
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ "తలపాగా" లను ఏదో ఒక రూపంలో చూస్తాం. ప్రతికూల వాతావరణాల నుంచీ తమను తాము కాపాడుకోవడానికి తలపాగాలను మానవుడు రాను రాను తన జీవన విధానానికి, హోదాకి చిహ్నంగా రూపొందించుకొన్నాడు. పూర్వం మహారాజులు మణుగుల కొద్దీ బరువైన రత్నఖచిత కిరీటాలను పట్టాభిషేక మహోత్సవాల లాంటి ప్రత్యేకమైన సందర్భాలకి...