పద్యాల నడక మీద శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వివరణాత్మకమైన వ్యాసం (ఛందస్సు తో నడక - 3) చూసాక చాలా బోల్డు ఇన్స్పిరేషన్ వచ్చేసి నేనూ ప్రయత్నించాను. ముఖ్యంగా ఆయన చెప్పిన'తాన తాననతాన తాననతాన తాననతాననా' నడక వినగానే మొదట స్ఫురించినది :
అల్లు రామలింగయ్య మీద చిత్రీకరింపబడిన పాట: 'అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె భామినీ'
నేను వ్రాసినది పంపితే వారు దోషాలు ఎత్తి చూపి సరిదిద్దుకోవడానికి సహకరించారు.
కామేశ్వర రావు గారికి, మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది. నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:
నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా
మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా.. కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!
ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము గ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!
రాధేశ్యామ్ గారూ, చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు! అయితే
మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా
అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా
"ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)
బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-) మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది. అన్ని
పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు.
యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా
హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ
యిక్కడ చూడండి:
వృత్త
లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి
చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు
యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా
కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా..
ధన్యవాదాలు గురువుగారూ..! నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగరమథనానికి పూనుకొనేశా..!!
- రాధేశ్యామ్
******************************
తెలుగు పద్యం బ్లాగు నడుపుతున్న శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారికి, వారి బ్లాగులో'సులువుగా పద్యం వ్రాయండి ... ' శీర్షిక నడుపుతున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి, పద్యమంజూష బ్లాగు నడుపుతున్నటేకుమళ్ళ వేంకటప్పయ్య గారికీ నా నమస్సులు..! పద్య రచనా నియమాలను, తత్సంబంధమైన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఔత్సాహికులకు సులభ గ్రాహ్యంగా అందిస్తున్న వీరూ, వీరివంటి మరెందరో మహానుభావులకు వందనాలర్పిస్తున్నాను.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు
సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి
మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన
సాయంత్రం జరిగింది. ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు
కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. ఈరోజు ప్రసారం అవుతుందట ...!
ప్రసార సమయం :
ఈరోజు (తే. 1.04.13) మధ్యాహ్నం 3:00 గం నుంచి 4:00 గం వరకు
******************************************
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు ఈక్రింది లింక్ ను ప్రసార సమయం లో క్లిక్ చేస్తే ప్రసారం అప్పటికప్పుడే చూడవచ్చు.
కార్యక్రమం తరువాత
తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన
భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి,
స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..!
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు
సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమం లో నా శ్రీమతి రుద్రావఝల కుసుమ కుమారి
మరియు బృందం 'నామసంకీర్తన' గానం చేశారు. కార్యక్రమం ఈనెల 18వ తేదీన
సాయంత్రం జరిగింది. ఆరోజు శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు
కావడంతో SVBC చానెల్ లో వీరి నామ సంకీర్తన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించలేదు. మరొక రోజు ప్రసారం అవుతుందట ...!
****************************************** Youtube link
కార్యక్రమం తరువాత తి తి దేవస్థానం వారు కళాకారులందరికీ ప్రసాదాలు ఇచ్చి , శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. కులశేఖర పడి(గర్భాలయపు గడప) వరకు తీసుకువెళ్ళి, స్వామివారికి హారతి ఇచ్చారు. ఆహా..అద్భుతమైన దర్శనం..!
ప్రముఖ వాయులీన విద్వాంసురాలు కన్యాకుమారి గారు కూడా అనుకోకుండా ఆరోజు ఆలయం లో కలిశారు. వారితో పాటే మాకూ స్వామి దర్శనం జరిగింది.
వంద వసంతాల శ్రీపాద పినాకపాణి ఆఫీసు పని మీద టూర్లలో ఉండడంతో గత నాలుగు రోజులుగా పేపరు, టీవీ కి చూడలేదు. ఇవాళ మళ్ళీ తిరుగుప్రయాణంలో శ్రీ శ్రీపాద పినాకపాణిగారికి అంత్యక్రియలు జరిగాయని చదివి, విస్మయానికి లోనయ్యాను. నిజానికి ఈ పోస్టు వ్రాద్దామనుకున్నది శ్రీ పినాకపాణి గారి శతజయంతి సందర్భంగా..! మొదలుపెట్టాను కాని వివిధ కారణాలవల్లపూర్తి చెయ్యలేకపోయాను. అదే పోస్టుని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పూర్తి చెయ్యవలసి రావడం దురదృష్టకరం.
పద్మభూషణ్ మెడల్
కర్ణాటక సంగీత లోకంతో పరిచయమున్న ప్రతి
ఒక్కరికీ సుపరిచితులైన పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డా. శ్రీపాద పినాకపాణి
గారు నేడు తమ నూరవ పుట్టిన రోజును స్వస్థలమైన కర్నూలు లో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా
వారు మంచి హస్తవాసి గలిగిన వైద్యులుగా పేరు తెచ్చుకున్నా సంగీత లోకానికి చేసిన సేవ
మరపురానిది. కర్ణాటక సంగీతం అంటే మద్రాసు, తంజావూరు లాంటి తమిళ నాడుకి చెందిన ప్రాంతాల
వారు మాత్రమే పాడగలరు, వారు పాడినదే వినగలం అనుకొనే రోజుల్లో మన తెలుగువాడైన పినాకపాణి
గారి కచ్చేరీలంటే తమిళశ్రోతలు చెవికోసుకొనేవారంటే వారి గాత్ర మాధుర్యం, విద్వత్తు
ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.
