Sunday, March 18, 2012

వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!

               వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది.  ఇప్పటివరకు లభ్యమవుతున్న వారి పెయింటింగ్స్ లో రాగాల పేర్లతో ఉన్న ఈ క్రింది బొమ్మలు అన్నీ మన బ్లాగు మిత్రుల సౌకర్యార్థం ఒక దగ్గర ఉంచాను. యువ లో వారి పెయింటింగ్స్ కొన్ని ప్రత్యేకమైన శీర్షికలతో వచ్చాయి. కొన్ని నక్షత్రాలకు కూడా వారి చిత్రణలో, రూపమిచ్చారు. 
              అయితే వపా గారు రాగాల పేర్లతో చిత్రించిన ఈ చిత్రాలు  చూస్తే వాటి పేరుని బట్టీ, దానికి సరిపోయే సన్నివేశాన్ని చిత్రించినట్టు కనిపిస్తోంది. జన రంజని - జనాన్ని రంజింపజేసేది (సినిమా తారలా అనిపిస్తోందినాకు.. అక్కడ చూపించిన జనం సినిమా హాలులో కూర్చున్నట్టుంది), కదన కుతూహలం - యుద్ధానికి తరలుతున్న సైనికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలికే సన్నివేశం. భాగేశ్వరి రాగానికి శివుడి అర్థనారీశ్వర రూపాన్ని చిత్రించిన తీరు చూడండి. అలాగే శివరంజని, అమీర్ కల్యాణి...!!
             క్రొత్తగా సంగీతం నేర్చుకొనే వారు మొట్టమొదట అభ్యాసం చేసే సరళీ స్వరాలూ, జంటస్వరాలూ, అలంకారాలూ వంటివి మాయామాళవ గౌళ రాగం లోనే వుంటాయి. అందుకే ప్రథమ పూజలందుకొనే గణపతికి కైమోడ్పులిస్తున్నచిన్నారిని (ఎదురుగా చిన్న పియానో / హార్మోనియం తో సహా) చిత్రించినట్టున్నారు.  
            యమునా కళ్యాణికి - యమునాతీరంలో గోపికలూ, ఆలమందలూ, రాధ తో విహరిస్తున్న కృష్ణుడిని చిత్రించారు. అలాగే శ్రీ రాగానికి లక్ష్మీదేవి విష్ణువుని వరించే సన్నివేశాన్నిచిత్రించారు. (శ్రీ - అంటే లక్ష్మి కదా..!) సన్నివేశాన్ని జాగ్రత్తగా చూస్తే క్షీరసాగర మథనం లో ఉద్భవించిన లక్ష్మీ దేవి, ఆసనం గా పద్మం, ఉరకలెత్తుతున్న సముద్రం, అప్పుడే పాల సముద్రం లోంచీ పుట్టిన చంద్రుడు కనిపిస్తారు.  
                    'కీరవాణి' రాగానికి రతీ మన్మధులని గీస్తూ emphasis వాహనమైన చిలకకి ఇచ్చారు. అలాగే 'సారంగ' రాగానికి గీసిన బొమ్మలో జింక బొమ్మ ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాగే మిగిలిన రాగాల పేర్లకీ ఈ చిత్రాలకీ వున్నసంబంధాన్ని తెలిసిన వారెవరైనా ఇంకాస్త వివరిస్తారని ఆశిస్తున్నాను.  
కన్నడ - శహన
బేహాగ్ - మలయ మారుతం
జన రంజని
శ్రీరంజని
మేఘ రంజని


రంజని
కీరవాణి


సారంగ
ముఖారి
భాగేశ్వరి
కదనకుతూహలం


శివరంజని - హిందోళ
సోహిని - మేఘరంజని - మాల్కోస్
కాంభోజి - కాపి
జయజయవంతి - అహిర్ భైరవి
మేఘ మల్హార్
చారుకేశి
కేదార గౌళ 
మాయామాళవగౌళ 
యమునా కల్యాణి 
యమునా కల్యాణి
























































అమీర్ కల్యాణి
శ్రీ రాగం
మాల్కోస్


















************************************
వపా గారి నక్షత్ర బాలలు మరో పోస్టులో..!! 
పై ఫోటోలు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్యాం నారాయణ్ గారి సౌజన్యంతో...! వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.


33 comments:

  1. ఎంతో బాగున్నాయి! రాగాలని ఈ రూపంలో చూడడం చాలా బాగుంది! కన్నడ - శహన రాగాల చిత్రం సరిగ్గా లేదు కొంచెం సవరించరూ! మీకు అభ్యంతరం లేకపోతే ఇవన్నీ నేను సేవ్ చేసుకోవచ్చా?

