Sunday, July 10, 2016

పద్యంతో తలచుకున్న అక్షరాన్ని కనిపెట్టడం

జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఈ పద్యం కళ్ళబడింది. శ్రీ దీపాల పిచ్చయ్య  శాస్త్రి గారు వ్రాసినదట
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష** ద్రుహిణ హేళి
(’శశిద్రక్ష’ కు సవరణ క్రింది వ్యాఖ్యలో పొందుపరచడమైనది. గమనించగలరు)


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
తలుచుకోవడంలో కొన్ని నియమాలు పాటించాలి.
అచ్చుల్లో 'అ' మాత్రమే తలుచుకోవాలి. హల్లుల్లో ఙ్, ఞ్, మాత్రం వదిలేయాలి. 
న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు. 
ఒక అక్షరం గుణింతాలు అన్ని ఒకటే అక్షరం కిందే భావించాలి.
ఈ ప్రహేళికకు పరిష్కార వాక్యం ఇది.. 

అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..!
ఇంతవరకు జ్యోతి వలబోజు గారి బ్లాగులో ఉన్నదే..! అయితే వారిచ్చిన పద్యంలో నేను గమనించింది ఇది:

16 నెం. కు ఎదురుగా ఉన్న పాదం లో రెండు వాక్యాలు ఉండాలేమో అనుకుంటున్నాను. ఉదా. కి చ తలుచుకున్నా మనుకోండి. పరిష్కార వాక్యం ప్రకారం 17వ అక్షరం ’చ’. కానీ మీరిచ్చిన సీస పద్యం లో ’చ’ కేవలం ఒకటవ పాదం లో మాత్రమే ఉంది. అదే 16వ పాదం లో ఇంకో వాక్యం ఉండి, దానిలో’చ’ కలిగి ఉంటే 1+16 =17 లెక్క సరిపోయేది.
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పద్యం పూర్తిగా ఎవరి వద్దనైనా ఉంటే క్రింది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు.

3 comments:

  1. ప్రముఖ సాహిత్యవేత్త, విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ పేరి రవికుమార్ గారు వారివద్ద ఉన్న శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నాకరములో పై పద్యాన్ని సరిచూచి ఈ క్రింది సవరణలు తెలియజేసారు:
    1. 16 నెం. కి ఎదురుగా ఉన్న పద్య పాదములో రెండు పాదాలు లేవు. ఉన్న పాదములోనే తప్పు దొర్లింది. ఆ పాదము ఈ క్రింది విధముగా చదువుకొనవలెను.
    **16. దోష శైలేశ ’శచిదక్ష’ ద్రుహిణ హేళి**
    2. తలుచుకున్న అక్షరము హల్లు అయినచో దాని గుణింతమును గణించకూడదు.
    ఇప్పుడు మనం తలచుకున్న అక్షరము ’చ’ అయితే అది 1వ పాదం లోనూ, 16వ నెం పాదము లోను ఉంది కనుక 1+16 = 17. పరిష్కార వాక్యములో 17వ నెం. కు ఎదురుగా ఉన్న అక్షరము ’చ’ కనుక సరిపోయింది.
    పై సవరణలను తెలియజేసిన శ్రీ పేరి రవి కుమార్ గారికి కృతజ్ఞతలు.
    ధన్యవాదాలతో
    రాధేశ్యామ్ రుద్రావఝల

    ReplyDelete
  2. సాహిత్యసౌరభం బ్లాగులో మీరు 'మిత్ర' శతకం‌ లింక్ ఇచ్చారు మీ‌బ్లాగు లోనికి. అదిప్పుడు పనిచెయ్యటం‌ లేదు. దయచేసి ఆ శతకాన్ని మరలా download చేసుకొనే సౌకర్యం కల్పించగలరా?

    ReplyDelete
  3. https://docs.google.com/file/d/0BxfuTNzNYWa2WFVJZjlIWjFybUE/edit
    ఈ లింకు నందు ప్రయత్నించగలరు.
    నా బ్లాగ్ పోస్ట్ లింక్: http://radhemadhavi.blogspot.in/2013/01/1934.html
    నమస్కారం.
    - రాధేశ్యామ్ రుద్రావఝల

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)