మేము పాడిన బుర్రకధ ఎవరు రాసారో దానికి మిగతా భాగం వుందో లేదో ఏమీ తెలీదు. కానీ చిన్నప్పుడే నేర్చుకోవడం వల్ల మా నాలుకల పై ఇంకా అది నాట్యమాడుతూనే వుంది. ట్యూన్అక్కడక్కడ కొంత మర్చిపోయాను. సుమారు పాతికేళ్ళ తరువాత ఆశ్చర్యంగా మా అమ్మగారి పూజా పుస్తకాలలో ఈ క్రింది భాగం మాత్రం దొరికింది. దాని సాహిత్యం బాగున్నందు వల్ల అందరి తో పంచుకోవాలనిపించింది:
భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ'
ప్రార్థన:
అంబా జగదంబా నమో! నమో భారతాంబా జగదంబా నమో!! //అంబా!//
సకల విద్యలకు తల్లివనుచు ఈ యుర్విజనులు నిన్ను వేడుకొందురు - 2
అజుని రాణి మమ్మదరించి మా వాక్కులందు వసియించుమమ్మ.. //ఓ అంబా!//
ఓ అంబా జగదంబా నమో! నమో భారతాంబా జగదంబా నమో!!
వాణీవైనా నీవేనమ్మా జగదంబా..! మాకభయమిచ్చి బ్రోవవమ్మా శారదాంబా..!!
అమ్మలగన్న అమ్మావమ్మా జగదంబా..! మాకానందం చేకూర్చవమ్మా శారదాంబా..!!
శబ్ద దోషములు లేకుండగా జగదాంబా ..! వాక్సుద్ధిగాను పలికించవమ్మా శారదాంబా..!!
తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
*****
వేదసారమిది భగవద్గీత ఇహపరములకూ బంగరు బాట - 2
ఆది దేవుడగు నారాయణుడు ముదమున పార్థున కుపదేశించెను .//వేదసారమిది//
ధర్మ క్షేత్రమగు కురుక్షేత్రమున పోరుకు నిలచిన నా కురు వీరుల
పాండునందనుల వివరములన్నీ అరమరికుంచక తెలుపుము నాకు.. //వేదసారమిది//
అడిగిన కురుపతి ద్రుతరాష్ట్రునకూ సంజయుదంతట తెలిపె విశదముగ...
దుర్యోధనుడట గురువును చేరి పలికిన పలుకులు వినిచెను రాజుకు.. //వేదసారమిది//
వచనము: ఇట్లు ద్రుతరాష్ట్రుండడుగాగా సంజయుండేమంటున్నాడయ్యా అంటే..??
వంత : ఏమంటున్నాడయ్య...!!??
రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా..!!
పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నియుంట జూచీ - 2
దుర్యోధనుడూ వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపముకూ - 2 //రాజరాజ మహారాజా//
వచనము: వెళ్లి ఏమంటున్నాడయ్యా అంటే..??
వంత : ఏమంటున్నాడయ్య...!!??
దేవ దేవ గురుదేవా రణజయ భావా వినుమయ్యా..
//తందానా తందాన తందానా దేవవందనానా //
సర్వ సమృద్ధంబగు ఆ పాండవ సైన్యము చూచావా - 2
ఆ దండున భీమార్జున సములై అలరుచున్నవారూ
ధృష్టకేతువూ, మత్స్యవిభుండూ, ద్రుపదుడు, పురజిత్తూ
శైభ్యుడు, సాత్యకి, కుంతిభోజుడూ, చేకితానుడుండే
ఉత్తమోజుడూ, కాశీ రాజూ, యుధామన్య నృపతీ //దేవ దేవ గురుదేవా//
ఆహవ నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులునూ
ప్రముఖ వీరులూ మహారథులునూ బలవంతులు గలరూ //దేవ దేవ గురుదేవా//
మన సైన్యములో ముఖ్యులు తెలిపెద..
తాము, భీష్ముడూ, కర్ణుడు కృపుడూ.. // తందానా తందానే తందానా //
అశ్వత్దామా భూరీశ్రవుడూ
జయధ్రదుండూ వికర్ణాదులూ // తందానా తందానే తందానా //
నానిమిత్తమై తమ ప్రాణాలను నాశనమొనరింప //తందానా తందానే తందానా దేవవందనానా//
పోరాటంలో నిలచినారయా పూజ్యులు ప్రియులంతా //తందానా తందానే తందానా దేవవందనానా//
మా పితామహుడూ భీష్ముడు సేననే మాడ్కి గాచువాడో //దేవ దేవ గురుదేవా//
తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
వచనము: అని ఒకమారు దుర్యోధనుడు భీష్ముని వైపు చూచాడు. వెంటనే..
