లూనా క్రొత్త వెర్షన్ 


బజాజ్ ఎమ్ 50 / ఎమ్ 80

టీ వీ ఎస్ 50 మోపెడ్ 
హీరో పుఖ్ (లీటర్ కి 92 కి. మీ. మైలేజ్ అనేవాడు)
ఎన్ఫీల్డ్ - మోఫా (వచ్చిన కొన్నాళ్ళకే కనుమరుగై పోయింది)
పైన చదివితే తెలుస్తుంది , లూనా  రూ\\ ఆరువేలకి వస్తే దీని ఖరీదు మాత్రం 2500/- మాత్రమే..!
 మోపెడ్ ల కన్నా కొంచం ఎక్కువ ఖరీదు అయినా , మరికొంత విశాలంగా , ఇంకాస్త విలాస వంతంగా  కావలసిన వాళ్ళు స్కూటర్ లవైపు మొగ్గు చూపారు .  కొత్తలో వచ్చిన కొన్ని పాపులర్ స్కూటర్ లు :
లాంబ్రేట్టా / లామ్బీ 

'విజయ సూపర్'
అవంతి గేర్రెలీ


స్కూటర్ మార్కెట్ లో బాగా విస్తరించి ఎక్కువ వాటా దక్కించుకున్న కంపెనీ బజాజ్, వెస్పా కంపెనీలు మాత్రమే  అని చెప్పాలి. 


బులంద్ భారత్ కీ బులంద్ తస్వీర్ ... హమారా బజాజ్..!

వెస్పా స్కూటర్ 
కానీ ఇప్పుడు స్కూటర్లకి కాలం చెల్లింది. అందునా గేరు స్కూటర్లకి..!! ఆటో గేర్ స్కూటర్లు చాలా మోడల్స్ వచ్చాయి.
లేటెస్ట్ గా వచ్చిన వెస్పా ఆటో గేర్ స్కూటర్:

పాతస్కూటర్లని ఇలాకూడా వాడేస్తున్నారు!! ఐడియా బాగుంది కదా.. ! పైన చెప్పిన వన్నీ కాస్త ఫామిలీ టైపు అయితే ఆకాలపు (నిజానికి ఇప్పటికి కూడా) యువతరం ఎంపిక మాత్రం మోటార్ సైకిళ్ళే.  


జావా బైక్ 
యమహా 
YEZDI 

రాజ్ దూత్ 
రాజ్ దూత్ మినీ (BOBBY  సినిమా ఫేం)
ఎన్ని బైక్ లు ఉన్నా..  అప్పటికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ రాజసం ఉట్టిపడే బైక్ మాత్రం ఎన్ఫీల్డ్ బుల్లెట్టే ..!!
 ఒకే ఒక్క సారి నేను నడిపాను దీన్ని.  ఆ దర్జాయే వేరు..! నాకు తెలిసినంతలో ’బేసిక్ మోడల్’ ఎక్కువ మార్పులకు లోను కాకుండా చాలా కాలం వాడుకలో ఉన్నది ఈ ఒక్క టేనేమో.. !!

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)