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ.. కన్నడ - శహన రాగాల చిత్రం కొత్తది పెట్టాను చూడండి.

      Delete
  2. రసజ్ఞ గారూ..! నిరభ్యంతరంగా సేవ్ చేసుకోవచ్చండీ..! కన్నడ - శహన బొమ్మ నావద్ద ఉన్నదే అలా ఉంది. సారీ..!
    :(

    ReplyDelete
  3. ధన్యవాదాలు.
    సారంగము అంటే దుప్పి అని అర్థమున్నది.
    చారుకేశి అంటే అందమైన కేశములు గలది అని....
    కేదారగౌళ లో కేదారేశ్వరుడు, మంచు లింగము కనిపిస్తున్నారు.

    ReplyDelete
  4. అద్భుతం వారి చిత్రీకరణ. ధన్యవాదములు

    ReplyDelete
  5. ఇవన్నీ ఎక్కడ సేకరించారు మీరు? అద్భుతం! నా దగ్గర పాత యువ మాసపత్రికలు 35 ఏళ్ళ నాటివి కూడా ఉన్నాయి. వాటి ముఖచిత్రాల్లో దాదాపుగా అన్నీ వపా వేసినవే!వాటిలో ఈ రాగ కన్యల చిత్రాలు ఉన్నాయేమో చూడాలి.

    అది కానడ రాగం కదా! లేక కన్నడే కానడగా మారిందా?

    భాగేశ్వరి దుఃఖ ప్రధానమైన రాగం! దానికి అర్థ నారీశ్వర రూపాన్ని చిత్రించడంలో ఆంతర్యమేమిటో వివరిస్తారా దయ చేసి?

    చారు కేసి,మేఘ మల్ హార్,కాంభోజి,కాపీ ఈ రాగాలన్నీ అద్భుతంగా చిత్రించారు.

    వీటిని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు!

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ..!నమస్కారం..!!
      పార్వతి శివుడిలో ’సగ’భాగేశ్వరి కదా..! అందుకనే అలాగీసి ఉంటారు.
      మీ దగ్గర పాత యువలు వున్నాయా..!! నాకు శ్రీ శ్యామ్ నారాయణ్ గారి వద్దనుంచి వచ్చాయి. మీమెయిల్ ఐడీ ఇస్తే నాదగ్గర వున్న యువ సాఫ్ట్ కాపీల జాబితా పంపుతాను.
      నాకు యువ 1966 ఆగష్టు సంచిక లోని 60 -70 పేజీ నెం లు కావాలి. దానిలో మొఘలు దర్బారు కుట్రలు అనే సీరియల్ పేజీలు (నాదగ్గర లేనివి)ఉన్నాయి.
      అవకాశం వుంటే radhemadhavi@gmail.com కు పంపగలరు.
      - రాధేశ్యాం

      Delete
  6. వ.పా.గారి చిత్రాలు ప్రచురించినందుకు సంతోషం.చిన్నప్పుడు చూసినవే .సారంగం అంటే,దుప్పి,(తుమ్మెద అని కూడా) అర్థం .భాగేశ్వరి లో ఈశ్వరి ఉంది కదా.కానడ రాగమే వ్యవహారంలో కన్నడ ఐంది.జాగ్రతగా పరిశీలిస్తే అన్ని చిత్రాలకీ,ఆ,రాగాలకీ సంబంధం గోచరిస్తుంది.ఉత్తరాదిలో రాగరాగిణుల్ని చిత్రించే సంప్రదాయం ఉంది.(మొఘల్,రాజపుత్ర చిత్రాలు).

    ReplyDelete
  7. thanks meeku shyam narayan gaarki

    ReplyDelete
  8. నిర్ల్యక్ష్యం కానీయండి,అలసత్వం కానీయండి; తెలుగువారు పట్టించుకోని గొప్ప చిత్రకారుడు. బాపు గారికి కొన్ని గౌరవాలు దక్కలేదని చింతిచినట్లుగానే, ఈయనదీ అదే గతి. వడ్డాది గారి చిత్రాలే వేరు. అలాంటి చిత్రకారుడు మరలా వస్తారని అనుకోను. ముఖ్యంగా తెలుగువారి మధ్యకి. వడ్డాది గారి బొమ్మల ఒరిజినల్స్ ఎవరిదగ్గరున్నాయో సేకరించి ఒక ఆర్ట్ మ్యూజియం పెడితే బావుంటుంది. అందులో ప్రముఖ చిత్రకారుల కొన్ని మూల ప్రతీకలు కూడా పెట్టచ్చు. తెలుగువారికి అరుపులే తప్ప అభిరుచి లేదు. డిజిటల్ టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి, మీరు పెట్టిన వాటినే మెరుగు పెరిస్తే ముందు తరాల వారికి అంటే చిత్రలేఖనం అభిలాష ఉన్న వారికి ఎంతో ఉపకరిస్తాయి. వీటన్నింటికీ అర్థమూ, అభిరుచీ కావాలి. అన్నిటికన్నా శ్రద్ధా, ఓపికా కావాలి. నాక్కాలసిన వాటికోసం పక్కవాడి కేసి ఎదురుచూసే తెలుగు వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. ( అందుకే నా అక్షరాలు అరుస్తున్నాయి. చేతలు చేతులు ముడుచుక్కూచ్చున్నాయి. )

    దాచుకోవల్సిన బొమ్మలు! అందించినందుకు ధన్యవాదాలు!

