Showing posts with label మహనీయులు. Show all posts
Showing posts with label మహనీయులు. Show all posts

Wednesday, March 13, 2013

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి

వంద వసంతాల శ్రీపాద పినాకపాణి
ీసు పి మీదూర్లో ఉండో గాలుగు రోజులుగేపు, టీవీ కి చూడేదు. ఇవాళళ్ళీ తిరుగప్రంలో శ్రీ శ్రీపాదినాకాణిగారికి అంత్యక్రియు జిగాయి చివి, విస్మానికి లోనయ్యాను. నిజానికి ఈ పోస్టు వ్రాద్దాముకున్ని శ్రీ పినాకపాణి గారి శతజయంతి సందర్భంగా..! మొదుపెట్టాను కాని వివిారాలల్ల ూర్తి చెయ్యేకోయాను. అదే పస్టుని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ూర్తి చెయ్యవలసి రావడం దురదృష్టకరం. 
 




పద్మభూషణ్ మెడల్ 
కర్ణాటక సంగీత లోకంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితులైన పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డా. శ్రీపాద పినాకపాణి గారు నేడు తమ నూరవ పుట్టిన రోజును స్వస్థలమైన కర్నూలు లో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా వారు మంచి హస్తవాసి గలిగిన వైద్యులుగా పేరు తెచ్చుకున్నా సంగీత లోకానికి చేసిన సేవ మరపురానిది. కర్ణాటక సంగీతం అంటే మద్రాసు, తంజావూరు లాంటి తమిళ నాడుకి చెందిన ప్రాంతాల వారు మాత్రమే పాడగలరు, వారు పాడినదే వినగలం అనుకొనే రోజుల్లో మన తెలుగువాడైన పినాకపాణి గారి కచ్చేరీలంటే తమిళశ్రోతలు చెవికోసుకొనేవారంటే వారి గాత్ర మాధుర్యం, విద్వత్తు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
వారి శిష్యులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో పేరెన్నిక గన్న వోలేటి వేంకటేశ్వర్లు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మొదలైనవారు. ఇంకా శ్రీమతి సరస్వతీ విద్యార్ధి, వారి కుమార్తె కుమారి లహరి, మల్లాది సోదరుల పేరుతో ప్రసిద్ది చెందిన శ్రీ   శ్రీరామ్ ప్రసాద్ , శ్రీ రవికుమార్ గార్ల వంటి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి కర్నాటక సంగీతాన్ని మరిన్ని తరాలు ముందుకు తీసుకుపోయే రాచ బాటలు వేసారు శ్రీ పినాక పాణి గారు. 
1993-94లో అనుకుంటా.. (నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయిఉంటుంది) నేదునూరి కృష్ణమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారు వ్రాసిన 'అన్నమయ్య పదసౌరభం' పుస్తకానికి ముఖచిత్రం వెయ్యమని అడిగారు. మల్లాది సోదరులతో  పరిచయం కలిగింది కూడా శ్రీ నేదునూరి గారి ఇంటివద్దే. అప్పుడే శ్రీపాద పినాకపాణి గారి పుస్తకం 'మనోధర్మ సంగీతం' గురించి వినడం. ఆయన గురించి, ఆ పుస్తకాన్ని గురించీ చెబుతూ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు నాకు దాని వ్రాతప్రతి కాపీని నాదగ్గర ఉంచుకోమని ఇచ్చారు. ముత్యాల్లాంటి పినాక పాణి గారి దస్తూరితో ఉన్న ఆ వ్రాత ప్రతి నా వద్ద ఇంకా భద్రంగా వుంది. తరువాత ఆపుస్తకం తితిదేవస్థానం వారు ముద్రించాక తిరుపతిలో కొనుక్కున్నాను. అలాగే పాణి గారు వ్రాసిన 'నా సంగీత యాత్ర' సంగీత ప్రపంచం లో వారి అనుభవ సారాన్ని క్రోడీకరించి,  వర్ధిష్ణు కళాకారులకి స్స్ఫూర్తిదాయకం గా ఉండే ఎన్నో సంగతులని స్పృశించారు. 

