forward it until it reaches the PM
అదీ విషయం!! అంతేనా అనేశారా..? చిన్న నవ్వు కూడా వచ్చిందా?? మావాడే.. సరీగా అర్ధం చేసుకోడు..! ఆవేశం ఎక్కువ..!!
అంతేనా.. అంటే ఇంకా వుందండీ..! అంటూ మరో ఇన్ని ఏకరువు పెడతాడు..!! ఇలాంటి చిన్న చిన్న విషయాలని భూతద్దం తో చూసి బుర్రపాడుచేసుకుంటాడు. ఈ sms చూసి నేను నవ్వొచ్చిందంటే.. వాడు బ్లడ్ బాయిల్ అయిపోతోందంటాడు..! PM గారు పాపం ఆయనే బోల్డు తలనెప్పుల్లో వుంటే ఇంకా ఇబ్బంది పెడతానంటాడు..వీడేం బాధ్యత గల పౌరుడండీ..!!
ఇప్పుడూ..
అట్టహాసంగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది...'వెయ్యో పదో లంచం తీసుకుంటూ red handed గా పట్టుబడ్డ ఫలానా..ACB వలలో చిక్కిన వైనం..' మొహం దాచుకుంటూ.. కెమెరా కంట పడకుండా తప్పించుకొనే ప్రయత్నం లో ఉన్న సగటు ఉద్యోగి.. !! ఆ మొహం సరిగ్గా కనపడేలా చేతుల్ని అడ్డం తీసే అధికారులూ..!! రోజంతా అదే చూపిస్తారు..!!! ఇంకో పక్క లక్షల కోట్ల స్కాం లకు సూత్రధారులు..పాత్రధారులూ ఐన మన నాయకమ్మన్యులు..!! సాక్ష్యాలు అన్నీఎదురుగా కనిపిస్తున్నా...
బోరవిరుచుకొని మరీ 'నాకేమీ తెలీదు..ఇదంతా ప్రతిపక్షాల కుట్ర...' అని దబాయించేసి ( సారీ..ఉన్నమాట చెప్తే, అది 'నిజం' అవుతుంది కానీ.. దబాయింపు ఎందుకవుతుందీ?? అంచేత 'వక్కాణించి' అని చదూకోండి.. ) నవ్వుతూ..జోకులేస్తూ..కాలరెగరే
'కక్కుర్తి పడితే కడుపైనా నిండాలంటారు'... ఈ సామెత 'పై ఇద్దర్లో' మొదటాయనకి తెలిసినట్టు లేదు..బొత్తిగా మొహమాటం..!!
రెండో అతను ధర్మదాత !! తాను తినీ మరో పదిమందికి పెట్టే పుణ్యాత్ముడు..!! ఆ సామెతని పదిసార్లు చదూకొని మరీ తత్వం బోధపరుచున్న (స్వయం)కృషీవలుడు !! 'దేశాన్ని దోచేస్తున్నారో' యని అరవక్కర్లేదు కనీసం సణుగుడు వినిపించినా కూడా కారుదిగి మరీ ' చట్టం తన పని తాను చేసుకు పోతుంది..ఈ స్కాం తుదికంటా దర్యాప్తు జరిపించి..ఎంతటి వాడి మీదైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చే పెద్దమనిషి!!
దేశంలో ఇలాంటి మామూలు విషయాలకి ఆశ్చర్యపోయి, నోరెళ్ళబెట్టి, తెగాలోచించేసి, ఆవేశం తెచ్చుకోడం ప్రయోజకత్వం కాదురా అబ్బాయి అంటే మా వాడికి అర్ధం కాదేం...?? పాయింటు సరిగ్గా కాచ్ చేసినట్టు లేదు ..
బస్సు స్టాప్ లో జేబుకోడుతూ ఒక దొంగ దొరికాడనుకోండి..వాడిని అక్కడే స్తంభానిక్కట్టేసీ దేహశుద్ధి చేస్తాం..! కొన్నిప్రాంతాల్లో చచ్చేదాకా కొడతారు. అది మన జన్మహక్కు కదా..!! అదే ఏ MLA గారో, ముఖ్యమంత్రిగారో.. ఒక పెద్ద స్కాం చేసారనుకోండి..పాపం పదవి కూడా పోయిందనుకోండి..వారిని నెత్తి నెక్కించుకొని ఓటేసి మరీ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి గానో కేంద్ర మంత్రి గానో..ప్రోమోట్ చేసేసి వారి ప్రయోజకత్వానికి..అంగీకార ముద్ర వేసేస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా పెద్ద స్కాం చేసేసరికి.. చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బలాగా పాతది మర్చిపోతాం..!! ఈ పెద్దమనుషులంత గణిత శాస్త్ర వేత్తలు మరొకళ్ళు లేరు. అంకెల్లో ఒకదాని కంటే పెద్దది ఇంకోదాన్ని ఉపయోగం లోకి తెస్తున్నారు. కొత్త అంకె పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలా అని మన లెక్కెట్టుకొనే లోపల ఇంకా పెద్దది వాడుక లోకి తెచ్చేస్తున్నారు. ఈ తరహా applied mathematics మామూలు గణిత శాస్త్రవేత్తలకి చేత అవుతుందా చెప్పండి??
అయిదారేళ్ళ క్రితం 12 కోట్లు సోమ్ములుపోనాయి మరేటి సేత్తాం అంటూ మనకంటే ఎక్కువ ఆశ్చర్యం, అమాయకత్వం (ప్రెస్ మీట్ పెట్టి మరీ...) ఒలకబోసిన మంత్రి గారిని చూసి గుండెలు బాదేసుకున్నాడు మావాడు..!! ఇప్పుడీ లక్షా డెబ్భైఆరు వేల కోట్లు స్కాం చూసి ఏమైపోతాడో.. పాపం !!! నేనంటానూ...అయిదారేళ్ళలో 12 కోట్ల టర్నోవర్ ని, సున్నాలు చుట్టలేనంత స్థాయికి తీసుకెళ్లడం.. ఆహా!! ఏం ఘనత..ఏం అభివృద్ధి...!!!
ఇలాంటివి చూసీ జీర్ణించుకోలేక ఏదోరకంగా తన గొంతు విప్పాలనిపించీ బుల్లి తెర పంచాయితీకి (అదే మన TV Talk Show) వెళ్ళాడు. లోకల్ కాదండోయ్...నేషనలే!! అంత పేరున్నవాడు కాదు కాబట్టీ ప్రేక్షకుడిగా రానిచ్చారు. పానెల్ సభ్యులుగా ప్రముఖ రాజకీయ పార్టీల నుంచీ పేరెన్నిక గన్న పెద్దలూ, మేధావులూ..విచ్చేశారు. టాపిక్ మొదలైనదే ఆలస్యం.. అందరూ ఒకటే అరుపులూ, కేకలూ.. ఎవరేం మాట్లాడుతున్నారో ఏమీ అర్ధం కాలేదు. ఈలోగా బ్రేక్...! విపక్షం వాళ్ళు జరిగిన స్కాం గురించి అడిగితే మీకసలు అడిగే అర్హత లేదన్నారు...ఈ పక్షం వాళ్ళు! మీ నిర్వాకం ముందు మాదెంతని కడిగేశారు..! జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని వీరంటే.. విషయం అంత పెద్దదేమీ కాదని తేల్చేసారు..!! (దీనికన్నా పెద్దది వండి వార్చడానికి రంగం అప్పటికే సిద్ధం అవుతోందేమో!!) ఒకవేళ చెయ్యవలసి వస్తే మీ హయాం లో జరిగినవన్నిటి మీదా దర్యాప్తు చేసినతర్వాత మా వంతంటారు..!! ఏంకర్ తన దగ్గరున్న సాక్ష్యాల లాంటి documents అన్నీ ఏకరువు పెడితే 'అవన్నీ కోర్టు, దర్యాప్తు సంస్థల పరిధి లో వున్నాయి కాబట్టీ' మాట్లాడకూడదంటారు. . రాజ్యాంగ వ్యవస్థని, చట్టాల్ని మరింత పటిష్టం చేయాలంటారు..మళ్ళీ ఇంకో బ్రేక్..!! తర్వాత ప్రేక్షకుల వంతు..ప్రశ్నలడిగారు...సమాధానం మాత్రం లేదు..! మావాడూ అడిగాడు... అందరూ ఘొల్లున నవ్వారు. మొహమాటానికి మావాడూ నవ్వాడు. అన్ని లక్షల కోట్ల వ్యవహారాన్నీ సింపుల్ గా నవ్వులతో ముగించి...గట్టిగా చప్పట్లు కొట్టేసారు...!! అందరికీ చెయ్యిచ్చి... స్వపక్షం, విపక్షం చెట్టా పట్టాలేసుకొని...వారి వారి వాక్పటిమని తలుచుకుంటూ గర్వంగా కారేక్కేసారు..!!! మనం మళ్ళీ మన అలవాటైన ప్రేక్షక పాత్ర లో జీవిస్తూ తరిస్తాం. *****
ఇప్పుడే ఇంకో SMS వచ్చింది :
Most of the 1st Class students get technical seats, become doctors and engineers.
some of the 2nd class, pass MBA become Administrators and controll the 1st class!
some of the 3rd class enter politics, become ministers and control them both..!!
and some of the failures join the under world and control them all....!!!
శుభం!
దొరికాడండి మాకింకొక ఆన్ లైన్ రాజకీయ వ్యంగ్య రచైత!!
ReplyDeleteఅదుర్సో అదుర్స్ ...
ప్రజలంతా బెదుర్సో బెదుర్స్ ..
మరింకొందరు నిదుర్సో నిదుర్స్ ...
మరి నాయకమ్మన్యులు ముదుర్సో ముదుర్స్ ...
mavayya nuvvu superb ga cheppav
ReplyDeleteVery well written Radhe Syaam. Keep it up.
ReplyDeleteరాధేశ్యాం గారు, రాజకీయ ప్రేక్షకుడు పోస్ట్ చూసా.దానికి స్పందన ఏముంటుంది వేదన తప్ప నిజాలు చక్కగా వ్రాసారు. రాజకేయ కురుక్షేత్ర మహా నాటకంలో... ప్రభుత్వాలు కౌరవ పాత్ర ధారులు, ప్రతిపక్షాలు కృష్ణుడు లేని పాండవులు(వెంట ధర్మం లేదన్నమాట.) చక్కగా యుద్ధం జరుగుతోంది. పేపర్లు, మీడియాలు, వార్తలు...ఒకటనేమిటి అన్నిటి ద్వారా చూసేస్తున్నాం...అరుగుల మీద కూర్చుని చర్చించేస్తున్నాం... అభిప్రాయాలు చెప్పేసుకుంటున్నాం...ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని తీర్మానాలు చేసేస్తున్నాం...బయటికి వచ్చిన పాత్రధారులను చేతులు కలిపి అద్భుతం అన్నాం.. ఆ పాత్రకి మీరే 'న భూతో న భవిష్యతీ అన్నాం...వారు ఆప్యాంగా చిరునవ్వు నవ్వినా అదే మహా ప్రసాదం.మేకప్పులు తీసేసి, కప్పులు పట్టుకుని,చెట్టాపట్టాలేసుకుని వెళ్ళిపోయారు కౌరవులు పాండవులూ ఒకే వేన్లో...ఈనాటకం నిత్యం... ప్రజల గురించి nenu చెప్పకూడదు కాని నేను మారతానా మారను. మళ్ళీ వారినే నెగ్గిస్తాను.. నచ్చలేదూ ఓటెయ్యను.అదేదో ఘన కార్యంలా. ఏమైతేం నాకేం అనే మనస్సు మార్దు.. మీడియా వళ్ళు, పేపర్ల వాళ్ళు భూత కల్పనలు, అభూత కల్పనలూ చేస్తునే వుంటారు...మన అరుగులే మనకి అసెంబ్లీలు..చర్చలు ..అంతవరకే పరిమితం. టీవీ లు మానేసి, పేపర్లు మానేస్తే ప్రచారం తగ్గి కొత్త వాళ్ళు ప్రాక్టీస్ పెట్టరు కాబట్టి కొంత తగ్గుతుందేమో...అంతా కాదండోయ్.
ReplyDelete