Sunday, March 3, 2013

తొంభైయ్యవ దశకం లో ప్రసారమైన దూరదర్శన్ సీరియల్స్ - 1

తొంభైయ్యవ దశకంలో దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమైన సీరియల్స్ లో సురభి సీరియల్ కు విశిష్ట స్థానం ఉంది. భారతీయ కళలనూ మరియూ సాంసృతిక వారసత్వాన్నిథీమ్ గా తీసుకొని 1993 నుండి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున ప్రసారమైంది. దూరదర్శన్ లో ఒక దశాబ్దానికి పైగా ప్రసారంయ్యాక ఈ కార్యక్రమం స్టార్ ప్లస్ కి మారిపొయింది. సిద్ధార్ద్ కక్ అనే ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించి రేణుకా సహానీ/సహనే తో కలసి ప్రెజెంట్ చేసేవారు. 
ఆ కాలం లో వచ్చిన ఇతర కార్యక్రమాలలో ఇది చాలా పాపులర్ అయింది. రేణుకా సహానీ నవ్వు ఒక ఆకర్షణ కాగా చివరలో అడిగే ప్రశ్న దాని జవాబు (आज का सवाल जवाब) చెప్పే తీరు, అన్నిటినీ మించి విజేతని ఎన్నుకొనే పధ్ధతి చాలా తమాషాగా ఉండేది. ఒక పెద్ద గంగాళం లో ఆ వారం లో  సరైన జవాబుతో వచ్చిన ఉత్తరాలన్నీపోసి వాటిని కిందా మీదా కలియదిప్పి ఒక ఉత్తరం తీసి విజేతగా ప్రకటించేవారు. అప్పట్లో ఈ మొబైల్ ఫోన్లూ, ఎస్సెమ్మెస్ లూ  లేవుకదా ..!! సినిమా విజన్ ఇండియా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్మించిన సిద్ధార్థ్ కక్, తరువాత సురభి ఫౌండేషన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థ ని నెలకొల్పి భారత దేశానికి చెందిన కళలనూ, కళారూపాలను,  సంరక్షించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నడుపుతున్నారు. 
ఈ ప్రోగ్రాంకి థీమ్ మ్యూజిక్ ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం సమకూర్చారు.


టైటిల్ సాంగ్ 

పూర్తిగా భారతీయత ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి దేశంలో ఉన్న మారుమూలల ఉన్న పల్లెల్లో సైతం ఉన్న కళారూపాలను పరిచయం చేయడంలో సిద్దార్థ్ మరియు రేణుకల జంట కృతకృత్యులయ్యారు. ప్రజల స్పందన కూడా అంత గొప్పగా ఉండేది. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమానికి వచ్చే ఉత్తరాలకోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చెయ్యవలసి వచ్చేదట . అలాగే కాంపిటిషన్ పోస్టు కార్డులు కూడా పెట్టడానికి ఈ కార్యక్రమమే దోహదం చేసిందట (ఆధారం: వికీ పీడియా). 

 ఏ ఆర్ రెహమాన్ తో 'సురభి' లో వచ్చిన ఇంటర్వ్యూ 
ఈ కార్యక్రమానికి చాలా కాలం పాటు 'అమూల్' స్పాన్సరర్ గా వ్యవహరించింది.  

సురభి కార్యక్రమం మన భారతీయ కళలకు దృశ్య రూపం అయితే, వింత వింత సంగతులను మూటగట్టి కొంత ఇంచుమించు అదే కాలం లో వచ్చిన మరో సీరియల్ ’ఐసా భీ హోతాహై..!’ కొంచం సైన్స్, కొంత మ్యాజిక్ లాంటివి కలిపి ప్రేక్షకులకు ఉత్సుకత రేకెత్తించి ఆ సీరియల్ టైటిల్ ని సార్థకం చేశారు. ఆ ప్రోగ్రాం ఏంకర్ కూడా చాలా లైవ్లీ గా నిర్వహించేది. 
 

1 comment:

  1. సురభి పేరు, రేణుకా సహానీ , ఆమె పెద్దచిరునవ్వు, సిద్ధార్థ కక్, ఆ ఉత్తరాల గంగాళం గుర్తున్నాయి. కానీ ఆ కార్యక్రమం సీరియస్ గా చూసినట్టు గుర్తులేదు. చూడాలింక.

    ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)