Showing posts with label ఘంటసాల. Show all posts
Showing posts with label ఘంటసాల. Show all posts
Tuesday, December 4, 2012
అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి..!!
Monday, March 12, 2012
స్మృతిపథంలో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక
స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక పేరుతో విడుదలైన ఈ పుస్తకం ఘంటసాల వారి స్మృత్యర్ధం విజయనగరంలోని వారి అభిమానుల చేత ముద్రించబడింది. సాంబశివరావు గారి సంపాదకత్వంలోఅచ్చయిన ఈ పుస్తకం ఇదివరకు ఘంటసాల వారి సంస్మరణలో వివిధ పత్రికల లో వచ్చిన వ్యాసాలూ, ఘంటసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలూ మొదలైనవి గుదిగ్రుచ్చబడిన పదహారు పేజీల చిన్ని పుస్తకం. అమూల్యమైన ఈ పుస్తకం వెల రూ. 10/-.
ఈ పుస్తకం నాకు మా బంధువుల ద్వారా వచ్చింది. చాలా పత్రికలనుంచీ సేకరించిన ఈ వ్యాసాలు జే. వి. రాఘవులు, ఆచార్య ఆత్రేయ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మొదలైన వారు వ్రాసారు. విజయ చిత్ర, ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ఘంటసాల వారి జీవితవిశేషాలతో వచ్చిన వ్యాసాలూ కూడా వున్నాయి. అన్నిటికంటే ఘంటసాల వారే తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి గురించి వ్రాసిన వ్యాసం కూడా పొందుపరచ బడింది..! ఇన్నిటిని ఒకే చోట కూర్చిన సంపాదకుల శ్రమకు జోహార్లు. అయితే ఈ పుస్తకం మీద అది విడుదలైన తేదీ, ముద్రించబడిన సందర్భం కూడా ఉండి వుంటే ఇంకా బాగుండేది.

ఇవి 'స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక' లోని కొన్ని పేజీలు మాత్రమే..!!
మొత్తం పుస్తకం (16 పేజీలు )పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కండి.
*************
( శ్రీ రాజేంద్ర కుమార్ గారు ఈ ఫైల్ డౌన్లోడ్ అవటం లేదని అన్నారు. పై లింక్ నొక్కితే కనబడే పేజి లో ఈ క్రింది మెసేజ్ కనిపించిన చోట here మీద నొక్కండి.
Sorry, we are unable to retrieve the document for viewing because it is too large.
You can also try to download the original document by clicking here.
అప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. )
*************
అలాగే ఘంటసాల గారి అరుదైన చిత్రాలు డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ నొక్కండి.
Wednesday, October 27, 2010
ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..


ఈ ఫోటోలు ఎవరివో చెప్పుకో మంటే చాలా కష్టపడాలి..!! బహుశా ఎవరూ చెప్పలేక పోవచ్చు...!!!
అయితే
పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం..
అని వినగానే గుర్తుపట్టని తెలుగువాడు ఉండడు. అని వినిపించగానే ఠక్కున చెప్పేస్తాం...!!
తెలుగు ప్రజానీకానికి ఈ గొంతు సుపరిచితమే..ఈ గొంతు వినని చెవులు.. ఆహా!! అనుకోని మనసు ఉండవంటే అతిశయోక్తికాదు..!! గానగంధర్వుడు మన ఘంటసాల గారి(పాట)ని విన్నవారు చాలామందే వుంటారు..!! కానీ వారిని చూసిన వాళ్ళు బహు తక్కువ. అక్కడా ఇక్కడా ఫోటోలు చూసినా ఆయన తన ఆత్మీయుల తోనూ..అభిమానులమధ్యనూ వున్న ఫోటోలు అరుదైనవనే చెప్పాలి.. ఆ లోటు ను భర్తీ చెయ్యడానికే ఈ ఫోటోలు...!! చూసి ఆనందించండి...!
అలాగే ఈ ఫోటోలలో ఘంటసాల గారితో పాటు తెలుగువారు అభిమానించే ఇంకొందరు ఆ తరం ప్రముఖులు, నటులు, నటీ మణులు, గాయకులూ వున్నారు. పరిశీలన గా చూస్తే కనిపిస్తారు...!! మరి వారిని కనుక్కోండి చూద్దాం.!!
ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..
(ఈ ఫోటో లు నేను మా మామాయ్య సుసర్ల శ్రీనివాస్ గారి దగ్గర తీసుకున్నాను. ఆయనకి ఎవరిచ్చారో -ఆయన స్నేహితుడెవరో నట - నాకు తెలీదు..! కానీ ఆమహానుభావునికి మన బ్లాగర్లందరి తరఫున శతకోటి వందనాలు)
Subscribe to:
Posts (Atom)













