Saturday, March 2, 2013

పాత తరానికి చెందిన అత్యంత పాపులర్ మోపెడ్ లూ, స్కూటర్లూ, బైకులూ..!

మాతమ్ముడు ఈ మధ్య 'మానాన్నగారు మా చిన్నతనంలో వాడిన బండి ఫోటోలు' దొరికాయంటూ క్రింది ఫోటోలు పంపాడు . చాన్నాళ్ళ తరువాత చూసేసరికీ భలే సరదా వేసింది . నేను ఆరు చదువుతున్నప్పుడు అనుకుంటా..  మా నాన్నగారు మమ్మల్ని ముందు కూర్చోపెట్టుకొని నడుపుతూ ఉంటే మేమే నడుపుతున్నట్లు ఫీలైపోయే వాళ్ళం నేనూ మాతమ్ముడూ ..! మా నాన్నగారు కొనుక్కున్న మొట్టమొదటి బండి. నేను పుట్టక మునుపు 1972 ఫిబ్రవరి లో కొన్నారు. కొన్న ఆరునెల్లకే బండి నడుపుతూ పడిపోయి కాలుకూడా విరగగొట్టు కున్నారుట.  సుమారు 12 ఏళ్ళు వాడారు. ఇదే కలర్. అంత షైనింగ్ ఉన్నట్టే మైంటైన్ చేసేవారు.  అప్పుడప్పుడు  దీని మీదే మా కుటుంబం (నాన్నగారు, అమ్మ, నేను, తమ్ముడు.. అప్పటికి మేం బాగా చిన్న వాళ్ళం లెండి ..!)  విశాఖపట్నం నుండీ భీమిలి వరకూ బీచ్ రోడ్ లో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడక్కడ బీచ్ రోడ్డు మధ్యలో సముద్రపు ఇసక మేటలు వేసేసేది . అక్కడ మాత్రం బండి తోయ్యవలసి వచ్చేది ..!
జావా జెట్ (YEZDI)


ఈ జ్ఞాపకాలు అక్కడితో ఆగలేదు..! అప్పట్లో మా నాన్నగారి సహోద్యోగుల దగ్గర ఏయే బళ్ళు ఉండేవో మాట్లాడుకుంటూ ఉంటే ఈ క్రింది సరుకంతా బయటకొచ్చింది. మన ఇంటరెస్టు కేవలం బండ్ల మీదే కాబట్టీ అంతవరకే మాట్లాడుకుందాం ..!!
సువేగా సామ్రాట్ 
 
విక్కీ
లూనా 

దీనికి ' చల్ మేరీ లూనా - ఖర్చా కమ్ , మజ్బూతీ జ్యాదా ' అంటూ  దూరదర్శన్ లో చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. 


లూనా క్రొత్త వెర్షన్ 


బజాజ్ ఎమ్ 50 / ఎమ్ 80

టీ వీ ఎస్ 50 మోపెడ్ 
హీరో పుఖ్ (లీటర్ కి 92 కి. మీ. మైలేజ్ అనేవాడు)
ఎన్ఫీల్డ్ - మోఫా (వచ్చిన కొన్నాళ్ళకే కనుమరుగై పోయింది)
పైన చదివితే తెలుస్తుంది , లూనా  రూ\\ ఆరువేలకి వస్తే దీని ఖరీదు మాత్రం 2500/- మాత్రమే..!
 మోపెడ్ ల కన్నా కొంచం ఎక్కువ ఖరీదు అయినా , మరికొంత విశాలంగా , ఇంకాస్త విలాస వంతంగా  కావలసిన వాళ్ళు స్కూటర్ లవైపు మొగ్గు చూపారు .  కొత్తలో వచ్చిన కొన్ని పాపులర్ స్కూటర్ లు :
లాంబ్రేట్టా / లామ్బీ 

'విజయ సూపర్'
అవంతి గేర్రెలీ


స్కూటర్ మార్కెట్ లో బాగా విస్తరించి ఎక్కువ వాటా దక్కించుకున్న కంపెనీ బజాజ్, వెస్పా కంపెనీలు మాత్రమే  అని చెప్పాలి. 


బులంద్ భారత్ కీ బులంద్ తస్వీర్ ... హమారా బజాజ్..!

వెస్పా స్కూటర్ 
కానీ ఇప్పుడు స్కూటర్లకి కాలం చెల్లింది. అందునా గేరు స్కూటర్లకి..!! ఆటో గేర్ స్కూటర్లు చాలా మోడల్స్ వచ్చాయి.
లేటెస్ట్ గా వచ్చిన వెస్పా ఆటో గేర్ స్కూటర్:

పాతస్కూటర్లని ఇలాకూడా వాడేస్తున్నారు!! ఐడియా బాగుంది కదా.. ! పైన చెప్పిన వన్నీ కాస్త ఫామిలీ టైపు అయితే ఆకాలపు (నిజానికి ఇప్పటికి కూడా) యువతరం ఎంపిక మాత్రం మోటార్ సైకిళ్ళే.  


జావా బైక్ 
యమహా 
YEZDI 

రాజ్ దూత్ 
రాజ్ దూత్ మినీ (BOBBY  సినిమా ఫేం)
ఎన్ని బైక్ లు ఉన్నా..  అప్పటికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ రాజసం ఉట్టిపడే బైక్ మాత్రం ఎన్ఫీల్డ్ బుల్లెట్టే ..!!
 ఒకే ఒక్క సారి నేను నడిపాను దీన్ని.  ఆ దర్జాయే వేరు..! నాకు తెలిసినంతలో ’బేసిక్ మోడల్’ ఎక్కువ మార్పులకు లోను కాకుండా చాలా కాలం వాడుకలో ఉన్నది ఈ ఒక్క టేనేమో.. !!

5 comments:

 1. మన అక్కయ్యపాలెంలో వెనక నాలుగు నిండు సిలిండర్లనీ ముందు ఒక సహచరుడినీ కూర్చోపెట్టుకుని ఫర్ర్ మని దూసుకుపొయ్యే టీవీయెస్ మోపెడ్ గురించి ఎంత రాసినా తక్కువేసుమండీ

  ReplyDelete
 2. మన అక్కయ్యపాలెంలో వెనక నాలుగు నిండు సిలిండర్లనీ ముందు ఒక సహచరుడినీ కూర్చోపెట్టుకుని ఫర్ర్ మని దూసుకుపొయ్యే టీవీయెస్ మోపెడ్ గురించి ఎంత రాసినా తక్కువేసుమండీ

  ReplyDelete
 3. పెర్ల్ యమహా ఫోటోకూడా పెట్టేస్తే అన్నీ ఉన్నట్టే

  ReplyDelete
 4. You forgot hero majestic

  ReplyDelete
 5. We also bought minor vehicle after your father did so.People used to look at us bit tensed when two of us along with 2kids sitting on it.but we enjoyed a lot,which I am not able get traveling in a 4 wheeler now.

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)