ఈ రోజు నవయుగ వైతాళికుడు, తెలుగు కథకి ఆద్యుడు, సంఘ సంస్కర్త, కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావుగారి వర్ధంతి. ఆయన 1915 వ సంవత్సరంలో పరమపదించారు. ఈ తరంలో వరకట్నం గురించే గాని, కన్యా శుల్కం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. ఆ రోజుల్లో కన్యాశుల్కం (పెళ్లి చేసుకొనేటప్పుడు అమ్మాయి తండ్రికి డబ్బులు ఎదురివ్వడం) కారణంగా ఎందరు చిన్నారుల బతుకులు బుగ్గిపాలయ్యాయో...? అప్పారావుగారు అదే అంశాన్ని ఇతివృత్తం గా చేసుకొని 'కన్యాశుల్కం' అనే నాటకం వ్రాసారు. చాలా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి మూఢాచారాల పై తన వ్యంగ్యాస్త్రాలు సంధించి హాస్య రసాన్ని అద్భుతంగా పండించారు.
ఈ నాటకం సినిమా రూపంలో ఎన్టీ రామారావు, సావిత్రి, సీఎస్సార్, మొదలైనవారు ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కింది. రంగస్థలం మీద కూడా ఎన్నిసార్లు వెయ్యబడిందో లెక్కలేదు.
ఆ సినిమా ఈ రోజు అప్పారావుగారి 97 వ వర్ధంతి సందర్భంగా స్థానిక గురజాడ కళా క్షేత్రం లో vuda వారి సౌజన్యంతో ప్రదర్శితమైంది. దానికి ముందు కళాకారులు కన్యాశుల్కం లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. ఒక మూడు వందల మంది వచ్చి వుంటారేమో. కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు.
ఈ సినీమా మరియు నాటకం లో భాగాలను ప్రదర్శించే ఆలోచన ఎవరిదో కానీ, వారినీ వూడా అధికారుల్నీ మనస్పూర్తిగా అభినందించాలి. ఆ మహనీయునికి ఇలాంటి నివాళి ఇచ్చినందుకు.
ఈపుస్తకాన్నిఆర్కైవ్.ఆర్గ్ నుండి ఈ దిగువ లింక్ ని నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కన్యాశుల్కం నాటకం పీడీఎఫ్ రూపంలో
మొట్టమొదటి తెలుగు కథ గా చెప్పబడే 'దిద్దుబాటు' అప్పారావుగారి రచనే నని అందరికీ తెలిసిందే..!!
క్రింద బొమ్మలపై నొక్కి పెద్దవిగా చూడండి.
సంతోషం. కన్యాశుల్కం నాటకం - నవల కాదు, గమనించగలరు.
ReplyDeleteకొత్తపాళీ గారూ.. పొరపాటు సవరించాను. ధన్యవాదాలండీ..! :)
ReplyDelete