వారి శిష్యులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి
లో పేరెన్నిక గన్న వోలేటి వేంకటేశ్వర్లు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి,
మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మొదలైనవారు. ఇంకా శ్రీమతి సరస్వతీ విద్యార్ధి, వారి కుమార్తె కుమారి లహరి, మల్లాది సోదరుల పేరుతో ప్రసిద్ది చెందిన శ్రీ శ్రీరామ్ ప్రసాద్ , శ్రీ రవికుమార్ గార్ల వంటి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి కర్నాటక సంగీతాన్ని మరిన్ని తరాలు ముందుకు తీసుకుపోయే రాచ బాటలు వేసారు శ్రీ పినాక పాణి గారు. 1993-94లో అనుకుంటా.. (నేను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయిఉంటుంది) నేదునూరి కృష్ణమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారు వ్రాసిన 'అన్నమయ్య పదసౌరభం' పుస్తకానికి ముఖచిత్రం వెయ్యమని అడిగారు. మల్లాది సోదరులతో పరిచయం కలిగింది కూడా శ్రీ నేదునూరి గారి ఇంటివద్దే. అప్పుడే శ్రీపాద పినాకపాణి గారి పుస్తకం 'మనోధర్మ సంగీతం' గురించి వినడం. ఆయన గురించి, ఆ పుస్తకాన్ని గురించీ చెబుతూ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు నాకు దాని వ్రాతప్రతి కాపీని నాదగ్గర ఉంచుకోమని ఇచ్చారు. ముత్యాల్లాంటి పినాక పాణి గారి దస్తూరితో ఉన్న ఆ వ్రాత ప్రతి నా వద్ద ఇంకా భద్రంగా వుంది. తరువాత ఆపుస్తకం తితిదేవస్థానం వారు ముద్రించాక తిరుపతిలో కొనుక్కున్నాను. అలాగే పాణి గారు వ్రాసిన 'నా సంగీత యాత్ర' సంగీత ప్రపంచం లో వారి అనుభవ సారాన్ని క్రోడీకరించి, వర్ధిష్ణు కళాకారులకి స్స్ఫూర్తిదాయకం గా ఉండే ఎన్నో సంగతులని స్పృశించారు.
తితిదేవస్థానం వారిచే నాలుగు భాగాలుగా ముద్రించబడిన 'సంగీత సౌరభం' సంగీత లోకానికే మకుటాయమానం.
వారి శతజయంత్యుత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం, వారి శిష్య ప్రశిష్యులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతులమీదుగా వైభవంగా జరిగింది. ఆ రోజు వారి స్వగృహం లో జరిగిన అభినందన మరియు సన్మాన కార్యక్రమ విశేషాలు ఈ లింక్ నొక్కి చూడండి.
శ్రీపాద వారివే ఇంకొన్ని ఫోటోలు:
వివిధ పత్రికలలో శ్రీ పినాక పాణి గారి శతజయంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు ఒక్క చోటే మనందరికోసం:
అదే సందర్భంగా దూరదర్శన్ సప్తగిరి వారు పినాకపాణి గారితో నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. (చాలా పాతది అనుకుంటా.. ! కనీసం ఇరవై ఏళ్ల క్రితంది. దానిలో వారి దినచర్య మొత్తం చూపిస్తూ, శిష్యులతో వారి పాఠాలు, డాక్టరు గా వారి ప్రాక్టీసు, వ్యాయామం మొదలైనవి చూపించారు.
దీనితో పాటు నాకు చాలా ఇష్టమైన ఇంకొక శివ స్తోత్రం డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు గానం చేసిన శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం . దీని ఆడియో ఫైల్ నాదగ్గర ఉండేది కానీ సమయానికి కనిపించలేదు . మిత్రులెవరి వద్దనైనా ఉంటే షేర్ చెయ్యగలరు .
*************************************
పైన కనిపిస్తున్న రెండు బొమ్మలూ సుమారు 12 ఏళ్ళ క్రితం నేను వేసినవే.. !
శివ గంగా సంగీత పరిషద్, హైదరాబాద్ వారికి వేసిన బొమ్మ.. మొదటిది
చిత్తు..రెండోది ఫెయిర్ చేసినది.
శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు అడిగి
వేయించుకున్నారు.
************************************* విజయనగరం లో వెలసిన శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయ విశేషాలని గురించి ఇదివరకు నా బ్లాగులో వ్రాసిన శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం చదవడానికి పై లింక్ మీద నొక్కండి
___________________________ ఈ బ్లాగ్ పోస్ట్ ప్రింట్ తీసుకోవడానికి - మొదట 'పూర్తిగా చదవండి..'పై నొక్కి పేజీ పూర్తిగా ఓపెన్ ఐన తరువాత పై బానర్ మీద నొక్కండి
మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:
నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా