Tuesday, February 21, 2012

శ్రీ ఆర్ శంకర్ వ్రాసిన కవిత : స్నేహం


మా అన్నయ్య శ్రీ ఆర్ శంకర్ వ్రాసిన కవిత : స్నేహం
(సవరణలు, సూచనలకు  ఆహ్వానం)

కుల మతాలకతీతమై 
మనసులలో మమేకమై
మాధుర్య సుగంధాలను
విరాజిల్లే పరిమళ పుష్పం స్నేహం

బంధాలను బంధుత్వాలను
చిన్నా పెద్ద తారతమ్యాలను
అధిగమించిన మానవుని
మానస పుత్రిక స్నేహం

నా అన్నవారు లేని సమయాన 
నేనున్నానన్న భరోసా ఇచ్చి
దాపరికాలకు తావులేదని చాటిన
అభయ హస్తం స్నేహం

హద్దులు ఎల్లలు ఎరుగని స్నేహం
విశ్వశాంతికి జనియించిన ఏకైక మూలకం
ఆదీ అంతం లేని శ్వేత వర్ణ కుసుమం
హృదయాంతర క్షేత్రం లో విరబూసిన ఆమని స్నేహం

కాలం కొలవలేని ఎన్నో వసంతాలను చూసి
భవిష్యత్తులో మరెన్నో వసంతాలను వీక్షించే
చక్కటి అనుభూతి స్నేహం..

అపార్ధాలూ అపోహలూ
తాత్కాలికమే అని హితవు పలికి
ఆచంద్ర తారార్కం నిలిచేది స్నేహం..
పై కవితకి కి నేను చేసిన సవరణలు..
కుల మతాలకే అతీతమై
మనసులతో మమేకమై
సుగంధ మధురిమల్ని పంచే
పరిమళ పుష్పం స్నేహం..

బంధాలూ బంధుత్వాలన్నీ
చిన్నా పెద్దా తేడాలన్నీ
అధిగమించిన మానవుడా
నీ మానస పుత్రిక స్నేహం

నాఅన్నవారే టోకరా ఇస్తే
నేనున్నానని భరోసా ఇచ్చి
దాపరికాలే వద్దని చాటే
అభయ హస్తం స్నేహం..

హద్దులు ఎల్లలు ఎరుగని స్నేహం
విశ్వశాంతి కేకైక మూలకం
ఇక్కడినుంచీ నాకు సవరణలు తట్టలేదు. అందుకే యధా తథంగా ఉంచేశాను.
ఆదీ అంతం లేని శ్వేత వర్ణ కుసుమం
హృదయాంతర క్షేత్రం లో విరబూసిన ఆమని స్నేహం

కాలం కొలవలేని ఎన్నో వసంతాలను చూసి
భవిష్యత్తులో మరెన్నో వసంతాలను వీక్షించే
చక్కటి అనుభూతి స్నేహం..

అపార్ధాలూ అపోహలూ
తాత్కాలికమే అని హితవు పలికి
ఆచంద్ర తారార్కం నిలిచేది స్నేహం..
మిత్రులెవరైనా ఇంకేమైనా సలహాలూ సూచనలూ ఇవ్వదలిస్తే వారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.  

4 comments:

 1. స్నేహం సృష్టి ధర్మం .ఈ ధర్మాన్ని మనుషుల కంటే జంతువులు పక్షులు బాగా ప్రదర్శిస్తున్నాయి అనిపిస్తుంది ,ప్రస్తుత స్నేహాలను గమనిస్తే !స్వచ్చమయిన స్నేహాలు కరవైపోతున్నాయి.చక్కగా వ్రాసారు .
  రవిశేఖర్ ఒద్ద్ద్దుల
  www.ravisekharo.blogspot.com

  ReplyDelete
  Replies
  1. సర్,
   చాలా బాగా చెప్పారండీ..! ధన్యవాదాలు. మీ అభినందనలు మా అన్నకి చేరవేస్తాను.

   Delete
 2. స్నేహం... చాలా బాగుంది కవిత... మీ సవరణలు కూడా బాగున్నాయి.. అయితే "నా అన్నవారే టోకరా ఇస్తే" కన్నా "నా అన్నవారు లేని సమయాన" అనడంలో ఒక ఉదాత్తభావం వ్యక్తమవుతున్నదేమో ?... స్నేహం కోరుకునే మనస్సుకి అంత బరువుపదాలు.. మనస్సులో ఏదో కక్షపెట్టుకుని వ్రాసినట్టుగా వుంటుదేమో అని నాకనిపిస్తున్నది.. మంచి స్నేహకవిత అందించిన అన్నగార్కి... మా దాకా తీసుకువచ్చిన శ్రీ రాధేశ్యాం గార్కి స్నేహాభినందనలు.

  ReplyDelete
  Replies
  1. స్వతహాగా హాస్య ప్రియులైన మీకు నా పదప్రయోగంలో మీరన్న అర్థం ధ్వనిస్తుండడం అర్ధం చేసుకోదగ్గదే. నేను అన్నయ్య వ్రాసిన కవితని రిథమ్ అనే చట్రంలో బంధించడానికి ప్రయత్నించా..! ఆ ప్రయత్నంలో..మరి..అంత ఆలోచించలేదు.
   స్పందనకి ధన్యవాదాలు.

   Delete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

(బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)