బ్లాగు మిత్రులందరికీ
శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది పర్వదినాన గడచిన 'ఖర' నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ “నందన” నామ సంవత్సరానికి
నిండు మనసుతో స్వాగతం పలుకుదాం..!
శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది పర్వదినాన గడచిన 'ఖర' నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ “నందన” నామ సంవత్సరానికి
నిండు మనసుతో స్వాగతం పలుకుదాం..!
హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఒకటవ తేది.
కానీ సంవత్సరారంభం.. యుగ + ఆది.. ఉగాది ఇప్పుడు కేవలం వేపపువ్వు తినే పండుగగా మాత్రమే భావించబడుతోంది..! ఖగోళ శాస్త్ర రీత్యా ఏ ప్రత్యేకత లేని జనవరి ఒకటినే ఇప్పుడందరూ క్రొత్త సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు.
డిసెంబరు 31..! "విష్ యూ హ్యాప్పీ న్యూ ఇయర్..!!" అంటూ ఉత్సాహం ఉరకలు వేసే యువకులూ, యువతులూ, హర్షాతిరేకాల మధ్య పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజు..!!! రాత్రి అంతా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, గడియారం 12 గంటలు కొట్టగానే..అందరూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అనే గావుకేకలతో మారుమ్రోగే రోజు..!! కానీ డేటు మారగానే రోజుమారిందని అనుకుంటే ఆ కొత్త రోజు.. మొట్టమొదటే చేస్తున్నపని..పిచ్చెక్కినట్టు..గావుకేకలతో..రోడ్లమీదకెక్కి..వీరంగం చెయ్యడం..!! పబ్బుల్లో మందుకొడుతూ ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో చిందులేయ్యడం..! బైకుల మీద విన్యాసాలతో మిగిలినవారిని బెదర గొట్టడం...ఖర్మం చాలకపోతే కాలో చెయ్యో విరగ్గొట్టుకోవడం...రాత్రి రెండుకో..లేదా మూడు కొట్టాకో ఇంటికొచ్చాక తెల్లారి 10 - 11 గంటల వరకు పడుకోవడం. మొత్తానికి కొత్తసంవత్సరానికి మొదటి రోజు(సంవత్సరాది) గా భావించే జనవరి ఒకటిన ఎక్కువమంది రోజు మొదలెట్టే తీరు ఇది.
ఇక ఉగాది రోజు కార్యక్రమం చూద్దాం..!!
సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొత్తబట్టలు ధరించి కొత్తరోజుకి ఆహ్వానం పలుకుతాం. ఉగాది పచ్చడి తిని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం. ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం వింటాం. ఇళ్ళన్నీ బంధుమిత్రుల తో కళకళ లాడుతూ వుంటాయి. వంటింటిలో ఇల్లాళ్ళు చేసే పిండి వంటల ఘుమఘుమలతో ఇంట్లో పిల్లలు పిల్లుల్లా వంటింటి లోకి వెళ్ళడం..."ఇంకా నైవేద్యం పెట్టలేదు..ఫొండి బయటికి..!" అని అమ్మలు కసురుకుంటే బుంగమూతి పెట్టుకొని తాతయ్య దగ్గరకో నాన్న దగ్గరకో చేరడం..!! మధ్యాహ్నం సహపంక్తి భోజనాల దగ్గర హడావిడైతే చెప్పే అక్కరలేదు..!
’న్యూ
ఇయర్స్ డే’ కీ, ఉగాదికీ పండుగ జరుపుకొనే సందర్భం ఒకటే అయినా జరుపుకొనే
విధానంలో ఇంత వ్యత్యాసానికి కారణం ఆ పండుగల యొక్క సాంస్కృతిక నేపధ్యమేననేది
సుస్పష్టం.
ఇవన్నీ ఇలా వుంటే ఉగాది నాటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు ఒక ఆలయం లో పంచారు. అది తీసుకొని రెండేళ్ళ పైనే అవుతోంది. క్రింది ఫోటోల పైన నొక్కి చదవండి.
పాశ్చాత్య పోకడల సుడిగుండం లో కొట్టుకుపోతూ మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నాం. విదేశీ / పాశ్చాత్య సంస్కృతి లోని మంచి విషయాలను అనుసరించడానికి ప్రయత్నిస్తే బాగుణ్ణు. విదేశీ మోజులో పడి వారు చేసుకొనే ప్రతీ 'దినాన్నీ' మనం కూడా ఆయా 'దినాలుగా' (గుడ్డిగా) అనుస(క)రిస్తున్నాం. కానీ తరతరాలుగా మన జీవన విధానాలూ, ఆచారాలు ప్రాతిపదికగా జరుపుకొనే మన పండుగలను మర్చిపోతున్నాం. ఇవన్నీ'మల్టి నేషనల్ కంపెనీలు' తమ ఉత్పత్తులని అమ్ముకోవడానికి చేసే 'మార్కెటింగ్ స్ట్రాటెజీస్' అని కొందరు సంప్రదాయవాదులు చేసే వాదనలో నిజం లేకపోలేదు..! ఏదేమైనా వెర్రితలలు వేస్తున్న పెడ ధోరణుల నుంచీ బయటపడి మన సంస్కృతిని కాపాడుకొనే దిశగా అడుగులు వెయ్యాలి. మన పండుగలను కూడా విదేశీ 'దినాలకన్నా' ఎంత దివ్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చో న(యు)వతరానికి తెలియ జెప్పాలి. ఆ ఆనందం అనుభవం లోకి వచ్చిన నాడు మన పండుగలను మరింత శోభాయమానంగా జరిపించడంలో వారే ముందుంటారు.
బాగా చెప్పారండీ! కాని మనం ఎంత ఎత్తులో ఉన్నా పునాదిని మర్చిపోకూడదు కదా! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDelete