Saturday, September 14, 2013

తలపాగాలు..!


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ "తలపాగా" లను  ఏదో ఒక రూపంలో చూస్తాం. ప్రతికూల వాతావరణాల నుంచీ తమను తాము కాపాడుకోవడానికి తలపాగాలను మానవుడు రాను రాను తన జీవన విధానానికి, హోదాకి చిహ్నంగా రూపొందించుకొన్నాడు. పూర్వం మహారాజులు మణుగుల కొద్దీ బరువైన రత్నఖచిత కిరీటాలను పట్టాభిషేక మహోత్సవాల లాంటి ప్రత్యేకమైన సందర్భాలకి పరిమితం చేసి సాధారణ సందర్భాలలో వారి దర్పాన్ని ఇనుమడింపజేసే నగిషీలతో తక్కువ బరువు కలిగిన వివిధ రకాల తలపాగాలనే ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి మరిన్ని వన్నె చిన్నెలు కలిసి అందానికి, హుందాతనానికి ప్రతీకలుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా వచ్చి చేరాయి.
తెలుగు భాషకు తలకట్టు ఎంత  ముఖ్యమో తెలుగువాడి తలకు తలపాగా కూడా అంతే అన్నంతగా మన తెలుగు సంస్కృతిలో తలపాగకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. మన పంచకట్టు ఎంతకష్టమో తలపాగా చుట్టడం  కూడా అంతే కష్టం. తలపాగా చుట్టడం ఒక కళ. అది 'టోపీ' పెట్టేసినంత సులువు కాదు. దానిననుసరించే సామెతలు కూడా పుట్టుకొచ్చాయి. తలపాగా చుట్టలేక బుర్ర వంకర అన్నాట్ట వెనకటికి ఎవడో. అలాగే కోటలో (తల)పాగా వేశాడు అంటే  దివాణం లో పనిలో కుదిరాడు అని అర్థం. అంటే కొలువులో చేరగానే అతని హోదాకి తగ్గ తలపాగా ఇచ్చి గౌరవించేవారేమో!! ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు కానీ ఈ మధ్య మన రాజకీయ నేతలు మాత్రం పార్టీ మారగానే కొత్త పార్టీ కండువాలు కప్పించుకొని వాళ్ళ పాత రంగులు మారుస్తున్నారు. 
 
మన దేశం లో చూస్తే కొన్నిసంప్రదాయాల కుటుంబాలకు కొన్ని ప్రత్యేకమైన తలపాగా ఉంటుంది. రాజస్థానీలకు, పంజాబీలకు, మరాఠీ లకూ, కన్నడిగులకూ ప్రత్యేకమైన తలపాగాలు ఉన్నాయి. అయితే బాలగంగాధర తిలక్ ధరించిన ఈ తలపాగా కి "పూనే రి పగిడీ" అని పేరు. దీనికి సుమారు రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ పగిడీ ని 19 వ శతాబ్దం లో మొదట ప్రాచుర్యం లోకి తెచ్చింది ప్రముఖ సంఘ సంస్కర్త, శ్రీ మహదేవ్  గోవింద రెనేడే. శ్రీ పూనే రి పగిడీ సంఘ్ అనే సంస్థ చేసిన కృషి వల్ల 4 September 2009 Geographical Indication Registry వారి ద్వారా దీనికి  Geographical Indication ట్యాగ్ కూడా లభించింది. [The pagadi got the Intellectual Property Right (IPR) and selling of any turban made outside Pune, under the name of Puneri pagadi became illegal. Along with the Puneri pagadi, IPR has been previously issued to Indian products like Darjeeling tea, Banarasi saris, Tirupati ladoos, among others. సోర్స్: వికి పిడియా]

కొందరు ప్రముఖుల్ని తలపాగా లేకుండా ఊహించడం కష్టం. అలాంటి వారిలో కొందరు :
బాల గంగాధర తిలక్
సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్స్వామీ వివేకానంద

అలాగే మనరాష్ట్రం లోని కొందరు ప్రముఖులు:
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
శ్రీ కందుకూరి వీరేశలింగం
వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మోర్తి గారు 
శ్రీ గురజాడ అప్పారావు గారు

దివంగత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ 
కన్నడ తలపాగా లో శ్రీ పీ బీ శ్రీనివాస్ 
 అరుదుగా తలపాగా కట్టినా చూడచక్కని వాళ్ళు కొందరు .. 

ఆంధ్రుల అభిమాన నటుడు, నాయకుడు  NT రామారావు 

 అలాగే ప్రముఖులు కాని మరికొందరు:
***
*** 
***
***
(*** గుర్తు ఉన్న ఫోటోల  సౌజన్యం: turban tying expert శ్రీ మహేంద్ర సింగ్ పరిహార్ 
 http://rajwadisafa.blogspot.in/)

6 comments:

 1. బాగింది ఈ వ్యాసం. మీ బొమ్మలు ఒక అదనలు ఆకర్షణ!

  ReplyDelete
 2. నాకు అర్ధమైనదిలే ఎందుకు ఈ ఆర్టికల్ రాసావో హెహె .. మంచి ప్రయత్నమ్..
  నెక్స్ట్ టైం పంచె కట్టు ట్రై చెయ్యి ...

  ReplyDelete
 3. "ఇప్పుడు వాటికి మరిన్ని వన్నె చిన్నెలు కలిసి అందానికి, హుందాతనానికి ప్రతీకలుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా వచ్చి చేరాయి." లో ఫ్యాషన్ అనేదాన్ని ఆంగ్లలిపిలో వ్రాస్తే బాగుంటుంది కదా!తెలుగు కాని పదాలు తెలుగులిపిలో ఎందుకు వ్రాయటం ఎందుకు?

  ReplyDelete
 4. తలపాగాల మీద... సారీ తలపాగాల క్రింద.. మళ్లీ సారీ, తలపాగాల విషయముపై మంచి వ్యాసం వ్రాసారు. చాలా బాగుంది. పరిశోధనాత్మకం.. ఫోటోలు చాలా బాగున్నాయి. బాల తలపాగాలు కూడా చాలా బాగున్నాయి.. మీ వివిధభంగిమలు మీలో నటుణ్ణి ప్రత్యక్షం చేసాయి.. ముఖ్యంగా మీ బ్లాగు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. ... మీ నాన్నగారికి నమస్కారములు, అడిగానని చెప్పండి.

  ReplyDelete
 5. వ్యాసం బావుంది.
  నీ ముచ్చట తీర్చుకోవటం కూడా బావుంది.

  ReplyDelete
 6. తలపాగలు ఇప్పుడు ఎక్కువగా పెల్లిల్లలొ షెర్వాని తొ వదుతున్నరు

  ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)