తితిదేవస్థానం వారిచే నాలుగు భాగాలుగా ముద్రించబడిన 'సంగీత సౌరభం' సంగీత లోకానికే  మకుటాయమానం.
వారి శతజయంత్యుత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం, వారి శిష్య ప్రశిష్యులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఆ రోజు వారి స్వగృహం లో జరిగిన అభినందన మరియు సన్మాన కార్యక్రమ విశేషాలు  ఈ లింక్ నొక్కి చూడండి. 
శ్రీపాద వారివే ఇంకొన్ని ఫోటోలు:



వివిధ పత్రికలలో శ్రీ పినాకి గారి ంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు ఒక్క చోటే మనందరికోసం: 

గాంధర్వ వేదామృతవాణి.. పినాకపాణి -కొమాండూరి శేషాద్రి (ఆంద్ర భూమి)
 
స్వరరాగ ఝురికి వందేళ్లు (సాక్షి)

ఈ శతాబ్దపు సంగీత కళానిధి - డాక్టర్ శ్రీపాద పినాకపాణి -- ఈరంకి వెంకట కామేశ్వర్

కినిగే లో శ్రీపాద వారి పుస్తకాలు

The Masterpiece Collection - Live Concert - Dr Sripada Pinakapani (వారు పాడిన కీర్తనల ఆడియో లింక్)


అదందర్ంగా దూరర్న్ సప్తిరి వారు పినాకాణి గారితో నిర్వించిన ఇంటర్వ్య ప్రారం చారు.  (చాలా పాతి అనుకుంటా.. ! కీసం ఇరై ఏళ్ల క్రితంది. దానిలో వారి దినర్యొత్తం చూపిస్తూ, ిష్యులో వారి పాలు, డక్టు గి ప్రాక్టీసు, వ్యాయామొదైని చూపించారు. 

శ్రీపాద వారి గురించి శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి గారఈమాటెబ్ పత్రికవ్రాసిన వ్యాసం  మంచి లింక్ అందించిన 'అజ్ఞాత' కు ధన్యవాదాలు 



ఆంధ్రదేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు డా. శ్రీపాద పినాకపాణి గారి కుటుంబానికీ, వారి శిష్య ప్రశిష్యులకూ , అశేషమైన వారి అభిమానులకూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 
పూర్తిగా చదవండి...

Tuesday, December 4, 2012

అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి..!!

 అమరగాయకుడు ఘంటసాల గారి 90 వ జయంతి సందర్భంగా
వారి అభిమానులందరూ అందుకోండి 
ఈ విశేష "స్మృతి సంచిక" (ప్రముఖ వ్యక్తుల జ్ఞాపకాల్లో అమరగాయకుడు)
మరియు వారి అరుదైన చిత్రాలు (100 ఫోటోలు)..!!

కీ. శే. శ్రీ ఘంటసాల గారు



ఈ క్రింది లింకులు నొక్కి పైన చెప్పిన అరుదైన సమాచారం డౌన్ లోడ్ చేసుకోండి.
పూర్తిగా చదవండి...

Tuesday, November 13, 2012

వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు..!

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను. 
మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!
 పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి 
(మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)
 నరకాసురుడిని సంహరిస్తున్న సత్యభామ.
 ఇవి మూడూ 'యువ' మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు వేసిన బొమ్మలు 


పూర్తిగా చదవండి...

Saturday, March 24, 2012

వడ్డాది పాపయ్యగారి 'నక్షత్ర బాల' లు..! (నక్షత్రాలకు స్త్రీ రూపాలు)


క్రితం పోస్ట్ (వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!) లో  వడ్డాది పాపయ్య (వపా) గారు రూపమిచ్చిన రాగ కన్యకల గురించి ముచ్చటించుకొన్నాం. ఇప్పుడు వారు గీసిన 'నక్షత్ర బాల' లను చూడండి. ఇవి కూడా యువ మాస పత్రికలలో వచ్చినవే..!

నాగ కన్యలు అని మన వాళ్ళు సినిమాలలో చూపించేటప్పుడు ఆహార్యం నాగ ముద్రలతో ఉన్నట్లు, వపా గారి ఈ 'నక్షత్ర బాల' ల ఆహార్యం లో పంచ శీర్షాలతో కూడిన తెల్లటి నక్షత్రాలు కనిపిస్తాయి. జాగ్రత్త గా చూస్తే ఆ నక్షత్ర సంబంధమైన లక్షణాలను ఆ యువతి లో గమనిస్తాం. పాపయ్య గారు ఆ నక్షత్రాల రాశులనో లేక పేరులోని అర్థాన్నో సింబాలిక్ గా ఉండేటట్టు ఊహించి ఈ చిత్రాలను గీశారనుకుంటాను.

