ఆండ్రాయిడ్ ఫోన్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ని జోడించడం ఎలా??
నా ఫోన్ సోనీ ఎరిక్సన్ XPERIA X10i లో తెలుగు ఫాంట్ install చెయ్యడానికి శతవిధాల ప్రయత్నించి, కుదరక ఆఖరికి 'ఓపెరా మిని' తో పని కానిచ్చేస్తూ ఉండేవాడిని. ఈ పధ్ధతిలో తెలుగు లిపి బ్రౌజర్లో చూడడం వరకు పర్వాలేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లతో డిఫాల్ట్ గా వచ్చే అప్లికేషన్స్ (ఉదా. జి-మెయిల్, యాహూ మెయిల్ లాంటివి, తెలుగులో ఉన్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్) లో మాత్రం డబ్బాలే కనిపించేవి. మన బ్లాగు ఫోన్ లో ఓపెరా మినీ ద్వారా చూసినా కామెంట్ మనం మళ్ళీ తెలుగులో టైపు చెయ్యాలంటే అస్సలు కుదరదు. తెలుగులో టైపు చెయ్యడానికి ఆండ్రాయిడ్ మార్కెట్ లో కొన్ని తెలుగు టైపింగ్ అప్లికేషన్స్ (MultiLing Keyboard app , My Alpha app , Telugu Pride Editor లాంటివి ) ఉన్నాయి కానీ, అన్నీ ఆవు కాంపోజిషన్ లో లాగ "ఇన్-బిల్ట్ తెలుగు ఫాంట్ - డబ్బాలు" దగ్గరకే వచ్చి ఆగేవి. ఆ టైపు రైటర్ తో టైపు చేసిన అక్షరాల రెండరింగ్ సరిగ్గా కనిపించేది కాదు. అంటే తెలుగు లిపి ఇలా కనిపించేది: (ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి)
ఇన్ బిల్ట్ ఫాంట్ ఉంటే ఈ సమస్యలన్నీ పోతాయి. Telugu Pride Editor, ఐఫోన్ లో చాలా బాగా కనిపిస్తోంది. Samsung S III లాంటి కొన్ని మోడల్స్ తెలుగు ఫాంట్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ లో మాత్రమే ఆ సదుపాయం లేదు.
వెతగ్గా వెతగ్గా అర్థమైన సంగతేమిటంటే ఫోన్ లో మనకి కావలసిన ఫాంట్లు డౌన్లోడ్ చెయ్యాలంటే మన ఫోన్ ని 'ROOT' చేసుకోవాలట. అయితే రిస్క్ ఏమిటంటే ROOT చెయ్యబడిన తరువాత / లేదా చేస్తూ ఉండగా మొదటికే మోసం వచ్చి ఫోన్ పేపర్ వెయిట్ గా తప్ప మరి దేనికీ పనికిరాకుండా పోవచ్చుట. పర్ఫెక్ట్ గా పనిచేసినా చెయ్యవచ్చుట. సాహసం శాయరా డింభకా ..! అనుకోని మొత్తానికి నా ఫోన్ ROOT చేసేసాను. పర్ఫెక్ట్ అవునో కాదో తెలీదు కానీ చిక్కులేమీ ఎదురుకాలేదు. వెంటనే యూనికోడ్ ఫాంట్ 'లోహిత్ - తెలుగు' install చేసి చూశాను. కానీ పని చెయ్యలేదు. అసలు Install అవలేదు. సరేలే! ఫోను పాడవ్వలేదు అనుకోని ఊరుకున్నాను.
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson) |
Multiling Keyboard |
Telugu Pride Editor |

ఈలోగా ఒక
తమాషా అయిన పద్దతి లో గుజరాతి ఫాంట్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో install చేసిన
వ్యక్తి వ్రాసిన పోస్టు కనిపించింది. దీనికి కూడా మన ఫోన్ తప్పనిసరిగా ROOT
చెయ్యబడి ఉండాలి. కాన్సెప్ట్ ఏమిటంటే మనదగ్గర ఉన్న యూనికోడ్ ఫాంట్ ని,
ఫోన్ లోని system ఫాంట్ (ఇన్-బిల్ట్ ఫాంట్) పేరుతో rename చేసి ఈ rename
చెయ్యబడిన మన ఫాంట్ ని ఫొన్ లోని సిస్టం ఫాంట్ మీద Overwrite చేసెయ్యాలి.
పైన పేర్కొన్న పోస్టు లో చెప్పిన స్టెప్స్ నేను ఈ క్రింది విధంగా అమలు చేసాను.
పైన పేర్కొన్న పోస్టు లో చెప్పిన స్టెప్స్ నేను ఈ క్రింది విధంగా అమలు చేసాను.
- కంప్యూటర్ లో "C:\Windows\Fonts" ఫోల్డర్ లో ఉన్న యూనికోడ్ ఫాంట్ (ఉదా. గౌతమి) ని తీసుకొని ఫోన్ యొక్క SD కార్డు లోకి copy చేశాను.
- SD కార్డు లోకి copy చేసిన ఫాంట్ ని "DroidSansThai.ttf" గా rename చేశాను. (ఈ ఫాంట్ పేరుతో మన ఫోన్ లో 'థాయ్' లిపి install చేసి ఉంటుంది. మనకి థాయ్ లిపి అక్కర్లేదు కాబట్టీ దీన్ని ఉపయోగించుకుంటున్నాం.
- ఫోన్ లోకి 'ES File Explorer' అనే app ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను.
- ES File Explorer - settings లో Root Explorer ని enable చేస్తే, వచ్చిన బాక్స్ లో Mount R / W, అన్న దానిపై క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ కనిపించింది. RO (Read - Only ) లో ఉన్న సెలక్షన్ ని RW (Read & Write) కి మార్చాను.
- ఇప్పుడు ES File Explorer ద్వారా స్టెప్ 2లోని ఫైల్ ని (originally "gautami.ttf" but renamed as "DroidSansThai.ttf") తీసుకుపోయి ఆండ్రాయిడ్ ఫోన్ Root Directory లోని " /system/fonts " directory లోకి Cut - Paste పద్దతి లో Move చేసాను. ఆ ఫాంట్ పేరుతో ముందే ఇంకో ఫైల్ ఉంటుంది కాబట్టీ Overwrite చేసాను. (Systam Files ని ఈ ప్రకారంగా మార్చడానికే కావలసిన అనుమతులు (permissions) మన ఫోన్ ని ROOT చెయ్యడం ద్వారా సమకూరుతాయి. తద్వారా మన ఫోన్ లోకి SUPER User అనే app install అవుతుంది. ఈ అనుమతులన్నీ ఈ Super User App అన్నదే ప్రాసెస్ చేస్తుంది.)
- ఇప్పుడు ఫోన్ ని restart చేశాను.
గౌతమి ఫాంట్ లో తెలుగు లిపిని స్పష్టంగా చూడచక్కగా దర్శనమిచ్చింది.
నా ఫోన్ లో (android 2.3.3 version) ఈ పధ్ధతి పర్ఫెక్ట్ గా పని చేస్తోంది.
(strictly THOSE who have already rooted their android phones only)
(strictly THOSE who have already rooted their android phones only)
special thanks to Sri C K Patel, who worked out this wonderful Idea.
his original post is @ http://rootzwiki.com/topic/39590-unicode-support-in-jb/#entry1116926
ఇదివరకు ఆండ్రాయిడ్ ఫోన్ల మీద / గురించి వ్రాసిన వ్యాసాలు:
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో తెలుగు టైపింగ్ చెయ్యడం ఎలా?...
మొబైల్ ఫోన్ లో తెలుగు లిపి..!!
ఇదివరకు ఆండ్రాయిడ్ ఫోన్ల మీద / గురించి వ్రాసిన వ్యాసాలు:
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో తెలుగు టైపింగ్ చెయ్యడం ఎలా?...
మొబైల్ ఫోన్ లో తెలుగు లిపి..!!
sir nenu celkon a119q vaadutunnanu daniki e paddathi vadavacha ... root ante emiti ? dayachesi teliyacheyaandi ..
ReplyDeletedevagiri_p@rediffmail.com
Sir,
DeleteMy Knowledge is very little in this subject.
as far as I understand (subject to correction)
'ROOTING' android device is a process to give you permissions to modify the inbuilt features and applications.
as described in WIKI:
Rooting is often performed with the goal of overcoming limitations that carriers and hardware manufacturers put on some devices, resulting in the ability to alter or replace system applications and settings, run specialized apps that require administrator-level permissions, or perform other operations that are otherwise inaccessible to a normal Android user. On Android, rooting can also facilitate the complete removal and replacement of the device's operating system, usually with a more recent release of its current operating system.
Some element of Risk is involved in ROOTING Android Device. If any thing goes wrong during the process it may lead to disfunctioning of the device. after rooting people say that it also voids Please be careful if you are really interested to root your mobile.
you can go to this link for further information:
http://www.youtube.com/watch?v=vLg86DAqcuw
ఈ పద్దతి జింజర్‌బ్రెడ్ వర్షన్ కు బాగా పనికొస్తుంది కానీ ice cream sandwich(4.0.4) కు పనికిరాదండీ. నేను చాలా ట్రై చేసి ఫోన్ లోని క్రోం బ్రౌజర్ లో మాత్రం తెలుగు వచ్చేలా చెసుకున్నానండీ. ఇంతలో HTC వారు update ఇవ్వడం వలన default గా తెలుగు వచ్చి సరిపోయింది.
ReplyDeleteసురేష్ బాబు గారూ,
Deleteసరిగ్గానే చెప్పారు. క్రోమ్ బ్రౌజర్ లో తెలుగు వచ్చేలా ఎలా చేసారో కూడా వివరంగా చెప్పగలరు.
ధన్యవాదాలు.