బ్లాగు మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!!
శ్రీ వడ్డాది పాపయ్య గారు వివిధ పత్రికలకు (చందమామ, స్వాతి, వేదాంత భేరి ఇత్యాది..) గీసిన దుర్గా దేవి చిత్రాలు దసరా సందర్భంగా:ఈ నవరాత్రులలో తొమ్మిది రూపాలలో కొలువుతీరే దుర్గా మాత అవతారాలను వర్ణిస్తూ మార్కండేయ విరచిత దేవీకవచమ్ లో ఈ శ్లోకంలో చెప్పబడింది:
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
౧. శైలపుత్రి |
౨. బ్రహ్మచారిణి |
౩. చంద్ర ఘంట |
౪. కూష్మాండ |
౫. స్కంద మాత |
౬. కాత్యాయని |
౭. కాళరాత్రి |
౮. మహా గౌరి |
౯. సిధ్ధి ధాత్రి |
శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు వారి బ్లాగులో ఈ నవ విధ దుర్గల ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆసక్తి గలవారు ఈ లింకులో చూడవచ్చు
నవ దుర్గలు
జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గేజయ జయ తోషిత భర్గే అంబ జయజయ కుచ జిత దుర్గే ||
శ్రికర సద్గుణ జాలే అంబ సింధూర రంజిత ఫాలే
పాకశాసన మణినీలే అంబ ప్రాలేయ భూధర బాలే
పాలిత కిసలయ చాపే అంబ పార్వతి లోకైకదీపే
కాళిక కోమల రుపే అంబ ఖండిత త్రిభువన తాపే ||
శంకరి సత్క్రుపాపూరే అంబ సంభ్రుత సన్మణిహారే
సాంకవలిప్త శరిరే అంబ సంగతాంగ కేయూరే ||
వీణా వినోదిని గిరిజే అంబ విద్రుమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే అంబ మదన గోపాలక సహజే ||