[మన  ప్రాచీన  సంప్రదాయాల ప్రకారం (వాటిని జ్యోతిశ్శాస్త్రం అనాలో లేక ఖగోళ శాస్త్రం అనాలో తెలియలేదు..! బహుశ పంచాంగం అనాలేమో..!!) నక్షత్రాలు 27 .. అశ్విని, భరణి, కృత్తిక, మొదలైనవి. ప్రతీ నక్షత్రానికీ నాలుగేసి  పాదాలు. అలాగే రాశులు మేషం, వృషభం మొదలుగా గలవి..12. నాలుగు పాదాలతో కూడిన ఇరవై ఏడు నక్షత్రాలని( 27  x  4 = 108 ) పన్నెండు రాసులలోకి విభజిస్తే ఈ క్రింది విధంగా భాగించ బడతాయి.

అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం 
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం 
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం 
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం 
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య 
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల 
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం 
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః 
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం 
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం 
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం ]


పై శ్లోకం, దాని అర్థం http://jyotishavidyarthi.blogspot.in/2011/12/blog-post.html నుండి తీసుకొన్నాను. వారికి నా ధన్యవాదాలు.





రోహిణి 
'రోహిణి' వృషభ రాశికి చెందిన నక్షత్రం. వృషభానికి మల్లె  పొడుగాటి చెవులూ-కొమ్ములను తలపించే కేశాలంకరణ, మామూలుగా కన్నా కొంచం పొడవైన మెడ గమనించండి.
ఆశ్లేష 












 'ఆశ్లేష' కర్కాటక రాశికి చెందినది. ఈ నక్షత్ర సుందరి నడుము మీద   కర్కాటకం (పీత) గమనించండి.



మఖ 

మఖ నక్షత్రం సింహరాశిలోకి వస్తుంది. ఈ అమ్మాయి నిలబడిన తీరు, ముఖం చుట్టూ పరుచుకున్నజుట్టు సింహాన్ని తలపించటంలేదూ..!!
హస్త 











 
అలాగే హస్త నక్షత్రం..!! 'హస్త' అంటే చెయ్యి తో పాటూ ఏనుగు కూడా కదా.. అందుకే ఏనుగు ముఖం కూడా కనబడేటట్టు వేసారు




చిత్ర 
'చిత్ర' నక్షత్ర బాలను (వ్యావహారికం లో 'చిత్త') చిత్రకారిణి లాగా  గీశారు
స్వాతి 






   
 స్వాతి చినుకులు 
ముత్యపు చిప్పలలో పడి 
ముత్యాలుగా మారతాయంటాం కదా..!! అందుకేనేమో..చిత్రంలో ముత్యపు చిప్ప, దానిలో ముత్యాలూ, మధ్యలో 'స్వాతి'





విశాఖ
ఇక 'విశాఖ' సుందరి విషయానికొస్తే..రెండు చేతులలో బరువులుంచుకొని బేరీజు వేస్తున్నట్టు ( త్రాసులో తూకం వేస్తున్నట్టు) వేశారు. ఈ నక్షత్రం లో మొదటి మూడు పాదాలు తుల రాశి , ఒక పాదం వృశ్చికం..
(సుందరి కొప్పులో ఏముందో చూడండి)

శ్రవణం 




 .

   
 





శ్రవణం అందరికీ తెలిసినదే... విష్ణువు నక్షత్రం. రాశి మకరం. అందుకేనేమో ఈ యువతి రూప కల్పనలో విష్ణువాంశ చూపారు. కుడి చేతిలో చక్రం ధరించి ఎడమ చేతితో క్రిందనున్న మకరాన్ని (మొసలి) చూపుతోంది.


 

పూర్వాభాద్ర
ధనిష్ఠ 
శతభిషం 
ఇక పొతే 'ధనిష్ఠ', 'శతభిషం'  కుంభరాశికి చెందిన నక్షత్రాలు.. 'పూర్వాభాద్ర' యొక్క రాశి మీనం.
ఈ అమ్మాయికి కుడి వైపు చేపను చిత్రించారు.

వడ్డాది పాపయ్యగారి ఈ నక్షత్ర చిత్రాల్నీనక్షత్రాలూ - రాశులకు సంబంధించిన పైన చెప్పిన వివరాలనూ పోల్చితే నాకు కనిపించిన, అనిపించిన విషయాలను వ్రాశాను. అవి ఎంతవరకూ సహేతుకమో, ఈ విషయాల పైన పట్టున్న విజ్ఞులెవరైనా చెప్పాల్సిందిగా మనవి.
పూర్తిగా చదవండి...

