Saturday, October 16, 2010
వడ్డాది పాపయ్య గారి వినాయకుడు...
వడ్డాది పాపయ్య గారి వర్ణ చిత్రాల కోసం చందమామ కవర్ పేజిలు చూస్తోండగా ఈ బొమ్మ కనిపించింది. విఘ్నేశ్వరుడు ధారావాహిక కోసం వేసిన ఈ బొమ్మ చాలా చిత్రం గా అనిపించింది..!
పైబొమ్మ - లోభ గుప్తుడనే వ్యాపారి తన స్నేహితుడైన సత్యగుప్తుడిని మోసం చెయ్యబోతే విఘ్నేశ్వరుడు ఎలా అతనికి శాస్తి చేసాడో తెలిపే కథకి చిత్ర రూపం. క్రింద బొమ్మ - కలహ కంఠి అనే ఒక గయ్యాళి అత్త విఘ్నేశ్వరుని భక్తురాలైన తనకోడలిని రాచిరంపాన పెట్టినా చివరకు ఆమెకే విధంగా శాస్తి జరిగిందో చెప్పే కథ కు ఇది బొమ్మ గా వేసారు మన వపా !!
అయితే కవర్ పేజీ పైన వేసే వపాగారి రెగ్యులర్ శైలికి భిన్నం గా ఇది కార్టూన్ వేసినట్టుగా అనిపించింది..కథ యొక్క సాంఘిక / జానపద నేపథ్యం వల్లనేమో మరి..??!! సాధారణంగా కవర్ పేజి మీద ఒకటే బొమ్మ వుంటుంది కానీ ఇది రెండుబొమ్మల తో, చుట్టూ గోల్డ్ కలర్ ఫ్రేం తో చిత్రంగా అనిపించింది. పైగా ఇవి రెండూ కూడా ఒకే సంచిక లోవి కాదు..1982 జూన్ , జులై లలో పడిన రెండు కథల బొమ్మలు ఇవి..మరి అలా ఎందుకు వేసారో!!
****
పోన్లెండి..దానిగురించి వదిలేసి..వపా గారి ఇంకో బొమ్మ: వినాయకుడు ఎన్ని భంగిమల్లో ఉన్నాడో గమనించండి..
చివరగా సత్రాజిత్తు శ్యమంతక మణి నీ, సత్యభామనూ శ్రీ కృష్ణునికి సమర్పిస్తున్న దృశ్యం... ప్రసన్నవదనం తో వినాయకుడు ఆశీర్వదించడం..సత్యభామా పాణి గ్రహణం.. విజయ ఫల పరిష్వంగం తో ఉప్పొంగిన కృష్ణుని వక్షస్థలం...జాంబవంతుని ఆశ్చర్యం..జాంబవతి అమాయకత్వం.. నిశితంగా చూసేకొద్దీ క్రొంగొత్త విషయాలు కనిపిస్తూనే వుంటాయి...ఆ మణి యొక్క ధగ ధగలు, సత్యభామ దండ వంకీ, మిగిలిన అలంకరణ..ఆహా !! అద్భుతం ..!! అనిపించక మానదు కదూ...
Subscribe to:
Post Comments (Atom)
రాధేశ్యాం గారు,మీ ఇంటిల్లిపాదికి దసరా శుభాకాంక్షలు!
ReplyDelete"చందమామ" ముఖచిత్రాలపై శ్రీ వడ్డాది కుంచెనుంచి జాలు
వారిన వినాయకుడి చిత్రాలను ,వాటివివరాలను తెలియ జేసిన
మీకు ధన్యవాదాలు. మీ ఈ ఆలోచన చాలా బ్లాగున్నదిసుమా!!.
మీ టపా మూలంగా వపా గారి చిత్రాలు కొన్ని చూసే అవకాశం కలిగింది.కృతజ్ఞతలు
ReplyDeleteవిశాఖపట్నం లో 9 - 10 నెలల క్రితం వడ్డాది పాపయ్య గారి paintings ప్రదర్శనకి ఉంచేరు. అన్నీ స్కాన్ చేసి PPT లో చూపించారు. ఆ paintings శ్రీ చలపతి రావు గారని.. ఆయనా ఆర్టిస్టే..చిత్ర కళా పరిషత్ అని ఒక సంస్థ నడుపుతున్నారు. వపా గారు చివరి రోజులలో కసింకోట లో వున్న 12 ఏళ్ళు ఈయన తో చాలా ఆత్మీయం గా వుండేవారట. వారు వ్రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, ఇంకా కొన్ని ఒరిజినల్ paintings కూడా చూడ గలిగే భాగ్యం కలిగింది. అది నిజంగా మాటలలో వర్ణించలేని అనుభూతి. వాళ్ళు ఆ సందర్భంగా కొన్ని ఉత్తరాలు, paintings కలిపి ఒక పుస్తకం రిలీజ్ చేసారు. paintings తో ఒక CD కూడా త్వరలో వస్తోందని చెప్పారు. అది రిలీజ్ అయ్యిందో లేదో...దాని వివరాలు కనుక్కొని మళ్ళీ చెప్తాను.
ReplyDeleteసురేఖ గారూ , బెల్లంకొండ లోకేష్ గారూ
ReplyDeleteధన్యవాదాలు.. మీకుకూడా దసరా శుభాకాంక్షలు..
చాలా బాగున్నాయి.