    -బ్రహ్మానందం గొర్తి

    ReplyDelete
    Replies
    1. బ్రహ్మానందం గారూ,
      ఈమాట.కామ్ లో మీ వ్యాసాలు చూస్తూ వుంటాను. ధన్యవాదాలు మీ స్పందనకు..!
      వపా గారిగురించీ ఇంతకు ముందు మరికొన్ని వ్యాసాలు వ్రాసాను. వీలయితే చూడండి. మీరు సూచించిన సలహాల గురించీ, కలా ప్రదర్శనలమీద వపాగారి అభిప్రాయాలను గురించీ విపులంగా వ్రాసాను.
      http://radhemadhavi.blogspot.com/2010/10/blog-post_16.html
      http://radhemadhavi.blogspot.com/2010/10/blog-post_23.html
      http://radhemadhavi.blogspot.com/2010/10/blog-post_29.html
      http://radhemadhavi.blogspot.com/2011/10/blog-post.html

      Delete
  9. 'The waking dreamer in colours':
    వెలకట్టలేని ఆ పుస్తకం ధర రూ.100/-, 'లేఖలు' పుస్తకం వెల రూ.10/- మాత్రమే.
    ప్రతులకై :
    Smt Sunkara Jhansi Lakshmi,
    Flat no: 201, R.R.Enclave,
    Near Zinc Gate,Gajuvaka Post,
    Visakhapatnam -26

    శ్రీ చలపతి రావు గారు CD ని ఈ డిసెంబర్ లోనే విశాఖపట్నం లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు...!!

    రాధేశ్యాం గారూ,

    మీరు చెప్పిన ఆ CD, పుస్తకం రిలీజయ్యాయా?
    అవి హైద్రాబాదులో ఎక్కడ దొరుకుతాయి?
    దయ చేసి చెప్పగలరు.

    -బ్రహ్మానందం గొర్తి

    ReplyDelete
  10. బ్రహ్మానందం గారూ,
    మీరు హైదరాబాదులోనే ఉంటే పోస్ట్ లో తెప్పించుకోవటం సులువు. చలపతిరావు గారికి చెప్పి తెప్పించుకోవచ్చు. వీరు వ్రాసినదే వపా గారిమీద ’తెలుగు జాతి రత్నాలు సీరీస్’ లో సి పి బ్రౌన్ అకాడెమీ వారు ఈ మధ్యే ఇంకో పుస్తకం రిలీజ్ చేసారు. అది కూడా వుంది నా దగ్గర. చాలా బాగుంది. అది సి పి బ్రౌన్ అకాడెమీ, హైదరాబాద్ లోనే దొరుకుతుంది.
    శ్రీ చలపతిరావు గారి ఫోన్ నెం: 09985933785

    ReplyDelete
  11. ఈమెయిల్ ద్వారా శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి స్పందన:
    gabbita prasad
    9:56 PM (19 hours ago)

    to me
    రస రేఖలే అవి .రాగానికి భావం జోడించి రాగ కన్యలను సృష్టించిన వడ్డాది పాపయ్య గారు
    రేఖా చిత్ర పాప రేడు అంటే ఆదిశేషుడు - దుర్గా ప్రసాద్
    ధన్యవాదాలు దుర్గా ప్రసాద్ గారూ.. మీ స్పందనకు..!

    ReplyDelete
  12. బొమ్మలు చాలా బాగున్నాయండీ! పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    మీ దగ్గరున్న యువ సాఫ్ట్ కాపీలు (కనీసం ఒక్కటైనా సరే) పంచుకొవటానికేమైనా అభ్యంతరమా? చిన్నప్పుడు యువ పత్రిక చూడటమే కాని చదవటం ఙ్ఞాపకం లేదు!

    శారద

    ReplyDelete
  13. యువ గురించి వినడమే గాని ఎప్పుడు చూడలేదు...చాలా మంచి చిత్రాలు సేకరించారు..Thanks for sharing such a beautiful post..best Regards,Naagini.

    ReplyDelete
  14. తదుపరి పోస్టులలో యువ లు షేర్ చేస్తాను.

