
ఈ రోజు నవయుగ వైతాళికుడు, తెలుగు కథకి ఆద్యుడు, సంఘ సంస్కర్త, కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావుగారి వర్ధంతి. ఆయన 1915 వ సంవత్సరంలో పరమపదించారు. ఈ తరంలో వరకట్నం గురించే గాని, కన్యా శుల్కం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. ఆ రోజుల్లో కన్యాశుల్కం (పెళ్లి చేసుకొనేటప్పుడు అమ్మాయి తండ్రికి డబ్బులు ఎదురివ్వడం) కారణంగా ఎందరు చిన్నారుల...