Sunday, October 11, 2009

మౌనమె నీ భాష ఓ మూగ మనసా …

పాట : మౌనమె నీ భాష ఓ మూగ మనసా …
సినిమా : గుప్పెడు మనసు [1979]
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
రచన: ఆచార్య ఆత్రేయ
పాడినవారు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి
-----------
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … [2]
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు..
కల్లలు కాగానె కన్నీరౌతావూ..
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … ఓ మూగ మనసా

చరణం 1
-----------------
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు..
నాటకరంగనివే.. మనసా.. తెగిన పతంగానివే..
ఎందుకు వలచేవో.. ఎందుకు వగచేవో..
ఎందుకు రగిలెవో.. ఎమై మిగిలెవో.. [2]
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … ఓ మూగ మనసా...

చరణం 2
-----------------
కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు..
ఊహల వుయ్యలవే.. మనసా.. మాయల దెయ్యనివే..
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు..
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు.. [2] [మౌనమె]
పై పాట వినడానికి ఈ లింక్ క్లిక్ చెయ్యండి.. http://www.youtube.com/watch?v=_fhR8g_oj6g

No comments:

Post a Comment

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)