Monday, February 20, 2012

కొన్ని ప్రసిద్ధ శివాలయాల ఈ-దర్శనం


బ్లాగు మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
***************************************************
(మీరేప్పుడైనా రామేశ్వరం లోని రామనాధేశ్వర స్వామి ఆలయం చూసారా..?? తిరువణ్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి కోవెల..?? బోల్డు తంటాలు పడి వెళ్ళినా మన గైడు పెట్టే హడావిడి వల్లనో, దృష్టి పిల్లలమీద వుండడం వల్లనో, ఏదో చూసామనే తప్ప ఆ శిల్పకళని తనివితీరా చూడలేం. కొన్నిచోట్ల క్యు లైన్ల కోసమో, శిల్పాలు ముట్టుకొంటే పాడైపోతాయనే భావనతో బారికేడ్లు కట్టడం వల్ల దగ్గరగా వెళ్లి చూడలేం. ఇవన్నీ మన కళ్ళ ముందు మన కంప్యూటర్ లో దర్శన మిస్తే..!! మనం ఏ డిటైల్ కావలిస్తే దానిని జూమ్ చేసి చూసుకో గలిగితే..!! అద్భుతంగా వుంటుంది కదూ..!!
View360, చెన్నై వారు మనకి ఆ అవకాశాన్ని కలిగిస్తున్నారు. తంజావూరు లోని బృహదీశ్వరాలయం లో నిలబడి మనం తలతిప్పి కుడి, ఎడమలకూ, ముందూ వెనుకలకూ, అలాగే తల ఎత్తి పైకీ, మన కాళ్ళదగ్గర నేలనూ కూడా చూడగలం. తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలూ, చర్చిలూ, కోటలూ, రాజభవంతులూ, అభయారణ్యాలూ జలపాతాలూ మొదలైనవి 360 డిగ్రీలు చూడగలిగేలా రూపొందించారు. క్రింది జాబితాలో జాబితాలో ఏది చూద్డామనుకున్తున్నారో ఆ లింక్ ని క్లిక్ చెయ్యండి. వెంటనే ఆ దేవాలయం యొక్క
360 డిగ్రీ దృశ్యం కనబడుతుంది. ఇక ఫుల్ స్క్రీన్ చేసుకొని మౌస్ క్లిక్ చేసి అటూ ఇటూ తిప్పి మీకు కావలసిన దాన్ని జూమ్ చేసుకొని చూసుకోవడమే. ఎర్రటి బాణం గుర్తు మిమ్మల్ని ముందరకు తీసుకుపోతుంది. ఎడమ ప్రక్క మాప్ కూడా వుంటుంది. నావిగేట్ చేస్తూ పోవడమే..!!)
మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ప్రసిద్ధ శివాలయాల ఈ-దర్శనం చేసుకుందాం రండి.
 
  బృహదీశ్వరాలయం-గంగైకొండ చోళపురం  (ఈ లింక్ నొక్కండి) 
 

బృహదీశ్వరాలయం-తంజావూరు  (ఈ లింక్ నొక్కండి) 


తిరువణ్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి కోవెల  (ఈ లింక్ నొక్కండి) 

 కుంభకోణం నుంచీ మూడు కి.మీ. దూరం లోని ఐరావతేశ్వరాలయం, ధారశురం  (ఈ లింక్ నొక్కండి) 



  విజయనగరంలో కొలువుతీరి వున్నశ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయ విశేషాలను, ఫొటోలనూ ఈ లింక్ నొక్కి చూడండి.

శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం  (ఈ లింక్ నొక్కండి) 

తమిళ నాడులో ఉన్నమరికొన్ని దేవాలయాలూ, దర్శనీయ స్థలాలూ ఈ క్రింది లింక్ నొక్కి చూడండి.
http://view360.in/portfolio.html

ఇదివరకు నా బ్లాగ్ లో ఇదే విషయం పైన వ్రాసిన పోస్టు :
తమిళనాడు దర్శన్..(ఖర్చు, శ్రమ లేకుండా) view360 .com వారి సౌజన్యం తో
 
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర

7 comments:

  1. ఫోటోలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.

    ReplyDelete
  2. @Balu garu,
    Please have a look at the virtual tour links of all the above temples. I am sure that one will enjoy and feels as if he is there right at that place. Thanks for the comment.

    ReplyDelete
  3. 3 డి లో చూసి చాలా ధ్రిల్లింగా ఫీల్ అయ్యాము.. సూపర్ .. ధన్యవాదాలు.. మా వాళ్ళందర్కీ మీ పోస్ట్ లింక్ ఇద్దామని అనుకుంటున్నాను..

    ReplyDelete
    Replies
    1. వోలేటి గారూ, చాలా సంతోషం. తప్పకుండా ఇవ్వండీ..!!

      Delete
  4. Om Namah Shivaya
    "Siddhi Pradayak Shivaling, Ekadash Rudra Ratna, Paarvati Kriyamaann, Aananad Saafalya and Siddheshwar Rudraksh rosary"

    Sunil Susarla

    ReplyDelete
  5. సరయిన సమయాన మంచి టపా పెట్టారు! చక్కని చిత్రాలు!

    ReplyDelete
  6. అద్భుతం ,పరమానందం ,పరమ వైభవం ,పరమోత్క్రుస్తం ,పరమ పవిత్రం ధన్య వాదాలు శివ రాత్రి మహాత్మ్యం లా వున్నాయి కన్నుల పండువే అయాయి ,దుర్గా ప్రసాద్

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)