Showing posts with label సాంస్కృతికం. Show all posts
Showing posts with label సాంస్కృతికం. Show all posts

Monday, September 9, 2013

మట్టి వినాయక ప్రతిమ

బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

పోయిన ఆదివారం మా ఇంట్లో నేను, మా పిల్లలూ, వాళ్ళ ఫ్రెండ్స్ కలసి మట్టి వినాయకుడిని చెయ్యడం కోసం ఇలా ఒక వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. మా పిల్లలు కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్ వాళ్ళ స్నేహితులు భవ్య, భార్గవ్ లతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (భవ్య వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు నాకు కాలేజీ లో క్లాస్మేట్) వీళ్ళంతా మా శ్రీమతి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. భవ్య, కృష్ణప్రియ తమ సహాధ్యాయులతో కలసి చిన్న చిన్న ప్రోగ్రాములలో కూడా పాడారు.
 మట్టి గణపతిని తయారు చెయ్యడానికి సూచనలిస్తూ  నేనే..!!
నేను, నా శిష్య బృందం.. మట్టి వినాయకుడి రూపకల్పనలో..!





మా అమ్మాయి కృష్ణప్రియ
మా అబ్బాయి కృష్ణ ప్రీతమ్ , వెనుక ఉన్నది వాడి ఫ్రెండ్ భార్గవ్ 







విఘ్నేశ్వరుడి తయారీలో మొదటి అంకం
భార్గవ్ వాళ్ళ అక్క..! పేరు భవ్య..
















ప్రతి ఫోటో క్రింద ఆ బొమ్మ తయారు చేసిన వారి పేరు చూడండి.
కృష్ణప్రియ
 కృష్ణ ప్రీతమ్ ( దీనికి రంగులేసింది నేను..!)

ప్రీతమ్ , భార్గవ్, భవ్య
తయారు చేసినది భార్గవ్, కుంచె తో రంగులద్దింది  వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు
భవ్య

ఇది నేను గీసినదే..! బ్లాక్ బోర్డ్ పైన సుద్దముక్కతో ..!!
  

ఇదివరకు వినాయకచవితి సందర్భంగా వ్రాసినవి :

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...

 

 

పూర్తిగా చదవండి...

Thursday, March 21, 2013

తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న 'నాదనీరాజనం' కార్యక్రమం లో నామ సంకీర్తనం


తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన సాయంత్రం జరిగింది.  ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. మరొక రోజు ప్రసారం అవుతుందట ...!
******************************************
Youtube link
 



పాల్గొన్న కళాకారులు:
శ్రీమతి రుద్రావఝల కుసుమకుమారి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల, కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, చి. కృష్ణప్రియ, చి. విష్ణుప్రియ, చి. శ్రుతి, చి. భవ్య, గాయత్రి, ప్రశాంతి, కామేశ్వరి, మనోహర్ 
వాద్య సహకారం: వయొలిన్: శ్రీ హెచ్.  రామ్ చరణ్, మృదంగం: జయదీప్, వేణువు: శ్రీ శైలపతి భరద్వాజ్
బృందం లోని కళాకారులంతా ప్రముఖ గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండ సుధారాణి గారి శిష్య ప్రశిష్యులే..!
 


కుమారి మండ ప్రత్యూష శ్రుతి రవళి, కుమారి కామేశ్వరి, శ్రీమతి కుసుమకుమారి, కుమారి గాయత్రి, శ్రీమతి సుబ్బలక్ష్మి సోమయాజుల


చి. శ్రుతి, చి. కృష్ణప్రియ,  ప్రశాంతి
చి. విష్ణుప్రియ, మనోహర్, చి. భవ్య,
శ్రీయుతులు శైలపతి భరద్వాజ్, రామ్ చరణ్ 
శ్రీ జయదీప్ 
*****************************************
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..! 
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది. 
ఓం నమో వేంకటేశాయ .. !!
*******************

పూర్తిగా చదవండి...

Friday, November 23, 2012

విశాఖపట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..

విశాఖ పట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..
శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28  బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును.
మరిన్ని వివరాలకోసం ఫోటో పై క్లిక్ చేసి పెద్దది గా చూడండి.
పై కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..!!

పూర్తిగా చదవండి...

Wednesday, January 25, 2012

విశాఖలో మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి మూడురోజుల కచ్చేరీ


విశాఖ సంగీతాభిమానులకు వీనుల విందు...! ఈ రోజు నుంచీ వరుసగా మూడు రోజుల పాటూ..!! బాలమురళి సంగీతామృతం లో ఓలలాడే అరుదైన అవకాశం విశాఖ నగర వాసులకు దక్కనుంది. కార్యక్రమం వివరాలు పైన వున్న  న్యూస్ ఐటెం పై నొక్కి  చదువుకోండి.
మరి ఇంకెందుకాలస్యం..?? తొందరగా ఇన్విటేషన్ సంపాదించి ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకల్లా అక్కయ్యపాలెం దగ్గర  పోర్ట్  కళావాణి ఆడిటోరియం కి  వచ్చెయ్యండి.

ఇక సెలవు..!!

పూర్తిగా చదవండి...

Saturday, January 21, 2012

పరమపద సోపాన పటము

పరమపద సోపాన పటము :
వైకుంఠపాళి అని మన తెలుగువారికి సుపరిచితమైన ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా వేరువేరు పేర్లతో ప్రచారంలో వుంది. పేరులో ఏముంది కానీ ఈ ఆటని తెలియని వారుండరు. పైన చూపించిన బొమ్మ పెద్ద కాలండర్ సైజు లో మా చిన్నప్పుడు సంక్రాంతి, శివరాత్రి మొదలైన పండగలకు వీధిలోకి తెచ్చి అమ్మేవారు. అప్పట్లో బయట పుస్తకాల షాపుల్లో కూడా దొరికేవి. అప్పట్లో మేము గవ్వలతో ఆడేవాళ్ళం. చివరిసారిగా నేను ఈ పటాన్ని ఎనిమిది చదువుతున్నప్పుడు చూసాననుకుంటా. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించింది.  అప్పుడు black&white  లో వుండేది. మేము ఇది కలర్ లో చూడలేదు.
ఇప్పుడు "పాములూ నిచ్చెనల" పేరుతో నేటితరం పిల్లలందరూ ఆడుతున్నారు. గూగుల్ లో దేనికోసమో వెతుకుతుంటే ఇది కనబడింది. 
ఈ ఆట యొక్క రూపకర్తలకు నిజంగా జోహార్లు. ఎన్నో విశేషాలు వున్నాయిందులో..! ఆట పేరు పరమపద సోపాన పటము. "పరమ పదం అంటే వైకుంఠం లేదా సద్గతి. తద్విష్ణోః పరమం పదం అనేది వేదోక్తి. దీని ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదం." అంటే వైకుంఠం. పరమ పదం మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణ వచనం. మోక్షప్రాప్తి తరువాత సద్గతి పొందిన మనిషికి మరుజన్మ ఉండదు. ఆ లక్ష్యాన్ని అందుకొనడానికి ప్రయత్నించడమే ఈ ఆటలోని ముఖ్యోద్దేశం. మనం జీవితంలో ఏ పనులు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళ్తామో ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనల గళ్ళలో వ్రాసి వున్నాయి. అవి వరుసగాఇలా వున్నాయి..:
సుగుణం ...సాలోక్యానికి, సత్ప్రవర్తనము... గోలోకానికి, నిష్ఠ ... తపోలోకానికీ, యాగము... స్వర్గలోకానికీ , భక్తి.... బ్రహ్మ లోకానికీ, చిత్తశుద్ధి ...మహా లోకానికీ, జ్ఞానము.. కైలాసానికీ, సోపానాలుగా ఉన్నట్లు చూడగలం. అక్కడకు చేరిన తరువాత ఇక జన్మరాహిత్యం, ఈశ్వరత్వం తో కూడిన పరమపదాన్ని చేరటానికి మన వంతు వచ్చేవరకూ       (అంటే సరైన పందెం పడేవరకూ..)ఎదురు చూడడమే. అలాగే  అంతవరకూ పోయిన పిదప మత్సర్యమూ, అహంకారం దరి చేరామా మ్రింగడానికి పాము సిద్దంగా వుంటుంది. అది మనల్ని పుణ్య హీనులుగా చేసి రాక్షసులను, హీన జన్ములుగానూ  చేస్తుంది. 
ఈ మొత్తం త్రోవలో మనం మనలోని పాముల లాంటి అవలక్షణాలను ఎన్నో దాటుకొని రావలసి వుంటుంది. అవి  మన లోనే వుండక్కరలేదు. ఆ లక్షణాలు కలిగిన రాక్షసుల దరి చేరినా అధోగతి ( పాము మింగి క్రిందకు పడిపోతాం) పట్టక తప్పదు.  
ఈ రకంగా సత్య పథం లో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక 'సూచిక' గా మనం అన్వయించుకోవచ్చు. 
 ఇదే ఆట పాశ్చాత్య శైలిలో :
ప్రక్కన చూపిన రెండో బొమ్మ చూడండి. ఇది ఇంగ్లీషులో వుంది. చాలా పాతది అనుకుంటాను. దీనిలో కూడా పైన చెప్పిన మన పరమపద సోపాన పటం లగే వుంది. మనిషి యొక్క ఉన్నతికి, పతనానికీ దోహదం చేసే లక్షణాలను నిచ్చెనలూ, పాముల రూపం లో చూపించారు. చిన్నపిల్లలు / పెద్దవారు ఆడుకొనే ఆటలో ఎన్ని విశేషాలు జతచేసారో చూడండి.

