అనగనగా ఒక పల్లెటూర్లో ఒకడుండేవాడు. వాడికి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా, బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాణ్ణి ఊర్లో అందరూ నున్నగుండు అని పిలిచేవారు. వాడి అసలుపేరు ఆ ఊర్లో ఎవ్వడికీ గుర్తుకూడాలేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి...! పలకరింపుకీ, వెక్కిరింతకూ, పని చెప్పడానికి, మాట్లాడదానికీ కూడా వాణ్ణి అందరూ "నున్నగుండూ..! , నున్నగుండూ..!!" అని పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషం గా ఉండేది....
Saturday, April 24, 2021
Friday, April 23, 2021
పరీక్షలు బాబోయ్ పరీక్షలు..! (రెండవ భాగం)
మొదటిభాగం చదవని వారు ఇక్కడ చదవవచ్చు.
తరువాత 10వ తరగతి పరీక్షలు: నేను యలమంచిలి GJ కాలేజ్ లో చదువుకున్నాను. ఐతే
ఇక్కడ మొదట యూనిట్ టెస్ట్ స్టోరీ చెప్పాలి..! మాకు ఆ సంవత్సరం రమణరావు
మాస్టారని లెక్కలు చెప్పడానికి వచ్చేవారు..! సిగిరెట్లు విపరీతంగా
కాల్చేవారు. అంత నీట్ గా డ్రెస్సప్ అయ్యేవారు కాదు. ఇన్ షర్ట్ చేసేవారు,
అదికూడా సరిగ్గా ఉండేది కాదు..! బెల్టు పెట్టుకొనేవారు కాదు. గడ్డం కాస్త
నెరిసి ఉండేది, నీట్ గా షేవ్ చేయ్యగా...
Thursday, April 22, 2021
పరీక్షలు బాబోయ్ పరీక్షలు..!! (మొదటి భాగం)
[ఇది ఎప్పుడో 2018 మార్చిలో వ్రాసిన పోస్టు. అప్పుడు పబ్లిష్ చెయ్యలేదు ఎందుచేతనో..! ఇన్నాళ్లకు, మన పిల్లల స్కూలు, కాలేజి పరీక్షలు వాయిదా పడడం లేదా రద్దవడం వార్తలు చూసి ఇది గుర్తొచ్చి పోస్ట్ చేస్తున్నాను. కరోనా కాదుగాని, ఈ క్రింద రాసిన అనుభవాలు అన్ని బొత్తిగా జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సరే..! ఇంక విషయం లోకి వచ్చేస్తాను. ఇది 2018 లో వ్రాసినపోస్టు అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను.]
నిన్నటి నుంచి మా అమ్మాయికి పదవతరగతి పరీక్షలు..!...
Subscribe to:
Posts (Atom)