Saturday, June 22, 2013

"May Flower" in our garden


మా నాన్నగారి సంరక్షణలో ఈ ఏడాది పూసిన  'మే' పుష్పం ఇది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జూన్ లోనే  పూసింది. ఈ మొక్క మాఇంట్లో సుమారు ఎనిమిది - పదేళ్లుగా ఏడాది కొక సారి పూస్తూనే వుంది. రెండు మూడు దుంపల నుండీ పుట్టిన మొక్కలకు నాలుగున్నర సెంటీమీటర్ల వ్యాసంతో మొక్కకొకటి చొప్పున పూవులు పూస్తాయి. పూసిన తరువాత మూడు నాల్గు రోజులకు వాడిపోతుంది. మరో రెండు మొక్కలు పూయడానికి  సిద్ధం గా ఉన్నాయి .
 
 
 

అదే పూల కుండీలో 2009 లో పూసిన పువ్వు :


దీనితో పాటు బ్రహ్మకమలం మొక్క కూడా ఉంది మా ఇంట్లో .. దాని పువ్వులు కూడా ఇలాగే అరుదుగా పూసే పువ్వులే..! ఈ క్రింది ఫోటోలో ఉన్న బ్రహ్మకమలం పువ్వు క్రితం సంవత్సరం పూసినది. పొద్దున్న ఫొటో తీసే వేళకి నీళ్ళలో తడిసిపోయి ముడుచుకు పోయింది. రాత్రి పూట విచ్చుకోవడం మొదలై మంచి సువాసనలు వెదజల్లుతూ  అరచేతి వెడల్పున  పూసే ఈ పువ్వు కూడా మర్నాటికల్లా ముడుచుకు పోతుంది.

ఈ పువ్వు గురించి ఆంధ్ర భూమిలో వచ్చిన వ్యాసం ఇక్కడ:

5 comments:

  1. మే ఫ్లవర్..జూన్ లో పుష్పించినా అందంగానే ఉంటుంది. ఉంది కూడా!:-)

    ReplyDelete
    Replies
    1. అనిల్ గారూ,
      ధన్యవాదాలు.
      - రాధేశ్యామ్

      Delete
    2. అనిల్ గారూ,
      ధన్యవాదాలు.
      - రాధేశ్యామ్

      Delete
  2. పూలు మీవే. అందం ఆనందం పంచుకుంటే పదింతలు..మీ ఆనందాన్ని నయన మనోహారంగా ఆస్వాదిస్తున్నాము. ఆనందం పంచడం ఒక కళ కదా...

    ReplyDelete
    Replies
    1. రాధాకృష్ణ గారూ,
      ధన్యవాదాలు సార్..!

      Delete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)