ఈమధ్య 9.11.2011 న హైదరాబాదులో బయల్దేరి దుబాయ్ మీదుగా ప్యారిస్ వెళ్ళాం. నేను, మా పార్టనర్ విజయ్, వాళ్ళ అన్నయ్య..మొత్తం ముగ్గురం. పారిస్ లో వారం, దుబాయ్ లో రెండురోజులూ వున్నాం,
అక్కడి ఫోటోలు కొన్నిఈ క్రింద చూడండి. వీలుని బట్టీ మరిన్ని విశేషాలు జోడించటానికి ప్రయత్నిస్తాను.
 |
'గ్రాండ్ ఆర్చ్' అనే బిల్డింగ్ ఇది.. |
 |
ఈఫిల్ టవర్ - ప్రక్కన మేము |
 |
మేము వెళ్ళిన Exhibition |
 |
డేవిడ్ అనే French Architect తో కలసి..! ఆయనతో మా పరిచయం ఇండియా లోనే..!! |
 |
ఎంత ఎత్తుకి ఎదిగినా నీ మూలాన్ని మర్చిపోకు..!! |
 |
Seine River లో మా విహారం.. బోటు లో మేం ముగ్గురం..( ఎడమ నుంచి కుడికి విజయ్, వాళ్ళ అన్నయ్య EKL రావు, నేను) |
 |
Seine River లో మా విహారం.. |
 |
సాయంసంధ్యలో 'ఐరన్ లేడీ' గా పిలువబడే ఈఫిల్ టవర్ |
 |
ఈఫిల్ టవర్ నుంచి వివిధ నగరాల దూరాలు |
 |
ఈఫిల్ టవర్ నుంచి వివిధ నగరాల దూరాలు |
 |
La Geo de అనబడే స్టెయిన్ లెస్ స్టీల్ డోమ్ Parc de la Villette అనే సైన్స్ సిటీ లో వుంది. దానిలోపల ఒక IMax థియేటర్ వుంది. |
 |
Musée du Louvre - Louvre Museum ఇక్కడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలీసా పెయింటింగ్ ని భద్రపరచారు.
|
 |
'మోనాలీసా' తో నేను..
|
 |
Louvre Museum లోపల..!
గోడల మీద ఎన్ని బొమ్మలు వున్నాయో సీలింగ్ మీద కూడా అన్ని బొమ్మలూ, అంత గొప్పగానూ ఉన్నాయి.
|
 |
జార్జ్ వి అవెన్యూ.. |
 |
అమరవీరుల స్మృత్యర్థం నిర్మించిన Arc de Triomphe |
 |
#39 , జార్జ్ వి అవెన్యూ, పారిస్. దీని ప్రత్యేకత తెల్సుకోవాలంటే ఈ పిట్టకథ* చదవండి..!!
(*నా తరువాతి పోస్ట్) |
 |
దుబాయ్ లో ఉన్న ప్రపంచం లోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్..'బుర్జ్ అల్ అరబ్'. లోపల అంతా బంగారం తో తాపడం చేసిన ద్వారాలూ, చూడ చక్కని ఫౌంటెన్లూ, లైటింగ్ ఎఫ్ఫెక్ట్లూ.. అద్భుతమైన అనుభవం..!! |
 |
ప్రస్తుతం ప్రపంచం లోకెల్లా ఎత్తైన టవర్..! పేరు బుర్జ్ ఖలీఫా..!! పైకెక్కడానికి లిఫ్ట్ ఎక్కితే మనల్ని 124 వ అంతస్తులో దింపుతారు. అది ఎంత వేగవంతం అంటే దానికి 124 వ అంతస్తు చేరటానికి పట్టేసమయం ఒక నిమిషం కన్నా తక్కువ.
(ఫోటోలు అన్నీ మేము తీసినవే..!!) |
రాధేశ్యాం గారూ,
ReplyDeleteఇప్పుడే చూస్తున్నాను. మీ ప్యారిస్, దుబాయ్ యాత్ర విశేషాల ఫోటో కథనం చాలా బాగుంది. ఒక్క అక్షరం రాయకుండానే రెండు చరిత్రలను కళ్లముందు చూపించారు. ధన్యవాదాలు.
బాగున్నాయండీ! ఈ సియన్ నదిలో రాత్రి పూట వెళ్లాలండీ! భలే ఉంటుంది! మోనాలిసా బొమ్మ కోసం వెళ్లాను కానీ ఆ మ్యూసియంలో అంతకన్నా గొప్ప paintings ఎన్నో ఉన్నాయి! మీరు Guimet Museum, Notre Dame, Versailles, Sea life Aquarium, Disneyland, La valle village మిస్ అయ్యారండీ! అవి కూడా చూడతగ్గ ప్రదేశాలు!
ReplyDeletemee photolu baagunnaayi. Veelu venta chakkati vyasam kooda raayandi.
DeleteJonnalagadda Radha Krishna
రసజ్ఞ గారూ, మేము అక్కడ ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళాము. అందువల్ల ఉన్న ఆరు రోజులలోనూ మూడు రోజులయిపోయింది. మిగిలిన టైము లో వీలయినంత చూసాము.
Deleteమీరన్నది కరక్టే. ఆ మ్యూసియం లో మోనాలిసా కన్నా గొప్ప పైంటింగ్స్, శిల్పాలూ చాలా వున్నాయి.
మీ పారిస్ యాత్రావిశేషాలను సచిత్రంగా కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు
ReplyDeleteప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ ఫోటోలు చూస్తుంటే పారిస్సే ఓ వింతలా ఉంది.. అంత సుందర ప్రదేశం చూడ్డం ఆ అనుభూతి మాతో పంచుకోవడం అభినందనీయం.. మిత్రులు సూచించినట్టు యాత్రా విశేషాలు అక్షరబద్ధం చేయండి.. ఆనందిస్తాము...
ReplyDeleteప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ ఫోటోలు చూస్తుంటే పారిస్సే ఓ వింతలా ఉంది.. అంత సుందర ప్రదేశం చూడ్డం ఆ అనుభూతి మాతో పంచుకోవడం అభినందనీయం.. మిత్రులు సూచించినట్టు యాత్రా విశేషాలు అక్షరబద్ధం చేయండి.. ఆనందిస్తాము...
ReplyDeleteహనుమంతరావుగారూ,
ReplyDeleteఆల్రెడీ చేసేశాను సార్..! దీని తరువాతి పొస్టు చూడండి.
- రాధేశ్యామ్