ReplyDeleteమనం గ్రహించలేని మన అద్రుష్టాల్లొ ఒకటి వడ్డాది పాపయ్య గారు, కళా కారుల్లొ ఒకరి ఖాలీని భర్తిచేసే మరొ కళాకారులు రావచ్చునుగాని వద్దాది వారి ఖాళీని మాత్రం తెలుగు జాతి ఎప్పటికీ భర్తీ చేసుకొ లేదు , వారిని గుర్తు చేసుకొలేదు, భవిష్యత్ తరాలకు దాచుకొలేదు.
ReplyDeleteఈ అద్భుతమైన బొమ్మలకు, మీకు ధన్య వాదాలు.
వడ్డాది పాపయ్య గారి ఫోటో, వివరాలు నెట్లో లింక్ వుంటే ఇవ్వండి. చందమామ ద్వారా వపా అభిమానిని.
ReplyDeleteShyaamu....very elated...I fondly remember those growing years, Vapa paintings on chandamama and other weekly magazines..
ReplyDeleteI remember cutting them and filing them for several years...your blog reminded me of it...Vethakaali ela ainaa...
వడ్డాది పాపయ్య గారి కొన్ని ఉత్తరాలు, paintings కలిపి ఒక పుస్తకం రిలీజ్ చేసారు అని చెప్పారు కదా, దయచేసి ఆ పుస్తకం ఎక్కడ లభ్యం అవుతుందో తెలియచెయ గలరు.అలాగే వడ్డాది పాపయ్య గారిpaintings తో వున్న, CD రిలీజ్ అయ్యిందో లేదో,దాని వివరాలు కనుక్కొని చెప్పగలరా?
ReplyDeleteఇంత చక్కటి వ్యాసాన్ని అందించినందుకు మీకు నా ధన్యవాదాలు.
@శ్రీనివాస్ గారు
ReplyDeleteవ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు..
వపా మీద ఇంకో వ్యాసం కూడా వ్రాసాను చూడండి.. http://radhemadhavi.blogspot.com/2010/10/blog-post_23.html
మీరు అడిగిన వివరాలతో ఇంకో పోస్ట్ రాస్తున్నాను. దాని లో చూడగలరు..
నా వ్యాఖకు వెనువెంటనే స్పందించినందుకు, అతి త్వరలోనే నాకు కావలసిన వివరములను,ఇంకొక వ్యాసం రూపంలో, అందించబొతున్నందుకు మరోసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది రాధే! జ్ఞాపకాల తుట్టని కదిపావు కదురా ?!! హ్మ్మ్ .....
ReplyDeleteరాదేశ్యాం గారూ.. చాలా కాలం తరువాత మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందం గా ఉంది. వడ్డాది పాపయ్య గారి చిత్రాలంటే నాకు ప్రాణం. మీ బ్లాగ్ ఇంకా full గా explore చెయ్యలేదు.. ఈ మెసేజ్ రాయకుండా ఉండలేకపోయాను.మళ్ళా కలుస్తాను.
ReplyDeleteNeenu vapa abhimanini. Chitrala andanni realise ayyesariki swathi cover mida appudappudu vachchevi1992 nundi chala swathi cover lu collect chesanu. Vapa gari koduku pavaram ni face book lo pattukogaliganu. Vapa chitrala sankalanam vesthe bavuntundi Anna korika ela tirutunda. Alanti sankalam dorikithe adrustsvanyhudini. Vapa intiloki okasari valla chuttalallo akaritho vallani 1992 Aug 14 na. Villantha chitrala. Godala ninda konni mekutho gikina chitralu. Aa nadu camera ledu. Gnapppakalu matrama migilai. Ilanti blogspot undani teliyadu. Ee nadu accidental ga tagilindi. Meerevaraina aa chitrala sankalanam gani photolu gani dore ike chotu , margam chebithe dhsnyunni.
DeleteNeenu vapa abhimanini. Chitrala andanni realise ayyesariki swathi cover mida appudappudu vachchevi1992 nundi chala swathi cover lu collect chesanu. Vapa gari koduku pavaram ni face book lo pattukogaliganu. Vapa chitrala sankalanam vesthe bavuntundi Anna korika ela tirutunda. Alanti sankalam dorikithe adrustsvanyhudini. Vapa intiloki okasari valla chuttalallo akaritho vallani 1992 Aug 14 na. Villantha chitrala. Godala ninda konni mekutho gikina chitralu. Aa nadu camera ledu. Gnapppakalu matrama migilai. Ilanti blogspot undani teliyadu. Ee nadu accidental ga tagilindi. Meerevaraina aa chitrala sankalanam gani photolu gani dore ike chotu , margam chebithe dhsnyunni.
DeleteVapa swathilo chivarikalam lo rasaru. Atu sunna itu sunna madhyalo nenunna
ReplyDeleteSrikakula edu rodla junction daggara unna ayana intloki velladam oka adbutha anubhavam. Veedhi dwaram daggara jaaju tho oka anjaneyuni bomma.ayana intlo leru .1992 Aug ki bratike unnaru? Kasimkota lo unnaranukunta
ReplyDeleteHyderabad nundi srikakulam inti bayatanundaina chuddam anukunna. Kani adrustam intloki pravesam dorikindi. O padi nimashala ecstacy
ReplyDeleteVapa chitrala ppt cd ekkada korukutundi. Dayachesi telapandi
ReplyDeleteశ్యాం గారూ... నేను వపా అభిమానిని. కానిీ ఆయన ఎంత నిగర్వో ఈ మధ్యన ఒక వారపత్రికలో వచ్చిన వ్యాసం తెలిపింది... అనుకోకుండా మీ బ్లాగు సందర్శించాను ఈ రోజు.. ఆద్భుతం ...
ReplyDelete