Wednesday, October 27, 2010

ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..




ఈ ఫోటోలు ఎవరివో చెప్పుకో మంటే చాలా కష్టపడాలి..!! బహుశా ఎవరూ చెప్పలేక పోవచ్చు...!!!
అయితే
పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం..
అని వినగానే గుర్తుపట్టని తెలుగువాడు ఉండడు.  అని వినిపించగానే ఠక్కున చెప్పేస్తాం...!!

తెలుగు ప్రజానీకానికి ఈ గొంతు సుపరిచితమే..ఈ గొంతు వినని చెవులు.. ఆహా!! అనుకోని మనసు ఉండవంటే అతిశయోక్తికాదు..!!  గానగంధర్వుడు మన ఘంటసాల గారి(పాట)ని విన్నవారు చాలామందే వుంటారు..!! కానీ వారిని చూసిన వాళ్ళు బహు తక్కువ. అక్కడా ఇక్కడా ఫోటోలు చూసినా ఆయన తన ఆత్మీయుల తోనూ..అభిమానులమధ్యనూ వున్న ఫోటోలు అరుదైనవనే చెప్పాలి.. ఆ లోటు ను భర్తీ చెయ్యడానికే ఈ ఫోటోలు...!! చూసి ఆనందించండి...!
అలాగే ఈ ఫోటోలలో ఘంటసాల గారితో పాటు తెలుగువారు అభిమానించే ఇంకొందరు ఆ తరం ప్రముఖులు, నటులు, నటీ మణులు, గాయకులూ వున్నారు. పరిశీలన గా చూస్తే కనిపిస్తారు...!! మరి వారిని కనుక్కోండి చూద్దాం.!!
ఘంటసాల గారి అరుదైన చిత్రాలు..
(ఈ ఫోటో లు నేను మా మామాయ్య సుసర్ల శ్రీనివాస్ గారి దగ్గర తీసుకున్నాను. ఆయనకి ఎవరిచ్చారో -ఆయన స్నేహితుడెవరో నట - నాకు తెలీదు..! కానీ ఆమహానుభావునికి మన బ్లాగర్లందరి తరఫున శతకోటి వందనాలు)

7 comments:

  1. ముందుగా మీకు బ్లాగర్లందరి తరఫునా ధన్యవాదాలు. చాలా ఫోటోలున్నాయండీ! అన్నీ చూశాను. నేను ప్రముఖుల్ని మాత్రమే అంటే రామారావు, నాగేశ్వర్రావు, సావిత్రి, సుశీల, జానకి, బాలుగారు, పి బి శ్రీనివాస్, జగ్గయ్య, కాంతారావు, నాగయ్య, గుమ్మడి ఇలాంటి వారినే గుర్తు పట్టగలిగానండి.

    ReplyDelete
  2. @మందాకిని గారూ, నెనర్లు..
    ప్రముఖ నిర్మాతలు.. డి. రామానాయుడు గారు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత VB రాజేంద్ర ప్రసాద్ , ఆరుద్ర, ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణు మాధవ్, 'మామ' కే. వి. మహదేవన్,
    దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారితో..ఘంటసాల తో పాటు, ఛాయాదేవి, వాణిశ్రీ, రామకృష్ణ, చలం & ఇతరులు , ఎస్వీ రంగారావు, దేవానంద్, వహెదా రెహమాన్ మొదలైన సినీ ప్రముఖులతో పాటు,
    దివంగత రాష్ట్రపతులు.. వి. వి. గిరి, సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, దివంగత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఫోటోలు ఘంటసాల గారితో కలసి వున్నవి వున్నాయి.
    వీటితో పాటు పాతతరం గాయనీ గాయకుల గ్రూప్ ఫోటో కూడా ఉంది. దానిలో : ఏ. ఎం. రాజా, మాధవపెద్ది సత్యం, ఘంటసాల, సుశీల, జానకి, పి. లీల, జిక్కీ, జమునారాణి..మొదలైనవారు వున్నారు..కొందరిని నేను గుర్తు పట్టలేకపోయాను. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరని ఆశిద్దాం..

    ReplyDelete
  3. అపురూపమైన చిత్రాలు .మంచి సేకరణ
    చిత్రాలు చూస్తున్నంత సేపు వారు పాడిన
    పాటలు మనోఫలకం మీద కదలాడినట్లనిపించాయి .

    ReplyDelete
  4. ఈ ఛాయ చిత్రాలను నేను సావిత్రి ఘంటసాల రచించిన మా మావయ్య ఘంటసాల పుస్తకం లో చూసాను.చక్కటి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. బాగుంది - డప్పు వాయిస్తున్న ఫొటో - విజయా స్టూడియోలోనో, భరణీలోనో ఒకసారి ఫేన్సీడ్రెస్ పార్టీ చేశారుట - బ్లాగుల్లోనో ఎక్కడో చదివాను.

    ReplyDelete
  6. అపురూపమైన గాయకుని....
    అరుదైన చిత్రాలు సేకరించి చూపారు.
    మీ కృషి అభినందనీయం

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)