Wednesday, March 13, 2013

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి
ీసు పి మీదూర్లో ఉండో గాలుగు రోజులుగేపు, టీవీ కి చూడేదు. ఇవాళళ్ళీ తిరుగప్రంలో శ్రీ శ్రీపాదినాకాణిగారికి అంత్యక్రియు జిగాయి చివి, విస్మానికి లోనయ్యాను. నిజానికి ఈ పోస్టు వ్రాద్దాముకున్ని శ్రీ పినాకపాణి గారి శతజయంతి సందర్భంగా..! మొదుపెట్టాను కాని వివిారాలల్ల ూర్తి చెయ్యేకోయాను. అదే పస్టుని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ూర్తి చెయ్యవలసి రావడం దురదృష్టకరం. 
 
పద్మభూషణ్ మెడల్ 
కర్ణాటక సంగీత లోకంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితులైన పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డా. శ్రీపాద పినాకపాణి గారు నేడు తమ నూరవ పుట్టిన రోజును స్వస్థలమైన కర్నూలు లో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా వారు మంచి హస్తవాసి గలిగిన వైద్యులుగా పేరు తెచ్చుకున్నా సంగీత లోకానికి చేసిన సేవ మరపురానిది. కర్ణాటక సంగీతం అంటే మద్రాసు, తంజావూరు లాంటి తమిళ నాడుకి చెందిన ప్రాంతాల వారు మాత్రమే పాడగలరు, వారు పాడినదే వినగలం అనుకొనే రోజుల్లో మన తెలుగువాడైన పినాకపాణి గారి కచ్చేరీలంటే తమిళశ్రోతలు చెవికోసుకొనేవారంటే వారి గాత్ర మాధుర్యం, విద్వత్తు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
వారి శిష్యులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో పేరెన్నిక గన్న వోలేటి వేంకటేశ్వర్లు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మొదలైనవారు. ఇంకా శ్రీమతి సరస్వతీ విద్యార్ధి, వారి కుమార్తె కుమారి లహరి, మల్లాది సోదరుల పేరుతో ప్రసిద్ది చెందిన శ్రీ   శ్రీరామ్ ప్రసాద్ , శ్రీ రవికుమార్ గార్ల వంటి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి కర్నాటక సంగీతాన్ని మరిన్ని తరాలు ముందుకు తీసుకుపోయే రాచ బాటలు వేసారు శ్రీ పినాక పాణి గారు. 
1993-94లో అనుకుంటా.. (నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయిఉంటుంది) నేదునూరి కృష్ణమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారు వ్రాసిన 'అన్నమయ్య పదసౌరభం' పుస్తకానికి ముఖచిత్రం వెయ్యమని అడిగారు. మల్లాది సోదరులతో  పరిచయం కలిగింది కూడా శ్రీ నేదునూరి గారి ఇంటివద్దే. అప్పుడే శ్రీపాద పినాకపాణి గారి పుస్తకం 'మనోధర్మ సంగీతం' గురించి వినడం. ఆయన గురించి, ఆ పుస్తకాన్ని గురించీ చెబుతూ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు నాకు దాని వ్రాతప్రతి కాపీని నాదగ్గర ఉంచుకోమని ఇచ్చారు. ముత్యాల్లాంటి పినాక పాణి గారి దస్తూరితో ఉన్న ఆ వ్రాత ప్రతి నా వద్ద ఇంకా భద్రంగా వుంది. తరువాత ఆపుస్తకం తితిదేవస్థానం వారు ముద్రించాక తిరుపతిలో కొనుక్కున్నాను. అలాగే పాణి గారు వ్రాసిన 'నా సంగీత యాత్ర' సంగీత ప్రపంచం లో వారి అనుభవ సారాన్ని క్రోడీకరించి,  వర్ధిష్ణు కళాకారులకి స్స్ఫూర్తిదాయకం గా ఉండే ఎన్నో సంగతులని స్పృశించారు. 

తితిదేవస్థానం వారిచే నాలుగు భాగాలుగా ముద్రించబడిన 'సంగీత సౌరభం' సంగీత లోకానికే  మకుటాయమానం.
వారి శతజయంత్యుత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం, వారి శిష్య ప్రశిష్యులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఆ రోజు వారి స్వగృహం లో జరిగిన అభినందన మరియు సన్మాన కార్యక్రమ విశేషాలు  ఈ లింక్ నొక్కి చూడండి. 
శ్రీపాద వారివే ఇంకొన్ని ఫోటోలు:వివిధ పత్రికలలో శ్రీ పినాకి గారి ంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు ఒక్క చోటే మనందరికోసం: 

గాంధర్వ వేదామృతవాణి.. పినాకపాణి -కొమాండూరి శేషాద్రి (ఆంద్ర భూమి)
 
స్వరరాగ ఝురికి వందేళ్లు (సాక్షి)

ఈ శతాబ్దపు సంగీత కళానిధి - డాక్టర్ శ్రీపాద పినాకపాణి -- ఈరంకి వెంకట కామేశ్వర్

కినిగే లో శ్రీపాద వారి పుస్తకాలు

The Masterpiece Collection - Live Concert - Dr Sripada Pinakapani (వారు పాడిన కీర్తనల ఆడియో లింక్)


అదందర్ంగా దూరర్న్ సప్తిరి వారు పినాకాణి గారితో నిర్వించిన ఇంటర్వ్య ప్రారం చారు.  (చాలా పాతి అనుకుంటా.. ! కీసం ఇరై ఏళ్ల క్రితంది. దానిలో వారి దినర్యొత్తం చూపిస్తూ, ిష్యులో వారి పాలు, డక్టు గి ప్రాక్టీసు, వ్యాయామొదైని చూపించారు. 

శ్రీపాద వారి గురించి శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి గారఈమాటెబ్ పత్రికవ్రాసిన వ్యాసం  మంచి లింక్ అందించిన 'అజ్ఞాత' కు ధన్యవాదాలు ఆంధ్రదేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు డా. శ్రీపాద పినాకపాణి గారి కుటుంబానికీ, వారి శిష్య ప్రశిష్యులకూ , అశేషమైన వారి అభిమానులకూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 

3 comments:
 1. డా;పినాకపాణి గారి సంగీతం గురించి రాసే అర్హత నాకులేదు,ఎందుకంటే నాకు సంగీతం రాదు కాబట్టి.కాని మెదికల్ విద్యార్థిగా (1950-55)వైజాగ్ లో ఆయన మెడిసిన్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ,1959 లో నేను అసిస్టెంట్ సర్జంగా ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు పరిచయం ఉంది.ఆయన కచేరీలు అరుదుగా చేసేవారు.మంచి టీచరు,ఫిజిషియనే కాని పెద్దగా ధనసంపాదన ,చేసేవారు కాదు.2012లో గత యేడాది శ్రీకాకుళంలో ఆయన గౌరవార్థం ఒక సంగీత సభ జరిపించాము.

  ReplyDelete
 2. http://www.eemaata.com/em/issues/201209/1998.html

  ReplyDelete
  Replies
  1. @'అజ్ఞాత': మంచి లింక్ అందించినందుకు ధన్యవాదాలు

   Delete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)