మా నాన్నగారి సంరక్షణలో ఈ ఏడాది పూసిన 'మే' పుష్పం ఇది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జూన్ లోనే పూసింది. ఈ మొక్క మాఇంట్లో సుమారు ఎనిమిది - పదేళ్లుగా ఏడాది కొక సారి పూస్తూనే వుంది. రెండు మూడు దుంపల నుండీ పుట్టిన మొక్కలకు నాలుగున్నర సెంటీమీటర్ల వ్యాసంతో మొక్కకొకటి చొప్పున పూవులు పూస్తాయి. పూసిన తరువాత మూడు నాల్గు రోజులకు వాడిపోతుంది. మరో రెండు మొక్కలు పూయడానికి సిద్ధం గా ఉన్నాయి .
అదే పూల కుండీలో 2009 లో పూసిన పువ్వు :
దీనితో పాటు బ్రహ్మకమలం మొక్క కూడా ఉంది మా ఇంట్లో .. దాని పువ్వులు కూడా ఇలాగే అరుదుగా పూసే పువ్వులే..! ఈ క్రింది ఫోటోలో ఉన్న బ్రహ్మకమలం పువ్వు క్రితం సంవత్సరం పూసినది. పొద్దున్న ఫొటో తీసే వేళకి నీళ్ళలో తడిసిపోయి ముడుచుకు పోయింది. రాత్రి పూట విచ్చుకోవడం మొదలై మంచి సువాసనలు వెదజల్లుతూ అరచేతి వెడల్పున పూసే ఈ పువ్వు కూడా మర్నాటికల్లా ముడుచుకు పోతుంది.
ఈ పువ్వు గురించి ఆంధ్ర భూమిలో వచ్చిన వ్యాసం ఇక్కడ: