Saturday, September 14, 2013

తలపాగాలు..!


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ "తలపాగా" లను  ఏదో ఒక రూపంలో చూస్తాం. ప్రతికూల వాతావరణాల నుంచీ తమను తాము కాపాడుకోవడానికి తలపాగాలను మానవుడు రాను రాను తన జీవన విధానానికి, హోదాకి చిహ్నంగా రూపొందించుకొన్నాడు. పూర్వం మహారాజులు మణుగుల కొద్దీ బరువైన రత్నఖచిత కిరీటాలను పట్టాభిషేక మహోత్సవాల లాంటి ప్రత్యేకమైన సందర్భాలకి పరిమితం చేసి సాధారణ సందర్భాలలో వారి దర్పాన్ని ఇనుమడింపజేసే నగిషీలతో తక్కువ బరువు కలిగిన వివిధ రకాల తలపాగాలనే ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి మరిన్ని వన్నె చిన్నెలు కలిసి అందానికి, హుందాతనానికి ప్రతీకలుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా వచ్చి చేరాయి.
తెలుగు భాషకు తలకట్టు ఎంత  ముఖ్యమో తెలుగువాడి తలకు తలపాగా కూడా అంతే అన్నంతగా మన తెలుగు సంస్కృతిలో తలపాగకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. మన పంచకట్టు ఎంతకష్టమో తలపాగా చుట్టడం  కూడా అంతే కష్టం. తలపాగా చుట్టడం ఒక కళ. అది 'టోపీ' పెట్టేసినంత సులువు కాదు. దానిననుసరించే సామెతలు కూడా పుట్టుకొచ్చాయి. తలపాగా చుట్టలేక బుర్ర వంకర అన్నాట్ట వెనకటికి ఎవడో. అలాగే కోటలో (తల)పాగా వేశాడు అంటే  దివాణం లో పనిలో కుదిరాడు అని అర్థం. అంటే కొలువులో చేరగానే అతని హోదాకి తగ్గ తలపాగా ఇచ్చి గౌరవించేవారేమో!! ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు కానీ ఈ మధ్య మన రాజకీయ నేతలు మాత్రం పార్టీ మారగానే కొత్త పార్టీ కండువాలు కప్పించుకొని వాళ్ళ పాత రంగులు మారుస్తున్నారు. 
 
మన దేశం లో చూస్తే కొన్నిసంప్రదాయాల కుటుంబాలకు కొన్ని ప్రత్యేకమైన తలపాగా ఉంటుంది. రాజస్థానీలకు, పంజాబీలకు, మరాఠీ లకూ, కన్నడిగులకూ ప్రత్యేకమైన తలపాగాలు ఉన్నాయి. అయితే బాలగంగాధర తిలక్ ధరించిన ఈ తలపాగా కి "పూనే రి పగిడీ" అని పేరు. దీనికి సుమారు రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ పగిడీ ని 19 వ శతాబ్దం లో మొదట ప్రాచుర్యం లోకి తెచ్చింది ప్రముఖ సంఘ సంస్కర్త, శ్రీ మహదేవ్  గోవింద రెనేడే. శ్రీ పూనే రి పగిడీ సంఘ్ అనే సంస్థ చేసిన కృషి వల్ల 4 September 2009 Geographical Indication Registry వారి ద్వారా దీనికి  Geographical Indication ట్యాగ్ కూడా లభించింది. [The pagadi got the Intellectual Property Right (IPR) and selling of any turban made outside Pune, under the name of Puneri pagadi became illegal. Along with the Puneri pagadi, IPR has been previously issued to Indian products like Darjeeling tea, Banarasi saris, Tirupati ladoos, among others. సోర్స్: వికి పిడియా]

కొందరు ప్రముఖుల్ని తలపాగా లేకుండా ఊహించడం కష్టం. అలాంటి వారిలో కొందరు :
బాల గంగాధర తిలక్
సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్స్వామీ వివేకానంద

అలాగే మనరాష్ట్రం లోని కొందరు ప్రముఖులు:
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
శ్రీ కందుకూరి వీరేశలింగం
వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మోర్తి గారు 
శ్రీ గురజాడ అప్పారావు గారు

దివంగత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ 
కన్నడ తలపాగా లో శ్రీ పీ బీ శ్రీనివాస్ 
 అరుదుగా తలపాగా కట్టినా చూడచక్కని వాళ్ళు కొందరు .. 

