Showing posts with label ఈఫిల్ టవర్. Show all posts
Showing posts with label ఈఫిల్ టవర్. Show all posts

Monday, April 23, 2012

ఈఫిల్ టవర్ డ్రాయింగ్ లు,నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, విశేషాలు..!

ఈఫిల్ టవర్ డ్రాయింగ్ లు,నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ,  విశేషాలు..!

ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్దికెక్కిన ఈఫిల్ టవర్ దాని నిర్మాణ సమయం లోనూ తరువాతా కూడా ఎన్నో విశేషాలను మూట గట్టుకొంది. 
పారిస్ నగరం లో 1889 లో జరిగిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎగ్జిబిషన్ కి గుర్తుగా నిలచేటట్టు ఒక కట్టడాన్ని నిర్మించాలని తలపోశారు. పైగా ఫ్రెంచ్ విప్లవం శతాబ్ది ఉత్సవం కూడా తోడయ్యింది. అందువల్ల కట్టబోయే నిర్మాణం  చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఫ్రెంచ్ వారి  ప్రగతిని ప్రతిబింబించేలా ఉండాలనుకొన్నారు. చాలా డిజైన్లు పరిగణనలోకి వచ్చినా చివరకు ఇప్పటి ఈఫిల్ టవర్ కు ఆమోదం లభించింది. అప్పటికే ఉక్కు నిర్మాణాలను కట్టడం లో పేరుకెక్కిన Gustave Eiffel పారిస్ కు మాత్రమే కాక ఫ్రాన్స్ యావత్తూ తలమానికంగా భావించబోయే ఈ టవర్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ కట్టడం వల్ల రాబోయే లాభ నష్టాలన్నిటికీ బాధ్యత వహించి మరీ రంగం లోకి దిగాడు. ప్రభుత్వం వారు అతనికి ఇవ్వబోయేది కేవలం కావలసిన భూమి, మరియు మొత్తం ఖర్చులో పదోవంతూ మాత్రమే. ప్రతిఫలంగా 20 ఏళ్ళ పాటూ ఆ కట్టడం మీద వచ్చే ఆదాయాన్ని, Eiffel అనుభవించవచ్చు. 20  ఏళ్ళ తరువాత మాత్రం ఈ కట్టడాన్ని కూల్చేసి భూమిని ప్రభుత్వపరం చేసెయ్యాలి. ఒప్పందం ఇంత కఠినంగా ఉన్నా తన డిజైను మీద నమ్మకంతో ముందుకే వెళ్ళాడు Eiffel. మొత్తం నిర్మాణాన్ని రెండేళ్ళ పైన రెండు నెలలలో పూర్తి చేసాడు.

వికీ పీడియా సౌజన్యంతో 


Washington Monument
టవర్ కి సంబంధించిన డిజైన్లు 1884 లోనే పూర్తిపోయినా అది అందరి ఆమోదం పొందడానికి గానూ Eiffel  ఎంతగానో కష్టపడవలసి వచ్చింది. 324 మీటర్ల ఎత్తైన ఈ టవర్ అప్పటివరకూ ఎత్తైన టవర్ గా పేరుపొందిన Washington Monument (ఈ మానవనిర్మిత రాతి కట్టడం ఎత్తు 169 మీటర్లు..అంటే ఈఫిల్ టవర్ కట్టబోయే ఎత్తులో సగం మాత్రమే..!! వివిధ కారణాలవల్ల ఇది పూర్తవడానికి 35 ఏళ్ళకు పైగా సమయం పట్టింది. దానిలో 23  ఏళ్ళ పాటూ పని నిలిపివేశారు.) రికార్డును అధిగమించడమే  కాకుండా తన రికార్డును మరో 41  ఏళ్ల పాటూ  పదిలంగా ఉంచుకుంది. ఈఫిల్ టవర్ ని అదే షేపులో రాతితో కట్టి ఉంటే దానిబరువుకు అదే కుప్పకూలి ఉండేది...! అందుకే Wrought Iron ని వాడి దాని బరువుని పదివేల టన్నులకే(!!) పరిమితం చేసారు. 
ఈఫిల్ టవర్ నిర్మాణం లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలూ, డ్రాయింగ్ లు కొన్ని  ఈ స్లైడ్ షో లో చూడండి.


టవర్ మొదటి అంతస్తు లోని రెస్టారెంట్
అయితే ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాళ్ళూ లేకపోలేదు.కట్టడం  పూర్తయిన  తరువాత మాత్రం  మనసు  మార్చుకొని  అనుకూల  వర్గం  లో  చేరిన  వాళ్ళే  ఎక్కువ. అయితే మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఒక పేరు మోసిన ఇంజినీరు మాత్రం ఈఫిల్ టవర్ లో ఉన్న రెస్టారెంటుకే వచ్చి రోజూ భోంచేసే వాడట. అదేమిటని కారణం అడిగిన వాళ్లకి " ఛిఛీ.. ఈ దరిద్రాన్ని భోజనం చేస్తూ కూడా చూడాలా..కానీ పారిసు నగరం మొత్తం మీద ఈ టవరు కనబడని చోటు ఇదొక్కటే మిగిలింద"నే వాడట..!!  
ఎడమ నుంచి కుడికి ఆల్వా ఎడిసన్, ఈఫిల్ గారి కూతురు, ఈఫిల్
తనపేరు మీదుగా కట్టిన టవర్ లో పై అంతస్తులో ఒకచిన్న కాబిన్ కట్టుకోవడానికి అనుమతి సంపాదించిన ఈఫిల్, టవర్ సందర్శించడానికి వచ్చే ప్రముఖులతో ఇష్టా గోష్టి జరిపేవాడట. అక్కడ ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ తో ఈఫిల్ కలిసిన సన్నివేశాన్ని మైనపు బొమ్మలతో పునర్నిర్మించి ఇప్పటికీ సజీవం గా ఉంచారు.



పైన కనిపిస్తున్నది ఈఫిల్ టవర్ వెస్ట్ పిల్లర్. ఈ పిల్లర్స్ నాలుగూ తూర్పు,పడమర ఉత్తర దక్షిణ దిశలను చూస్తూ ఉంటాయి. So the sides of Eiffel Tower are ORIENTED at an angle of 45 degrees to true north.
 
ఈఫిల్ టవర్ ని పారిస్ లోని వీధి చిత్రకారులు రకరకాలుగా గీసి అమ్ముతూ ఉంటారు. అవి చూడండి.
 
ఈఫిల్ టవర్ రెండవ అంతస్తులోని వ్యుయింగ్ డెక్ చుట్టూ టవర్ నుంచి ప్రపంచం లోని వివిధ ప్రధాన నగరాలకు గల దూరాన్ని సూచిస్తూ బానర్ పెట్టారు. సహజం గానే  ప్రతీ సందర్శకుడికీ ఇది చాలా ఆసక్తికరంగా మారింది. నేనుకూడా మన దేశం లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ మొదలైన ఊర్లు కనబడేటట్లు ఫోటోలు తీశాను.


మా టిక్కెట్టు... చిట్టచివరి అంతస్తుకు వెళ్ళడానికి..
రెండేళ్ళ నిర్మాణ కాలంలో ఒకే ఒక్క వ్యక్తి మృత్యువాత  పడ్డాడట..! అలాగే తాను తయారుచేసిన పారాశూట్ ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించబోయి ఆస్ట్రియా దేశస్తుడైన ఒక టైలర్ మొదటి అంతస్తు (సుమారు 60మీటర్ల ఎత్తు)నుంచి కిందకు దూకాడు. పారాశూట్ తెరుచుకోకపోవడంతో నేలకి గుద్దుకొని చనిపోయాడు. శవపరీక్ష చేస్తే తెలినదేమంటే నేలని తాకక ముందే అతని ప్రాణాలు గాల్లో కలసిపోయాయట..!! ఆ వీడియో  ఇక్కడ చూడండి..

ఇంకో చిత్రమైన సంగతి.. ఈఫిల్ టవర్ పాత ఇనప తుక్కు సామాన్లు కొనే వాళ్లకి అమ్ముడుపోయింది. ఆశ్చర్యకరంగా నెల  వ్యవధిలో రెండుసార్లు..!! విక్టర్ లస్టిగ్(Victor Lustig ) అనే ఘరానా మోసగాడు 1925 లో మొదటిసారి విజయవంతంగా అమ్మేసి డబ్బులు పట్టుకొని ఉడాయించాడు. నెలరోజుల్లోపే మళ్ళీ పారిస్ కి వచ్చి మరోసారి అమ్మబోయే టప్పుడు అనూహ్యం గా పట్టుబడ్డాడు. 
 
పారిస్ వాసులు 'ఐరన్ లేడీ' అని ముద్దుగా పిలుచుకొనే ఈఫిల్ టవర్ కట్టినప్పటినుండీ ఎందరో ఔత్సాహికులకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయి ఇప్పటికీ చాలా మంది సందర్శకులకి చూడగానే సంభ్రమం కలిగిస్తూ.. మరో రెండేళ్లలో 125 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. 
(కొంత సమాచారం వికి పీడియా సౌజన్యం తో) 
Updated on Mr. SNKR's Comment 





పూర్తిగా చదవండి...

Saturday, February 4, 2012

నా ప్యారిస్ యాత్ర విశేషాలు..


ఈమధ్య 9.11.2011 న హైదరాబాదులో బయల్దేరి దుబాయ్ మీదుగా ప్యారిస్ వెళ్ళాం. నేను, మా పార్టనర్ విజయ్, వాళ్ళ అన్నయ్య..మొత్తం ముగ్గురం. పారిస్ లో వారం, దుబాయ్ లో రెండురోజులూ వున్నాం,
అక్కడి ఫోటోలు కొన్నిఈ క్రింద చూడండి. వీలుని బట్టీ మరిన్ని విశేషాలు జోడించటానికి ప్రయత్నిస్తాను.   
'గ్రాండ్ ఆర్చ్'  అనే బిల్డింగ్ ఇది..
ఈఫిల్ టవర్ - ప్రక్కన మేము

మేము వెళ్ళిన Exhibition

డేవిడ్ అనే French Architect తో కలసి..! ఆయనతో మా పరిచయం ఇండియా లోనే..!! 
ఎంత ఎత్తుకి ఎదిగినా నీ మూలాన్ని మర్చిపోకు..!!


Seine River లో మా విహారం.. బోటు లో మేం ముగ్గురం..( ఎడమ నుంచి కుడికి విజయ్, వాళ్ళ అన్నయ్య EKL రావు, నేను)
Seine River లో మా విహారం..
సాయంసంధ్యలో  'ఐరన్ లేడీ' గా పిలువబడే ఈఫిల్ టవర్ 
ఈఫిల్ టవర్  నుంచి వివిధ నగరాల దూరాలు
ఈఫిల్ టవర్  నుంచి వివిధ నగరాల దూరాలు





La Geo de అనబడే స్టెయిన్ లెస్ స్టీల్ డోమ్ Parc de la Villette అనే సైన్స్ సిటీ లో వుంది. దానిలోపల ఒక IMax థియేటర్ వుంది.
 


Musée du Louvre - Louvre Museum ఇక్కడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలీసా పెయింటింగ్ ని భద్రపరచారు.

'మోనాలీసా' తో నేను..

Louvre Museum లోపల..!
గోడల మీద ఎన్ని బొమ్మలు వున్నాయో సీలింగ్ మీద కూడా అన్ని బొమ్మలూ, అంత గొప్పగానూ ఉన్నాయి.

జార్జ్ వి అవెన్యూ..

అమరవీరుల స్మృత్యర్థం నిర్మించిన Arc de Triomphe

#39 , జార్జ్ వి అవెన్యూ, పారిస్. దీని ప్రత్యేకత తెల్సుకోవాలంటే ఈ పిట్టకథ* చదవండి..!!
(*నా తరువాతి పోస్ట్)   

దుబాయ్ లో ఉన్న ప్రపంచం లోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్..'బుర్జ్ అల్ అరబ్'. లోపల అంతా బంగారం తో  తాపడం చేసిన ద్వారాలూ, చూడ చక్కని ఫౌంటెన్లూ, లైటింగ్ ఎఫ్ఫెక్ట్లూ.. అద్భుతమైన అనుభవం..!!

