Wednesday, February 15, 2012

కార్టూనిస్టు కేశవ్ గారు గీసిన కారికేచర్స్ (గుర్తు పట్టండి చూద్దాం)

సాధారణంగా మనం రోజూ పేపర్లలో రాజకీయ నాయకుల కారికేచర్లు చూస్తూ ఉంటాం. వారి నడకనో, ఆహార్యాన్నో, శరీర నిర్మాణంలో ప్రస్ఫుటం గా కనిపించే అంశాన్నో తీసుకొని కార్టూన్లూ, కారికేచర్లు గీస్తూ ఉంటారు. ఇది నిజంగా అద్భుతమైన కళ. అతితక్కువ గీతలతో పైన చెప్పిన అంశాలు ప్రతిబింబించేలా బొమ్మ గీయడం, అది చూడగానే ఆ వ్యక్తి గుర్తుకొచ్చేలా చేయడం పైకి కనిపించేటంత సరళం కాదు. ఎంతో సాధన చేస్తేనే గానీ ఈ రంగం లో గుర్తింపు రావటం చాలా కష్టం. 

శ్రీ కేశవ్ గారు ప్రముఖ జాతీయ దిన పత్రిక ది హిందూ లో కార్టూనిస్టుగా అందరికీ చిరపరిచితులే. ఈరోజు వారి బ్లాగు కంటపడింది. బ్లాగులో వారు రోజూ గీస్తున్న కార్టూన్లే కాక ప్రముఖ సంగీత విద్వాంసుల కారికేచర్స్ గీసి వాటిని ఇంకొక బ్లాగులో విడిగా పెట్టారు. ఈ రకంగా సంగీత విద్వాంసులను కారికేచర్స్ రూపం లో గీయడం ఒక సాహసమనే చెప్పాలి. బహుశా ఇలా గీసినది, (పైగా ఇంతమందిని) శ్రీ కేశవ్ గారు ఒక్కరే అయివుంటారు. వీటిలో ఎక్కువ మట్టుకు ఆయా విద్వాంసులు కచ్చేరీ చేస్తూ వుండగా గీసినవే నట.ఏ ఆర్ రహమాన్ 
పైన ఉన్న పన్నెండు మంది వ్యంగ్య చిత్రాలు చాలా ప్రముఖులైన సంగీత విద్వాంసులవి. శాస్త్రీయ సంగీతం తో అంతో ఇంతో పరిచయం ఉన్నవారికి ఇవి చూడగానే ఇట్టే తెలిసిపోతాయి.  మీరు గుర్తుపట్టిన వారి పేర్లను కామెంట్లలో వ్రాయండి. తెలియక పొతే నేనెలాగూ చెబుతాను. ఇప్పుడే కాదు. రెండు రోజులాగి...!! ఆగలేని వారి కోసం క్రింద శ్రీ కేశవ్ గారి బ్లాగు లింక్ ఉంచాను. దానిలో సుమారు డెబ్భై మంది విద్వాంసుల మీద శ్రీ కేశవ్ గారు పెన్ను చేసుకున్నారు. విద్వాంసుల కనుముక్కు తీరే కాక వారి కట్టు, బొట్టు, పాడుతున్నప్పుడు వారి హావ భావాలు మొదలైనవి చాలా బాగా చిత్రించారు. చూసి ఆనందించండి.

ఇంకో విషయం..!! మీరు ఈ పన్నెండు మందిలో 100 %  కరెక్టు గా చెపితే మీరు కర్ణాటక సంగీతంతో సహవాసం చేస్తున్నారన్నమాట. ఆరుగురి కన్నా ఎక్కువ అయితే పర్వాలేదన్నమాట. కొంచం శ్రద్ధగా చూస్తే గుర్తుకు రావచ్చు.
ఇద్దరి కన్నా తక్కువ చెప్పారనుకోండి.., మీకింకేమీ  చెప్పవలసింది లేదు... వారి బ్లాగ్ చూడమనడం తప్ప..!!

క్రింద శ్రీ కేశవ్ గారి బ్లాగులు మరిన్ని..!!
వారికి మనందరి తరఫునా శుభాభినందనలు.

9 comments:

 1. 1. బాల మురళీ కృష్ణ
  ౨.
  ౩. టీ ఎన్ శేష గోపాలన్
  ౪.  ౮ హరి ప్రసాద్ చౌరాసియా

  ౧౦
  ౧౧ మాండొలిన్ శ్రీనివాస్
  ౧౨ ఎల్ సుబ్రహ్మణ్యం
  ౧౩ మీరే చెప్పేసారు - ఎ ఆర్ రెహ్మాన్

  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. జిలేబి గారూ,
   మిగిలిన వారి పేర్లు పొస్ట్ చేశాను చూడండి.

   Delete
 2. 6 anuradha sairaam ?
  5 raadha and ??

  ReplyDelete
 3. జిలేబీ గారూ, అభినందనలు. ఆరు పేర్లు చెప్పేసారు. ఇంకొంత మందికి కూడా అవకాశం ఇద్దాం. మీరు చెప్పిన పేర్లు కుంచెం లేటుగా పబ్లిష్ చేస్తాను.

  ReplyDelete
 4. @ Anonymous: no 6 is not Anuradha Sriram. but 5 and 6 are popular with a common city name as their prefix. it is a six letter word. thanks for participating

  ReplyDelete
 5. పైన చూపిన విద్వాంసుల పేర్లు:
  ౧. బాల మురళీ కృష్ణ
  ౨. నేదునూరి కృష్ణమూర్తి
  ౩. టీ ఎన్ శేష గోపాలన్
  ౪. పర్వీన్ సుల్తానా
  ౫. బాంబే సిస్టర్స్ (సి. లలిత, సి. సరోజ)
  ౬. బాంబే జయశ్రీ
  ౭. ఎన్. రమణి
  ౮. హరి ప్రసాద్ చౌరాసియా
  ౯. శశాంక్
  ౧౦. ఎల్లా వెంకటేశ్వర రావు
  ౧౧ మాండొలిన్ శ్రీనివాస్
  ౧౨ ఎల్. సుబ్రహ్మణ్యం

  ReplyDelete
 6. Excellent post Radheshyam!Thank u for sharing with us.

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)