స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక పేరుతో విడుదలైన ఈ పుస్తకం ఘంటసాల వారి స్మృత్యర్ధం విజయనగరంలోని వారి అభిమానుల చేత ముద్రించబడింది. సాంబశివరావు గారి సంపాదకత్వంలోఅచ్చయిన ఈ పుస్తకం ఇదివరకు ఘంటసాల వారి సంస్మరణలో వివిధ పత్రికల లో వచ్చిన వ్యాసాలూ, ఘంటసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలూ మొదలైనవి గుదిగ్రుచ్చబడిన పదహారు పేజీల చిన్ని పుస్తకం. అమూల్యమైన ఈ పుస్తకం వెల రూ. 10/-.
ఈ పుస్తకం నాకు మా బంధువుల ద్వారా వచ్చింది. చాలా పత్రికలనుంచీ సేకరించిన ఈ వ్యాసాలు జే. వి. రాఘవులు, ఆచార్య ఆత్రేయ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మొదలైన వారు వ్రాసారు. విజయ చిత్ర, ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ఘంటసాల వారి జీవితవిశేషాలతో వచ్చిన వ్యాసాలూ కూడా వున్నాయి. అన్నిటికంటే ఘంటసాల వారే తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి గురించి వ్రాసిన వ్యాసం కూడా పొందుపరచ బడింది..! ఇన్నిటిని ఒకే చోట కూర్చిన సంపాదకుల శ్రమకు జోహార్లు. అయితే ఈ పుస్తకం మీద అది విడుదలైన తేదీ, ముద్రించబడిన సందర్భం కూడా ఉండి వుంటే ఇంకా బాగుండేది.
ఇవి 'స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక' లోని కొన్ని పేజీలు మాత్రమే..!!
మొత్తం పుస్తకం (16 పేజీలు )పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి.
*************
( శ్రీ రాజేంద్ర కుమార్ గారు ఈ ఫైల్ డౌన్లోడ్ అవటం లేదని అన్నారు. పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి.
అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. )
*************
అలాగే ఘంటసాల గారి అరుదైన చిత్రాలు డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ నొక్కండి.
పైన లింకు ఎంత నొక్కినా ఆ పీ డీ యఫ్ ఫైల్ దిగిరాను అంటోందండీ,మీ దగ్గరే తీసుకుని ఫొటో స్టాట్ తీయించుకుంటాను.
ReplyDeleteరాజేంద్ర గారూ,
Deleteనాకు బాగానే దిగివస్తోంది. మళ్ళీ ఇంకోసారి చెక్ చెయ్యండి. నేనుకూడా ఫొటోలే పెట్టడానికి ప్రయత్నిస్తాను.
పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి.
DeleteSorry, we are unable to retrieve the document for viewing because it is too large.
You can also try to download the original document by clicking here.
అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది.
రాధేశ్యాం గారు శుభసాయంత్రం. ఘంటసాల వారి పుస్తకం గురించి మంచి విషయాలు చెప్పారు. పుస్తకం వెల పదిరూపాయలంటే
ReplyDeleteచాలా ఆశ్చర్యమేసింది.
sir,
ReplyDeletegreat post, still i'm unable to download the link.
thanks
మీఫోన్ నం తెలుపగలరు.
ReplyDelete