    ReplyDelete
  15. రాధేశ్యాం గారూ, నా బ్లాగులో మీ వ్యాఖ్య, ఇక్కడి వ్యాఖ్య రెండూ చదివాను. ఇంకో విషయం, మీ ఈ బ్లాగు పోస్టు లింక్ నాకు ఈ మెయిల్ ద్వారా వచ్చింది.

    నా వద్ద పాత యువులు ఉన్నాయి కానీ అవి 80 ల లోవే! అంతకు ముందువి లేవు. శ్యామ్ నారాయణ గారి నుంచి స్కాన్ చేసిన పాత యువల కాపీలు నేనూ తీసుకున్నాను.

    మరో సారి ధన్యవాదాలు ఇలాంటి అపురూప చిత్రాలు పంచినందుకు

    ReplyDelete
  16. చక్కని చిత్రాలను పరిచయం చేశారు.కృతజ్ఞతలు

    ReplyDelete
  17. మంచి పోస్టు. వపా గారి చిత్రాలు స్వాతి వారపత్రిక ముఖచిత్రాలుగ వచ్చినప్పటికీ, వీటిలో ఉన్న ఒక ప్రత్యేక శైలి యువ లో మాత్రమే చూసినట్లు గుర్తు. నా చిన్నప్పుడు యువలో ఈ చిత్రాలను చూడడమే గాని అప్పటికి పఠన శక్తి లేక చదవలేదు. ఇప్పుడు పఠన శక్తి, పఠనాసక్తి ఉన్నా, నా దగ్గర యువ కాపీలు లేవు. మీరు షేర్ చేయబోయే యువ సాఫ్ట్ కాపీలు కోసం ఎదురుచూస్తున్నాను.

    ReplyDelete
  18. వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను..కానీ ఆ వీలే చిక్కటం లేదు. పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  19. మిత్రులు రాధేశ్యాం గారికి శుభాశీస్సులు. వడ్డాడి పాపయ్య గారి బొమ్మలు నా దగ్గర లేనివి చూపించారు. చాలా సంతోషం.
    వాపాగారి శైలే వేరు. ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత వుంటుంది.

    ReplyDelete
  20. మీ బ్లాగ్ చాలా బాగుంది. ఒక థీంకి చెందిన వడ్డాది పాపయ్యగారి చిత్రాలు ఒకచోట ఇలా కూర్చడం అద్భుతం.

    ReplyDelete
  21. రాధేశ్యాం గారు ! మీ బ్లాగ్ చాలా బాగుంది. కొన్ని పోస్ట్లు నేను వెరే ఫేస్బుక్ గ్రూపు లతో షేర్ చేసు కొవచ్చా ?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ గారూ..!
      మంచి విషయాలని మీకనిపించినవి నలుగురితో పంచుకోవడానికి అభ్యంతరమేముంటుంది..!! షేర్ చేయండి. మరేమీ పరవాలేదు..!

      Delete
  22. Thank you for the collection, Radheshyam garu
    .

    ReplyDelete
  23. Saarangi means deer ( telugu ledi ) thats why in the painting, eyes of the Lady match with eyes of the deer. .... Peri ravi Kumar

    ReplyDelete
  24. dont know how to type in telugu... thats why writing in English... (1)Bhageswari raagam painting excellent... Bhaagamu means Part... the picture shows Ardha Nareeswara... parvati & shiva (2) Raagam Keeravani... Keeramu means chiluka... Manmathuniki vaahanamu chiluka thats why the painting shows chiluka (3) raagam Chaarukesi... chaaru means fine,beautiful etc; charukesi means one with beutiful Hair (jada) ... picture reflects this meaning

    ReplyDelete
  25. రాధేశ్యాం గారు ! మీ బ్లాగ్ చాలా బాగుంది. నా పేరు అప్పాజీ అంబరీష.. అభిసారిక రాంషాగారి అబ్బాయిని. మీ దగ్గర అభిసారికలు డిజిటల్‌ కాపీలేమైనా ఉంటే దయచేసి షేర్‌ చెయ్యగలరా.. అలాగే యువ పత్రికలు కూడా.. నా మెయిల్‌ ఐడి: ambarisha@gmail.com

    ReplyDelete
  26. అయ్యా
    రాధే శ్యాంగారూ ఆంద్రప్రదేశ్ స్కూల్ పిల్లలకు గణితం-సంగీతం మద్య సంబంధం చెప్పే క్లాసు కోసం వడ్డది గారి చిత్రాలు వాడుకోడానికి అనుమతివ్వండి.పిల్లల మనస్సులో వడ్డాది గారూ బ్రతుకుతారు. ‍‍umachiraju@gmail.com,9849203793

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)