Wednesday, January 26, 2011

విశాఖలో 'ఈఫిల్ టవర్'

విశాఖపట్నం లో ఈఫిల్ టవర్ ఏమిటా అని డౌట్ పడుతున్నారు కదా..!! పైగా ఒకటి కాదు రెండు. ఒక వెల్డింగ్ షాప్ అతను (ఆయనే యజమాని) అపురూప కట్టడాన్ని తన వర్క్ షాప్ లో తయారు చేసారు. మొదట నాలుగున్నర అడుగుల ఎత్తులో బుజ్జి ఈఫిల్ టవర్ ని తయారుచెయ్యడానికి 28 గంటల సమయం పట్టిందిట. రెండోది ఎనిమిదడుగులకు పైగా ఎత్తు వచ్చేట్టు ఈసారి 23 గంటల్లోనే మళ్ళీ తయారు చేసారు. కేవలం ఈఫిల్ టవర్ కి సంబంధించిన ఫోటోలను చూసి తయారుచేసారట. ఆ shape, proportions, దానికి సంబంధించిన technical drawings ఏమీ లేకుండా అంత ఖచ్చితంగా చేయడం గొప్పే కదా..!!
విశాఖపట్నం లో పెదవాల్తేరు లోని 'విశాఖ హాస్పిటల్' డౌన్ దిగి వెళ్తున్నవారందరికీ రోడ్డు పక్కనే వున్న 20 అడుగుల డైనోసార్లూ, 30 అడుగుల డ్రాగన్లూ కనిపించి ఒకింత ఆశ్చర్యానికి గురిచేయ్యక మానవు. అన్నీ ఐరన్ ఫ్రేము తో చేసినవే..! అయితే ఇవేవీ ఏదో ఆర్డర్ మీద చేసినవి కాకపోవడం విశేషం. ఆ షాప్ యజమానీ, స్వతహాగా వర్కర్ కూడా ఐన శ్రీ రమేష్.. ఈ వింతల సృష్టి కర్త. కేవలం తన అభిరుచినీ, సృజననీ మేళవించి చేసే కళా రూపాలే ఇవన్నీ..! ఇష్టపడి చేసే పని కష్టమనిపించదు కదా..!! అదే తన విజయ రహస్యం కూడా. ఇలాటివి చెయ్యడానికి ఖర్చు అవుతుంది కానీ, పని పూర్తయ్యాక వచ్చే తృప్తి (job satisfaction) ముందు ఆ ఖర్చు దిగదుడుపే అంటాడు. దారిన పోయే ఎందరినో..ఒక్క క్షణం ఆ షాపు వైపు చూసేలా చేసే ఈ కళా రూపాల సృష్టి కర్త రమేష్ ను తప్పక అభినందించాలి.
దీనిని పిల్లలు ఎక్కగలిగే సైజులో చెయ్యాలని అతని లక్ష్యం, సంకల్పం! అతని మాటల్లో చెప్పాలంటే కిందనున్న ఆర్చ్ హైట్ పదడుగులు వచ్చేలా చేస్తారట.అంటే మొత్తం పొడవు సుమారు తొంభై అడుగుల పైమాటే..!! త్వరలోనే శ్రీ రమేష్ తప్పక విజయం సాధిస్తారని ఆశిద్దాం.

2 comments:

  1. చాలా బాగుంది.....

    http://telugutelevisionmedia.blogspot.com/

    ReplyDelete
  2. బంగారానికైనా గోడ చేర్పు కావాలంటారు...నిజంగా శ్రీరమేష్
    అభిరుచి చాలా గొప్పది...దానికి తగ్గట్టు తన పనితనంతో
    చాలా బాగా ఈఫిల్ టవర్ తయారు చేసారు...శభాష్....
    అయితే ఆ సామెత ఏమిటోయ్...అంటారా? ఆ కృషిని గమనించి
    దానికి అందమైన ఫోటోలు తీసి, దాని విశేషాన్ని మాకందరికీ
    తెలియపరచిన మీ సౌజన్యము మెచ్చదగినది... ఈసారి వైజాగ్
    వచ్చినప్పుడు చూస్తా....కాదు ఇలాంటివి చూడ్డానికి త్వరలో
    వైజాగ్ వస్తా....బాగుంది.

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)