Sunday, December 22, 2013

"సుగుణాభిరామం" సి డి ఆవిష్కరణ.


బి. వి. కె. జూనియర్ కళాశాల ప్రాంగణం లో తే.11.12.2013ది. న కళాశాల సంగీత విభాగం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం తో రూపొందించబడిన "సుగుణాభిరామం" (శ్రీ వాల్మీకి మహర్షి శ్లోకములతో, శ్రీ త్యాగరాజ స్వామి  కృతులతో కూడిన శ్రీరాముని గుణ కీర్తనము) సి డి ఆవిష్కరణ సభ జరిగింది. కళాశాల సంగీత విభాగం ప్రధానాధ్యాపకురాలిగా పని చేస్తున్న శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్నఈ సీడీ ఆవిష్కరణ  కార్యక్రమ ముఖ్య అతిథి, కళాశాల వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు శ్రీ పిళ్ళా రామారావుగారు మరియు కార్యక్రమ విశిష్ట అతిధి,  శ్రీమతి మండ సుధారాణి (ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర విద్వాంసురాలు) గారి చేతులమీదుగా జరిగింది. సభాధ్యక్షులుగా శ్రీ కె. రంగారావుగారు (కార్యదర్శి, భారతీయ విద్యా కేంద్రం), గౌరవ అతిథిగా శ్రీ డా. ఎమ్. వి. జె. ఎమ్. రాంప్రసాద్ గారు (ఎనస్థటిస్ట్, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్) విచ్చేశారు / వ్యవహరించారు.శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు సభను నిర్వహించారు . 
ఈ శ్రీరామ గుణకీర్తనా గానంలో పాలుపంచుకొన్నకళాకారులు:  
గాత్రం: శ్రీమతి ఆర్. కుసుమ కుమారి, శ్రీమతి ఐ. జగదంబ, శ్రీమతి డా. ఆర్. రమణి, శ్రీమతి ఎస్ వి సుబ్బలక్ష్మి, కుమారి కె. నిఖిత శ్రీవల్లి, కుమారి ఎన్. సి. సాయి సంతోషి, 
వయొలిన్: కుమారి ఎమ్. శ్రీరమ్య, వీణ: శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి, మృదంగం: శ్రీ మండపాక రవి, ఘటం: శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు, వ్యాఖ్యానం: శ్రీ పిళ్ళా రమణమూర్తి 


రామో విగ్రహవాన్ ధర్మః. వాల్మీకి మహర్షి తన కావ్య కథా నాయకుడిలో ఉండాలనుకున్న పదహారు సుగుణాలను నారదుడికి చెప్పి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నారదుడు అరవైనాలుగు సుగుణాలతో మూర్తీభవించిన దశరథ నందనుడైన శ్రీరాముని గురించి వర్ణించి, ఆతని కథని సంక్షిప్త రామాయణంగా గానం చేసి వెళ్ళాడు. అలాంటి ధర్మాదర్శ మూర్తి, శ్రీరామని చరిత్రను శ్రీమద్రామాయణంగా ఆరు కాండలతో, ఇరువదినాలుగు వేల శ్లోకాలతో భారతావనికి కడు రమణీయంగా అందించారు వాల్మీకి మహర్షి. నారదుని చేతనే ప్రశంసించబడి స్వరార్ణవం అనే సంగీత గ్రంధాన్ని బహుమతి గా పొందిన శ్రీ త్యాగరాజ స్వామి తనకీర్తనలలో శ్రీ రాముని సద్గుణ సంపదను వర్ణించారు. వారి రచనలు పదహారు కీర్తనలను ఏర్చి కూర్చి శ్రీరామ గుణగానం చేసి "సుగుణాభిరామం"గా  పొందుపరచారు. 

ఆవిష్కరణ సభ ముగిసిన పిదప మృదంగ విద్వాంసులు శ్రీ మండపాక రవి బృందం చే లయవిన్యాసం కార్యక్రమం ఆహుతులను అలరించింది . శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ గారు వయొలిన్ పైన, శ్రీ ఎమ్ . సూర్య ప్రసాదరావు గారు ఘటం పైన , గొట్టిముక్కల వెంకటేష్ మోర్సింగ్ తోనూ సహకరించారు.
పూర్తిగా చదవండి...