వంత : ఏం జరిగింది....!!??
రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా..!! - 2
కురు వృద్ధుండగు భీష్ముడు వెంటనే మురిసిపోయినాడూ - 2 //రాజరాజ మహారాజా//
దుర్యోధనుడూ సంతసించుటకు భం భం భం అనుచూ
శంఖనాదమును చేసినాడు నిశ్శంకమయ్యే సేనా //రాజరాజ మహారాజా//
కౌరవ సేనలో భేరీరవములు గ్రమ్ముకున్నవండీ
ఫణవానకములు భూమ్యాకాశములను బ్రద్దలు చేసాయీ //రాజరాజ మహారాజా//
వచనము: అప్పుడేం జరిగిందయ్యా అంటే..??
వంత : ఏం జరిగింది ...!!??
తెల్లగుర్రముల రధమును త్రోలే నల్లనయ్య జూచీ - 2
పాంచజన్యమును మ్రోగించగనే పార్ధుడు తలఎత్తీ - 2
దేవదత్తమను శంఖమునూదెను దిక్కులెల్ల మ్రోయ - 2 //రాజరాజ మహారాజా//
వచనము: ఇంతే గాక
అనంత విజయము యుధిష్టిరుండూ //తందానా తందానే తందన//
పౌండ్ర శంఖమును భీమసేనుడూ
సుఘోష శంఖము నకులుడూదెనూ
మణి పుష్పకమును సహదేవుండూ
కాశీ రాజూ ద్రుష్టద్యుమ్నుడూ //తందానా తందానే తందన//
తమ తమ శంఖాలన్నిటి నొక్కటే ధాటిగా నూదారూ //తందానా తందానే తందానా దేవవందనానా// -2
ప్రపంచమంతా నిండి యాధ్వనులు ప్రతిధ్వనించాయీ //తందానా తందానే తందానా దేవవందనానా//
కౌరవసేనల గుండెలు వణికీ గబ గబ లాడాయీ
తాకిట ఝం తరితా // తఝం తరితా// తఝం తరితా//
వచనము: అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవసేనను అర్జునుడు చూచి విల్లు నెక్కుపెట్టి శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు..
వంత : ఏమన్నాడయ్యా ...!!??
//తందాన తందాన తానె తందనానా// తందానా తానా తానే తందానా // - 2
చిత్తగించుమా నాదు మనవినీ శ్రీనివాస శౌరీ
రెండు సేనలా మధ్య రధమునూ యుండనిమ్ము కృష్ణా.. //చిత్తగించుమా//
దుర్యోధనునకు ప్రియము కోరినా........................ .....( పేజీ చిరిగిపోయింది.)
వారల చూచెద కన్నులనిండా వ............................. ( పేజీ చిరిగిపోయింది.)
ఎవరెవరలతో పొరవలయునో..................... ............ ( పేజీ చిరిగిపోయింది.)
వచనము: అని ఈ ప్రకారముగా పలికే అ.......................
గుర్రముల రధమును రెండుసేనల మధ్య నిలిపినవాడై................
ఎవరెవర్ని చూశాడయ్యా అంటే....
వంత : ఎవరెవర్ని చూశాడయ్యా ...!!??
తాతల, తండ్రుల, గురువుల, మామల, తమ్ముల, నన్నలనూ...
పుత్రుల, మిత్రుల, పౌత్రుల జూచీ భోరున యేడ్చాడూ...పార్ధుడు భోరున యేడ్చాడూ...
వచనము: ఈ విధంగా దుఃఖిస్తున్న అర్జునుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు..
చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...
బావా కృష్ణా నిలువలేను ఈ భండనమున నేనూ .. //చిత్తగించుమా //
సర్వాంగములూ గజ గజ వణుకుతూ చమటలు పోశాయీ...
ఎండెను నోరూ.. చేతినుండి నా గాండీవము జారే..
శకటము పై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా..
చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...- 2
అంటూ శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ
పార్ధుడు..శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ...
**************
దీనిగురించి ఇంకేమైనా వివరాలు.. తెలిసిన వారు ఎవరైనా వుంటే చెప్పగలరు.
//తందాన తందాన తానె తందనానా// తందానా తానా తానే తందానా // - 2
చిత్తగించుమా నాదు మనవినీ శ్రీనివాస శౌరీ
రెండు సేనలా మధ్య రధమునూ యుండనిమ్ము కృష్ణా.. //చిత్తగించుమా//
దుర్యోధనునకు ప్రియము కోరినా........................
వారల చూచెద కన్నులనిండా వ.............................
ఎవరెవరలతో పొరవలయునో.....................
వచనము: అని ఈ ప్రకారముగా పలికే అ.......................
గుర్రముల రధమును రెండుసేనల మధ్య నిలిపినవాడై................
ఎవరెవర్ని చూశాడయ్యా అంటే....
వంత : ఎవరెవర్ని చూశాడయ్యా ...!!??
తాతల, తండ్రుల, గురువుల, మామల, తమ్ముల, నన్నలనూ...
పుత్రుల, మిత్రుల, పౌత్రుల జూచీ భోరున యేడ్చాడూ...పార్ధుడు భోరున యేడ్చాడూ...
వచనము: ఈ విధంగా దుఃఖిస్తున్న అర్జునుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు..
చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...
బావా కృష్ణా నిలువలేను ఈ భండనమున నేనూ .. //చిత్తగించుమా //
సర్వాంగములూ గజ గజ వణుకుతూ చమటలు పోశాయీ...
ఎండెను నోరూ.. చేతినుండి నా గాండీవము జారే..
శకటము పై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా..
చిత్తగించుమా నాదగు మనవిని శ్రీనివాస శౌరీ ...- 2
అంటూ శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ
పార్ధుడు..శర చాపాలను వదలి రధము పై చతకిలబడ్డాడూ...
**************
దీనిగురించి ఇంకేమైనా వివరాలు.. తెలిసిన వారు ఎవరైనా వుంటే చెప్పగలరు.
వింతైన విషయం. అర్ధం కాని భగవద్గీత శ్లోకాల్ని పిల్లకాయల్తో బట్టీపట్టించి చిలకపలుకుల్లా వల్లె వేయించడం కాకుండా ఆసక్తికరమైన పద్ధతిలో ఇలా నేర్పించడం భలే ఉన్నది.
ReplyDeleteమీ అనుభవాన్ని పంచుకున్నందుకు నెనర్లు
కొత్తపాళీ గారూ,
ReplyDeleteధన్యవాదాలు..ఆ స్ఫూర్తి తోనేమో ఏడవ తరగతి పూర్తయ్యేసరికి.. మేము ఘంటసాల పాడిన భగవద్గీత లోని మొదటి నాలుగు అధ్యాయాలూ ( విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగాలు) శ్లోకాలూ, తాత్పర్యాలూ నోటికి వచ్చేలా సొంతంగా నేర్చుకోగలిగాం.
మీ బ్లాగు కామెంట్లలో 'నెనర్లు'..అని తరచుగా చూస్తూంటాను.. అంటే ఏమిటో..ఎవరు పుట్టించారో ( వారికి వీరతాళ్ళు వేసేసి వుంటారులెండి..!!) తెలుసుకోగోర్తాను.
- రాధేశ్యాం
Thanks కి సమానార్ధకంగా తెలుగులో నెనర్లు అని వాడుతున్నాము. ఈ వాడుకని (నాకు గుర్తున్నంతలో) తొలిసారిగా సూచించినవారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (తాలబాసు) గారు. ఈ వాడుక మీదా విరివిగానే చర్చలూ వ్యంగ్యాలూ ఎకసెక్కాలూ నడిచాయి కొంతకాలంపాటు. చివరికి తేలిందేవిటంటే, ఇది బాగుంది అనుకున్న నావంటి వాళ్ళం వాడుతున్నాము. నచ్చని వాళ్ళు వారికిష్టమైన వాడుకల్నే వాడుకుంటున్నారు.
ReplyDeleteకొత్తపాళీ గారికి,
ReplyDeleteనెనర్లు..ఉత్సుకతతో నిఘంటువు కూడా తిరగేశాను. దొరికింది..ఆ స్నాప్ షాట్ ఇదిగో..
...
...
...
సారీ సార్, పేస్టు అవలేదు.. తెలుగు విశ్వవిద్యాలయం నిఘంటువు (పే.నెం. 476) లో వుంది.
తాలబాసు గారికి కూడా నెనర్లు.. కొత్త పదం పరిచయం చేసినందుకు.
విజ్ఞానవంతులమని భ్రమించే పండితులు కూడా తమకుతోచినవిధంగా,తమపంధాలో అన్వయిస్తున్న ఈరోజుల్లో మీరు చేసిన ప్రక్రియ శ్లాఘనీయం. ఆనంద దాయకం.ఆచరణీయం.విజ్ఞాన దాయక,
ReplyDeleteవినోదాన్ని పంచే ప్రక్రియ ఎన్నుకొన్నందుకు నెనర్లు