Sunday, March 18, 2012

వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!

               వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది.  ఇప్పటివరకు లభ్యమవుతున్న వారి పెయింటింగ్స్ లో రాగాల పేర్లతో ఉన్న ఈ క్రింది బొమ్మలు అన్నీ మన బ్లాగు మిత్రుల సౌకర్యార్థం ఒక దగ్గర ఉంచాను. యువ లో వారి పెయింటింగ్స్ కొన్ని ప్రత్యేకమైన శీర్షికలతో వచ్చాయి. కొన్ని నక్షత్రాలకు కూడా వారి చిత్రణలో, రూపమిచ్చారు. 
              అయితే వపా గారు రాగాల పేర్లతో చిత్రించిన ఈ చిత్రాలు  చూస్తే వాటి పేరుని బట్టీ, దానికి సరిపోయే సన్నివేశాన్ని చిత్రించినట్టు కనిపిస్తోంది. జన రంజని - జనాన్ని రంజింపజేసేది (సినిమా తారలా అనిపిస్తోందినాకు.. అక్కడ చూపించిన జనం సినిమా హాలులో కూర్చున్నట్టుంది), కదన కుతూహలం - యుద్ధానికి తరలుతున్న సైనికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలికే సన్నివేశం. భాగేశ్వరి రాగానికి శివుడి అర్థనారీశ్వర రూపాన్ని చిత్రించిన తీరు చూడండి. అలాగే శివరంజని, అమీర్ కల్యాణి...!!
             క్రొత్తగా సంగీతం నేర్చుకొనే వారు మొట్టమొదట అభ్యాసం చేసే సరళీ స్వరాలూ, జంటస్వరాలూ, అలంకారాలూ వంటివి మాయామాళవ గౌళ రాగం లోనే వుంటాయి. అందుకే ప్రథమ పూజలందుకొనే గణపతికి కైమోడ్పులిస్తున్నచిన్నారిని (ఎదురుగా చిన్న పియానో / హార్మోనియం తో సహా) చిత్రించినట్టున్నారు.  
            యమునా కళ్యాణికి - యమునాతీరంలో గోపికలూ, ఆలమందలూ, రాధ తో విహరిస్తున్న కృష్ణుడిని చిత్రించారు. అలాగే శ్రీ రాగానికి లక్ష్మీదేవి విష్ణువుని వరించే సన్నివేశాన్నిచిత్రించారు. (శ్రీ - అంటే లక్ష్మి కదా..!) సన్నివేశాన్ని జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనం లో ఉద్భవించిన లక్ష్మీ దేవి, ఆసనం గా పద్మం, ఉరకలెత్తుతున్న సముద్రం, అప్పుడే పాల సముద్రం లోంచీ పుట్టిన చంద్రుడు కనిపిస్తారు.  
                    'కీరవాణి' రాగానికి రతీ మన్మధులని గీస్తూ emphasis వాహనమైన చిలకకి ఇచ్చారు. అలాగే 'సారంగ' రాగానికి గీసిన బొమ్మలో జింక బొమ్మ ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాగే మిగిలిన రాగాల పేర్లకీ ఈ చిత్రాలకీ వున్నసంబంధాన్ని తెలిసిన వారెవరైనా ఇంకాస్త వివరిస్తారని ఆశిస్తున్నాను.  
కన్నడ - శహన
బేహాగ్ - మలయ మారుతం
జన రంజని
శ్రీరంజని
మేఘ రంజని


రంజని
కీరవాణి


సారంగ
ముఖారి
భాగేశ్వరి
కదనకుతూహలం


శివరంజని - హిందోళ
సోహిని - మేఘరంజని - మాల్కోస్
కాంభోజి - కాపి
జయజయవంతి - అహిర్ భైరవి
మేఘ మల్హార్
చారుకేశి
కేదార గౌళ 
మాయామాళవగౌళ 
యమునా కల్యాణి 
యమునా కల్యాణి
























































అమీర్ కల్యాణి
శ్రీ రాగం
మాల్కోస్


















************************************
వపా గారి నక్షత్ర బాలలు మరో పోస్టులో..!! 
పై ఫోటోలు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్యాం నారాయణ్ గారి సౌజన్యంతో...! వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.


పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)