ఈ మధ్య కెనెడా దేశంలో ఒక వీధికి ప్రముఖ
సంగీత దర్శకుడు రెహమాన్ పేరును పెట్టారట. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖుల గౌరవార్థం ఇలా పేర్లు పెట్టడం మామూలే.
అయితే ప్రముఖులైన కొందరు సంగీతవిద్వాంసుల పేరుమీద ప్రపంచవ్యాప్తంగా కొన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని మీకు తెలుసా..! అది తెలియడమే విశేషమనుకుంటే, ఆ పోస్ట్ ఆఫీసుల నుంచి అఫీషియల్ కాన్సిలేషన్ తో పోస్టల్ లెటర్స్ , స్టాంపులు సేకరించడం ఎంత వ్యయ ప్రయాసలతో కూడిన విషయమో ఊహకందదు.
సంగీతానికి సంబంధించిన దేశవిదేశాల నాణాలు, మరియు తపాలా బిళ్ళల సేకర్త శ్రీ G. శ్రీరామారావు గారు తమ సేకరణను స్థానిక కళాభారతి ఆడిటోరియం లో ప్రదర్శనకు ఉంచారు. వారం రోజులపాటు జరిగే సంగీతోత్సవంలో భాగంగా సంగీతాభిరుచి కల్గిన ప్రేక్షకుల సందర్శనార్థమై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన, ఉత్సవం మొదటి రోజు సంగీత కళానిధి, షేవాలియర్ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిచే ప్రారంభింపబడింది. ఆసక్తి గల వారు ఈ అరుదైన కలెక్షన్ ను మద్దిలపాలెం, కళాభారతి ఆడిటోరియంలో చూడవచ్చు.
వీరి సేకరణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూడు విభాగాల్లో నమోదయ్యింది. వీరి సేకరణలో అత్యంత అరుదైన స్టాంపులు ( డీవీడీ, సీడీ, గ్రామఫోన్ రికార్డుల రూపంలోనూ, అలాగే చెక్క, క్రిస్టల్స్, చాక్లెట్ మొదలైన పదార్ధాలతో తయారైనవి) సంగీత వాయిద్యాల ఆకారంలో ఉన్న నాణాలు, చూడచక్కగా ఉన్నాయి.
Honour for philatelist
1. Musical Post Offices 2. Musical coins 3. Musical currency
Musical Post Office Part I
Musical Post Office Part II
శ్రీరామారావు గారు ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయ్యరు. సంగీతాభిమాని. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసారు. సంగీతంలో మా ఇద్దరి గురువుగారు ఒక్కరే (శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారు) సంగీతాని సంబంధించిన ఈ సేకరణ వారు 1993 నుంచి చేస్తున్నారు. అంటే ఇరవై ఏళ్ల శ్రమ. ఇప్పుడు వారి వయస్సు 73. వారు అనేకచోట్ల జరిగిన ఈ తరహా ప్రదర్శనల్లో బంగారు పతకాలు, అవార్డులు కూడా గెలుచుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. మా పరిచయం నేను సంగీతం నేర్చుకొనే రోజుల్లో మొదలై ఈ ఇరవై ఏళ్ల బట్టీ ఉన్నా వారివద్ద ఇంత అద్భుతమైన కలెక్షన్ ఉన్నాడని తెలియడం, అది కళ్ళారా చూడడం నిన్ననే మొదటిసారి. ఈ సోమవారం అనగా 2.12.13 తో అక్కడ జరుగుతున్నా సంగీతోత్సవం తో పాటు ఈ ప్రదర్శనకి కూడా ముగింపు. ఆ తరువాత వారిని సంప్రదించాలనుకొనే ఔత్సాహికులు ఈ క్రింది అడ్రెస్స్ లో కలవొచ్చు.
Cdr. G Sri Ramarao,I.N,(Retd.)
D.No. 1-118-14, Plot 132
Sector 12, MVP Colony
Visakhapatnam 530017
Tel No: +91 891 2550273
Mobile 9393261333
Blog: http://sriramarao.wordpress. com
మాన్యులు శ్రీరామారావు గారికి మనఃపూర్వక అభినందనలు. వారి ఇంటికి వెళ్లి మరిన్ని ఫోటోలు తీసుకువచ్చి మళ్ళీ మీ అందరికీ అప్లోడ్ చేస్తాను.

శ్రీ బాలమురళి గారికి, ఆయన ఫోటోతో ప్రత్యేకంగా తపాలా శాఖవారి ద్వారా చేయించిన పోస్టల్ స్టాంప్స్ బహుకరిస్తున్న శ్రీరామారావుగారు |
బాలమురళి గారి చే సమ్మానం |
Honour for philatelist
The Limca Book of Records have recognized three of following collections of noted philatelist & numismatist, Cdr G.Sriramarao of Vishakhapatnam as National Record for 2014 and will be included in their book to be published on 30 June 2014.
1. Musical Post Offices 2. Musical coins 3. Musical currency
They have recognized the three categories separately and issued 3 certificates to Cdr G. Sriramarao.
Musical Post Offices Collection of Shri Ramarao could be viewed at following links :
Musical Post Office Part II
శ్రీరామారావు గారు ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయ్యరు. సంగీతాభిమాని. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసారు. సంగీతంలో మా ఇద్దరి గురువుగారు ఒక్కరే (శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారు) సంగీతాని సంబంధించిన ఈ సేకరణ వారు 1993 నుంచి చేస్తున్నారు. అంటే ఇరవై ఏళ్ల శ్రమ. ఇప్పుడు వారి వయస్సు 73. వారు అనేకచోట్ల జరిగిన ఈ తరహా ప్రదర్శనల్లో బంగారు పతకాలు, అవార్డులు కూడా గెలుచుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. మా పరిచయం నేను సంగీతం నేర్చుకొనే రోజుల్లో మొదలై ఈ ఇరవై ఏళ్ల బట్టీ ఉన్నా వారివద్ద ఇంత అద్భుతమైన కలెక్షన్ ఉన్నాడని తెలియడం, అది కళ్ళారా చూడడం నిన్ననే మొదటిసారి. ఈ సోమవారం అనగా 2.12.13 తో అక్కడ జరుగుతున్నా సంగీతోత్సవం తో పాటు ఈ ప్రదర్శనకి కూడా ముగింపు. ఆ తరువాత వారిని సంప్రదించాలనుకొనే ఔత్సాహికులు ఈ క్రింది అడ్రెస్స్ లో కలవొచ్చు.
Cdr. G Sri Ramarao,I.N,(Retd.)
D.No. 1-118-14, Plot 132
Sector 12, MVP Colony
Visakhapatnam 530017
Tel No: +91 891 2550273
Mobile 9393261333
Blog: http://sriramarao.wordpress.