ఆంధ్రుల అభిమాన నటుడు, నాయకుడు  NT రామారావు 

 అలాగే ప్రముఖులు కాని మరికొందరు:
***
*** 
***
***
(*** గుర్తు ఉన్న ఫోటోల  సౌజన్యం: turban tying expert శ్రీ మహేంద్ర సింగ్ పరిహార్ 
 http://rajwadisafa.blogspot.in/)
పూర్తిగా చదవండి...

Monday, September 9, 2013

పరబ్రహ్మరూపం గణేశం భజేమ..!

శ్రీ గణపతి స్తవః  :
ఋషిరువాచ :-
అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||1 ||


గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 2 ||


జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 3 ||


రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాచిన్త్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం భజేమ  || 4 ||


సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః || 5 ||


తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః || 6 ||


తమస్స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః || 7 ||


నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః || 8 ||


ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః || 9 ||


ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః || 10 ||


త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత || 11 ||


వయం భ్రామితాః సర్వథాజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || 12 ||


ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టో భూన్మహామునే |
కృపయా పరయోపేతోభిధాతు ముపచక్రమే || 13 ||

 స్వస్తి శ్రీ ఋషి కృతో గణపతి స్తవ స్సంపూర్ణమ్ ॥
***********************************************

పై ప్లేయర్ లో వినబడక పొతే దాని క్రింద ఇచ్చిన "స్కై డ్రైవ్" లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు .
చిత్రకారుడు : శ్రీ కూచి సాయి శంకర్
పూర్తిగా చదవండి...

మట్టి వినాయక ప్రతిమ

బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 

పోయిన ఆదివారం మా ఇంట్లో నేను, మా పిల్లలూ, వాళ్ళ ఫ్రెండ్స్ కలసి మట్టి వినాయకుడిని చెయ్యడం కోసం ఇలా ఒక వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. మా పిల్లలు కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్ వాళ్ళ స్నేహితులు భవ్య, భార్గవ్ లతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (భవ్య వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు నాకు కాలేజీ లో క్లాస్మేట్) వీళ్ళంతా మా శ్రీమతి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. భవ్య, కృష్ణప్రియ తమ సహాధ్యాయులతో కలసి చిన్న చిన్న ప్రోగ్రాములలో కూడా పాడారు.
 మట్టి గణపతిని తయారు చెయ్యడానికి సూచనలిస్తూ  నేనే..!!
నేను, నా శిష్య బృందం.. మట్టి వినాయకుడి రూపకల్పనలో..!

మా అమ్మాయి కృష్ణప్రియ
మా అబ్బాయి కృష్ణ ప్రీతమ్ , వెనుక ఉన్నది వాడి ఫ్రెండ్ భార్గవ్ విఘ్నేశ్వరుడి తయారీలో మొదటి అంకం
భార్గవ్ వాళ్ళ అక్క..! పేరు భవ్య..
ప్రతి ఫోటో క్రింద ఆ బొమ్మ తయారు చేసిన వారి పేరు చూడండి.
కృష్ణప్రియ
 కృష్ణ ప్రీతమ్ ( దీనికి రంగులేసింది నేను..!)

ప్రీతమ్ , భార్గవ్, భవ్య
తయారు చేసినది భార్గవ్, కుంచె తో రంగులద్దింది  వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు
భవ్య

ఇది నేను గీసినదే..! బ్లాక్ బోర్డ్ పైన సుద్దముక్కతో ..!!
  

ఇదివరకు వినాయకచవితి సందర్భంగా వ్రాసినవి :

యువ లో అచ్చయిన వపా గారి వినాయకుడి బొమ్మలు మరికొన్ని...!!

కాలుష్య కారక గణపతి ఉత్సవ మండళ్ళు..!!

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!

మేము చేసిన మట్టి వినాయక ప్రతిమ..!!

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...

 

 

పూర్తిగా చదవండి...

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)