Sunday, December 1, 2013

బాల మేధావులు

ముఖేః  ముఖేః  సరస్వతి అంటారు. సరస్వతీ కటాక్షానికి చిన్న, పెద్దా తేడా లేదు. ఇప్పుడు మనం చూడబోయే చిన్నారులు అసాధారణమైన ప్రతిభా పాటవాలను అతిచిన్న వయస్సులోనే కనబరుస్తున్నారు. పెద్దవాళ్ళు ఎంతో సాధనతో కాని చేరలేని స్థాయి ఈ చిచ్చర పిడుగులకి స్వతస్సిద్ధంగా వచ్చింది. ఈ పుట్టుకతోనే ఆయా విద్యలని ఔపోసన పట్టేసారా, లేక విద్యాధిదేవతే వీరి రూపంలో ప్రభవించిందా అనిపించేలా వుంది ఈ బాలమేధావుల ప్రతిభ! వారికి విద్యనేర్పుతున్న గురువులను సైతం విస్మయానికి గురిచేస్తూ ఆయావిద్యల్లో దినదిన ప్రవర్ధమానమౌతూ  రాణిస్తున్నారు. 
 ****
 
Name: Keith O' Dell, Pool Playing Prodigy
5 ఏళ్ళ వయసుకే ప్రొఫెషనల్స్ కి దీటుగా బిలియర్డ్స్ / పూల్ గేమ్ లో అసమాన ప్రతిభను కనబరుస్తున్నాడు.
His parents play pool, his grandparents play pool, the family even eats dinner on the pool table. His father says Keith was "born to play pool." The question is, how will his incredible talent effect the life ahead of him? 
 ****

 
Gavin George అనే ఈ కుర్రవాడికి తొమ్మిదేళ్ళు . పియానో వాయించే తీరు చూడండి ..! ఆ వేళ్ళు పియానోమీద ఎలా పరుగెడుతున్నాయో ..!! ఆ చిట్టి బుర్రలోనుంచీ అంత అద్భుతమైన సంగీతం  ఎలా జాలువారుతోందో..! సాధారణంగా పియానో వాయించే వాళ్ళు, తాము వాయించబోయే Composition యొక్క స్వర రచన ని ఎదురుగా పెట్టుకొని చూసి వాయిస్తారు. గమనిస్తే ఆ కుర్రాడికి ఎదురుగా నోటేషన్లూ, నోట్సులూ ఏమీ లేవు. ఎంత క్లిష్టమైనదైనా ఒకసారి బుర్రలోకి ఎక్కిందా, ఇక స్వర రాగ గంగా ప్రవాహమే !!




తనిష్ అబ్రహం  అనే ఎనిమిదేళ్ళ ఈ బుడతడిని గురించి నే చెప్పడమెందుకు, మీరే చూడండి..!!

వీళ్ళే కాక మరెంతో మంది బాల మేధావులని మనకు THNKR వారు పరిచయం చేస్తున్నారు. చూసి ఆనందించండి .
Videos are created and produced by @radical.media, THNKR gives you extraordinary access to the people, stories, places and thinking that will change your mind.
మరిన్ని వీడియోలు ఇక్కడ.. : http://www.youtube.com/playlist?list=PLB1860C67A2998C0B
****
అయితే మనదేశంలో మారథాన్ పరుగులో తన సత్తా చాటి తన చిన్నతనంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరీకి చెందిన బుధియా మాత్రం ఇప్పుడు  చాలా సాధారణమైన జీవితం గడుపుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిన్నతనం లో అతడు సాధించినది సాధారణమైనది కాదు. తన నాలుగో ఏటనే 40 మైళ్ళు పరుగెత్తిన ఘనత అతని సొంతం. కానీ తరువాత కాలంలో మెల్లగా తెర మరుగైపొయాడు. అతని ప్రతిభను గుర్తించి సానబెట్టి వెలుగులోకి తెచ్చిన గురువు బిరించి దాస్ కూ కన్న తల్లి కీ మధ్య ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన గొడవలూ, రాజకీయ నాయకులూ, ప్రభుత్వ ఉద్యోగులూ, మీడియా  చేసిన హడావిడీ, పిల్లవాడి భవిష్యత్తు మీద మానవ హక్కుల సంఘాల వారి ఆందోళనల పర్యవసానంగా,  కోర్టు తీర్పుల దరిమిలా అతన్నోఅకాడమీ లో ప్రభుత్వ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగేటట్లు ఏర్పాటు చేసేసి చేతులు దులిపేసుకున్నారు. తరువాత కోచ్ బిరించి దాస్ హఠాత్తుగా హత్యకు గురయ్యాడు. కారణాలు ఏమైనా ఇప్పుడతను చాలా సాదా సీదాగా మొక్కుబడి శిక్షణ తీసుకుంటున్నాడు. చిన్నప్పుడు చూపిన ప్రతిభా పాటవాల్లో లవలేశమైనా కనబరచలేక పోతున్నాడట. అతన్ని ప్రత్యేకంగా గుర్తించడమే మానేసినప్పుడు శిక్షణ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది .
 ఏమైనా భవిష్యత్తులో భారత దేశం గర్వించగలిగే  ఒక క్రీడాకారుడు కనుమరుగైపోయాడనేది మాత్రం కఠోర సత్యం.



పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)