ప్రస్తుతం ప్రపంచం లోకెల్లా ఎత్తైన టవర్..! పేరు బుర్జ్ ఖలీఫా..!! పైకెక్కడానికి  లిఫ్ట్ ఎక్కితే మనల్ని 124  వ అంతస్తులో దింపుతారు. అది ఎంత వేగవంతం అంటే  దానికి 124  వ అంతస్తు చేరటానికి పట్టేసమయం ఒక నిమిషం కన్నా తక్కువ.

(ఫోటోలు  అన్నీ మేము తీసినవే..!!) 

పూర్తిగా చదవండి...

Wednesday, January 26, 2011

విశాఖలో 'ఈఫిల్ టవర్'

విశాఖపట్నం లో ఈఫిల్ టవర్ ఏమిటా అని డౌట్ పడుతున్నారు కదా..!! పైగా ఒకటి కాదు రెండు. ఒక వెల్డింగ్ షాప్ అతను (ఆయనే యజమాని) అపురూప కట్టడాన్ని తన వర్క్ షాప్ లో తయారు చేసారు. మొదట నాలుగున్నర అడుగుల ఎత్తులో బుజ్జి ఈఫిల్ టవర్ ని తయారుచెయ్యడానికి 28 గంటల సమయం పట్టిందిట. రెండోది ఎనిమిదడుగులకు పైగా ఎత్తు వచ్చేట్టు ఈసారి 23 గంటల్లోనే మళ్ళీ తయారు చేసారు. కేవలం ఈఫిల్ టవర్ కి సంబంధించిన ఫోటోలను చూసి తయారుచేసారట. ఆ shape, proportions, దానికి సంబంధించిన technical drawings ఏమీ లేకుండా అంత ఖచ్చితంగా చేయడం గొప్పే కదా..!!
విశాఖపట్నం లో పెదవాల్తేరు లోని 'విశాఖ హాస్పిటల్' డౌన్ దిగి వెళ్తున్నవారందరికీ రోడ్డు పక్కనే వున్న 20 అడుగుల డైనోసార్లూ, 30 అడుగుల డ్రాగన్లూ కనిపించి ఒకింత ఆశ్చర్యానికి గురిచేయ్యక మానవు. అన్నీ ఐరన్ ఫ్రేము తో చేసినవే..! అయితే ఇవేవీ ఏదో ఆర్డర్ మీద చేసినవి కాకపోవడం విశేషం. ఆ షాప్ యజమానీ, స్వతహాగా వర్కర్ కూడా ఐన శ్రీ రమేష్.. ఈ వింతల సృష్టి కర్త. కేవలం తన అభిరుచినీ, సృజననీ మేళవించి చేసే కళా రూపాలే ఇవన్నీ..! ఇష్టపడి చేసే పని కష్టమనిపించదు కదా..!! అదే తన విజయ రహస్యం కూడా. ఇలాటివి చెయ్యడానికి ఖర్చు అవుతుంది కానీ, పని పూర్తయ్యాక వచ్చే తృప్తి (job satisfaction) ముందు ఆ ఖర్చు దిగదుడుపే అంటాడు. దారిన పోయే ఎందరినో..ఒక్క క్షణం ఆ షాపు వైపు చూసేలా చేసే ఈ కళా రూపాల సృష్టి కర్త రమేష్ ను తప్పక అభినందించాలి.
దీనిని పిల్లలు ఎక్కగలిగే సైజులో చెయ్యాలని అతని లక్ష్యం, సంకల్పం! అతని మాటల్లో చెప్పాలంటే కిందనున్న ఆర్చ్ హైట్ పదడుగులు వచ్చేలా చేస్తారట.అంటే మొత్తం పొడవు సుమారు తొంభై అడుగుల పైమాటే..!! త్వరలోనే శ్రీ రమేష్ తప్పక విజయం సాధిస్తారని ఆశిద్దాం.
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)