కొద్దిరోజులు అలా దొరికిందేదో తింటూ అరణ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఒక మునీశ్వరుడు కనిపించి, "నాయనా ఎవరునువ్వు..! ఎందుకీ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు..!? అడవి మృగాల కంట పడ్డావంటే అపాయంకదా..!" అని అడిగాడు.
నాకెవరూ లేరండీ..! నాకసలు బ్రతకాలనే లేదు..! అంటూ వలవలా ఏడుస్తూ ముని పాదాల చెంత కూలబడ్డాడు మన నున్నగుండు(చూశారా..! నేనూ వాణ్ణి అలాగే అనేశాను..! ప్చ్..!).
ఏమైంది నాయనా జీవితం మీద అంత విరక్తి చెందావు..!? అని ముని అడిగితే, మనవాడు మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి వాడికథంతా చెప్పాడు.
"నా గుండుమీద ఎలాగైనా జుత్తు మొలిపించండి స్వామీ.. అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. అప్పుడా ముని "నీ బోడిగుండుమీద జుత్తు మొలిపించడం బ్రహ్మతరం కూడా కాదు నాయనా, దాని సంగతి మర్చిపో..! అని, "ఉండు, నిన్నింక ఎవరు నున్నగుండు అని పిలిచినా వాళ్ళకి తగిన శాస్తి జరిగేలా చేస్తా..!, ఏదీ నీ కుడి చెయ్యి ఇలా చూపించు" అని అడిగి వాడిచేతికి ఒక మంత్రం వేశాడు. ఇకనుంచి నిన్ను ఎవరైనా నున్నగుండూ అని పిలిస్తే వాడి నెత్తిమీద చెయ్యిపెట్టు, తక్షణం వాడి జుత్తు కూడా చక్కగా ఊడిపోయి నున్నగుండుగా మిగుల్తాడు" అని తనదారిన తాను వెళ్ళాడు.
మనవాడు సంతోషంగా తన ఊరి దారి పట్టాడు. ఊర్లోకి ఇంకా చేరకుండానే ఒకడు కనిపించి "ఓరి నున్నగుండూ, బాగున్నావా..!? ఇన్నిరోజులు చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయావు..!?" అని అడిగాడు. వెంటనే మనవాడు.. "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాడి నెత్తిన చెయ్యి పెట్టాడు. వెంటనే అవతలవాడి జుత్తు సమస్తం మాయమై ఒక చక్కని బోర్లించిన కుండలాగా అయిపోయింది. అది చూసిన మన నున్నగుండు ఆనందానికి అవధుల్లేవు. గంతులేస్తూ ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో వీణ్ణి చూసిన అందరూ వీణ్ణి నున్నగుండూ అని పిలవడం, వీడు "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టడం..!
ఆ దెబ్బకి ఊర్లో మూడొంతులమంది, ఆడ, మగ, పెద్దా చిన్నా తేడా లేకుండా నున్నగుండులైపోయారు. వాళ్ళంతట వాళ్ళు ఈ మంత్రం సంగతి తెలియక మనవాడిని నున్నగుండు అని నున్నగుండై పోయినవాళ్ళు కొందరైతే, మరికొందరిని మనవాడే వెళ్ళి మరీ నున్నగుండు చేసి చక్కా వచ్చాడు. అందరూ నున్నగుండు అయిపోయాక ఎవరు అసలు నున్నగుండో తెలియకుండా పోయింది.
ఇదిలా ఉండగా ఒకరోజు మనవాడికి మంత్రం వేసిన మునీశ్వరుడు ఆ ఊరొచ్చారు. ఊళ్ళో ఇలా అందరూ నున్నని గుళ్ళతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, విషయం ఏమిటని ఆరా తీస్తే వాళ్ళు మన కథానాయకుడి సంగతి చెప్పారు. "అరె, నేనిచ్చిన మంత్రాన్ని ఇంతదారుణంగా ప్రయోగించాడా అని కోపంగా, ఎక్కడున్నాడు ఆ నున్నగుండు గాడు అన్నాడు..! ఆ జనంలోనే ఉన్న మన అసలు నున్నగుండు, "నువ్వుకూడా నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ ఆ ముని నెత్తిమీద చెయ్యిపెట్టేశాడు. దెబ్బకి ఆ మునికూడా నున్నగుండై కూర్చున్నాడు.
దాంతో వాళ్ళంతా తమ మొహాలు చూసుకోలేక, మమ్మల్నింకెవరు చూస్తారంటూ తెగ బాధపడుతూ ఉంటే మన మునీశ్వరుడి గురువుగారు ప్రత్యక్షమై బాధపడకండి నాయనా, భవిష్యత్తులో మీరంతా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు, అందరూ మీ బొమ్మలు మాటకి ముందు మాట తరువాతా ఉపయోగిస్తారు, మీ ముఖాలు లేకుండా వాక్యాలు పూర్తవవు అని వరమిచ్చాడు.
😀😁😂😃😄😅😆😇😈😉😊😋😌😍
😎😏😐😑😒😓😔😕😖😗😘😙😚😛
😜😝😞😟😠😡😢😣😤😥😦😧😨😩
😪😫😬😭😮😯😰😱😲😳😴😵😶😷
అదిగో..! ఆ కథలో అలా వరంపొందిన నున్నగుండు గాడి బాధితులే ఇప్పుడు మనకి ఇమోజీలుగా దర్శనమిస్తూ, మన మెసేజ్ లలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి..!
వాళ్ళ తరవాత తరాలవాళ్ళు జుత్తుతో మామూలుగానే ఉన్నారు.
👶👱👦👧👨👩👪👫👬👭
👤👥 🙋🙅🙆🙇🙋🙍🙎💁
అదండి..! నున్నగుండు అలియాస్ ఇమోజీల కథా కమామిషూ..!!
- రాధేశ్యామ్ రుద్రావఝల 🙏🙏🙏
హ హ sooper ,బలే రాసారు 😊😊
ReplyDeleteధన్యవాదాలండీ..!😊😊
Deleteమీ కల్పన బాగుంది రాధేశ్యామ్ గారు.
ReplyDeleteధన్యవాదాలండీ..!😊
Deleteబహురమ్యమైన చమత్కార కథ. బాగుంది.
ReplyDeleteధన్యవాదాలండీ..! 🙏🙏🙏
Deleteఆ తరువాత ఆ ఒరిజినల్ “నున్నగుండు” ఏమయ్యాడు?
ReplyDeleteచాలా ఈజీ. వెళ్ళి ఒక నగల షాపు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ వ్యాపారం తామరతంపరగా అన్ని ఊళ్ళకూ విస్తరిస్తోంది.
🙂🙂
😆😆😆😆😆😆😆😆😆
Delete😄😄😄😄😄😄😄😄
Deleteఅద్భుతమైన చమత్కార కథనం ... నంది శ్రీనివాస్
ReplyDelete😄😄😄ధన్యవాదాలండీ..! 🙏🙏🙏
Delete