నా శ్రీమతి కుసుమకుమారి, శ్రీవారి ఊంజల సేవ (సహస్రదీపాలంకరణ సేవ) లో దాసప్రాజెక్టు లో భాగంగా పురందరదాసు కీర్తనలను 23.03.2021 నాడు ఆలపించింది. కరోనా మొదలవ్వకముందు సరిగ్గా అదేరోజున (మార్చి 23నే కార్యక్రమం ఖరారయ్యింది. కాని మార్చి 22 నుండి దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ ప్రకటించిన కారణంగా రద్దయ్యి మళ్ళీ సరిగ్గా ఏడాది తరువాత అదేరోజున మళ్ళీ పాడడానికి నిర్దేశితమయ్యింది. ఆ మర్నాటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు మొదలవడం చేత ఊంజలసేవని రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో అక్కడ పాడేవారిని సాయంత్రం 4.30 కల్లా అక్కడ సిద్దమవాలని
చెబుతారు. సరిగ్గా 5.00 గంటలకు ప్రత్యక్షప్రసారం మొదలవుతుంది. ఆ సమయంలో
మాం....ఛి ఎదురెండ. కళ్ళెత్తి మీదకు చూడలేనంత..! ఆ అరగంట కార్యక్రమం
పూర్తికాగానే నీడవచ్చేస్తుంది..!
మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రం
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.