ఈ ఆట మొదట ఎక్కడ / ఏదేశంలో మొదలైందో తెలీదు. అయితే ఇప్పుడు 'స్నేక్స్ అండ్ లేడర్స్' మాత్రమే కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా డైస్ తో ఆడుతున్నారు. గవ్వలతో ఎవరూ పెద్దగా ఆడటం లేదు. 'అష్ట - చమ్మ, 'పులి మేక', లాంటి సంప్రదాయ క్రీడలు, వాటి రూపకల్పనలో దాగివున్న జీవితానికి పనికి వచ్చే నీతి సూత్రాలు లేదా సిద్ధాంతాలు మరుగున పడిపోతున్నాయి.
అలాంటి పాత / సంప్రదాయ క్రీడలను వెలికి తీసుకు రావడానికి http://gamepandit.com/index.html వారు కృషి చేస్తున్నారు. చూసి ఆనందించండి.
పైన చూపిన పరమ పద సోపాన పటం బొమ్మ 
పూర్తిగా చదవండి...

Wednesday, November 30, 2011

విశాఖ లో గురజాడకు ఘననివాళి :: 'కన్యాశుల్కం' చిత్ర ప్రదర్శన


ఈ రోజు నవయుగ వైతాళికుడు, తెలుగు కథకి ఆద్యుడు, సంఘ సంస్కర్త, కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావుగారి వర్ధంతి. ఆయన 1915 వ సంవత్సరంలో పరమపదించారు. ఈ తరంలో వరకట్నం గురించే గాని, కన్యా శుల్కం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. ఆ రోజుల్లో కన్యాశుల్కం (పెళ్లి చేసుకొనేటప్పుడు అమ్మాయి తండ్రికి డబ్బులు ఎదురివ్వడం) కారణంగా ఎందరు చిన్నారుల బతుకులు బుగ్గిపాలయ్యాయో...? అప్పారావుగారు అదే అంశాన్ని ఇతివృత్తం గా చేసుకొని 'కన్యాశుల్కం' అనే నాటకం  వ్రాసారు. చాలా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి మూఢాచారాల పై తన వ్యంగ్యాస్త్రాలు సంధించి హాస్య రసాన్ని అద్భుతంగా పండించారు.
ఈ నాటకం సినిమా రూపంలో ఎన్టీ రామారావు, సావిత్రి, సీఎస్సార్, మొదలైనవారు ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కింది. రంగస్థలం మీద కూడా ఎన్నిసార్లు వెయ్యబడిందో లెక్కలేదు.
ఆ సినిమా ఈ రోజు అప్పారావుగారి 97 వ వర్ధంతి సందర్భంగా స్థానిక గురజాడ కళా క్షేత్రం లో vuda వారి సౌజన్యంతో ప్రదర్శితమైంది. దానికి ముందు కళాకారులు కన్యాశుల్కం లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. ఒక మూడు వందల మంది వచ్చి వుంటారేమో. కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు.
ఈ సినీమా మరియు నాటకం లో భాగాలను ప్రదర్శించే ఆలోచన ఎవరిదో కానీ, వారినీ వూడా అధికారుల్నీ మనస్పూర్తిగా అభినందించాలి. ఆ మహనీయునికి ఇలాంటి నివాళి ఇచ్చినందుకు.

ఈపుస్తకాన్నిఆర్కైవ్.ఆర్గ్ నుండి ఈ దిగువ లింక్ ని నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కన్యాశుల్కం నాటకం పీడీఎఫ్ రూపంలో
 మొట్టమొదటి తెలుగు కథ గా చెప్పబడే 'దిద్దుబాటు' అప్పారావుగారి రచనే నని అందరికీ తెలిసిందే..!!
క్రింద బొమ్మలపై నొక్కి పెద్దవిగా చూడండి. 




పూర్తిగా చదవండి...

Wednesday, August 31, 2011

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!


హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు  రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ  విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫోటోలు క్రింద చూడండి.




 


 






విఘ్నేశ్వరుడి విగ్రహ తయారీలో తుది మెరుగులు: 
ఇక్కడి దాకా పోతపోసే అచ్చులుంటాయి కాబట్టీ ఒక రకం గా పని సులువే. కానీ ఇకపై ఉండేదంతా చేతితోనే చెయ్యాలి. అన్ని విగ్రహాల మీదా ఒకేరకమైన శ్రద్ధ చూపాలి. ఆహార్యం, అలంకరణ, ఆభూషణాలూ అన్నీ ముఖ్యమైనవే..!కళాకారుడి పనితనం తెలిసేది ఈ చివరి అంకంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.






మరింత పెద్ద విగ్రహాలు - ఎత్తు ముప్పై అడుగుల పైమాటే..!!
 కానీ ఈవిగ్రహాలలో చాలా వరకు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచెయ్యబడినవేనట. ఈసారి ప్రజలలో కూడా మట్టి విగ్రహాల వాడకంలో మంచి చైతన్యం వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొందరు మాత్రం పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నూ, రసాయన పదార్ధాలు కలిసిన రంగులనూ వాడుతున్నారు. అయితే విశాఖపట్నం లో తయారవుతున్న రెండు అతి భారీ విగ్రహాలు మాత్రం పర్యావరణానికి అస్సలు హానిచేయని రీతిలో పూర్తిగా మట్టితోనే తయారయి "మట్టితో భారీ విగ్రహాలను తయారు చెయ్యడం సాధ్యమేనా..?" లాంటి అనుమానాలను పటాపంచలు చేసాయి. రెండిటి లో ఒకటి 117 అడుగులు (గాజువాక) కాగా రెండోది (ఎం.వీ.పీ. కోలనీ) 95 అడుగుల పొడవు.
క్రింద వీడియో చూడండి.


 మట్టి విగ్రహాలు దొరికే స్థలాలూ, మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింద చూపించిన లింకుల పై నొక్కండి.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)