Sunday, November 3, 2024

       మేఘవిస్ఫూర్జితవృత్తముశిరః కల్హారామోదవశ మధులిట్ఛ్రేణి ఝంకారముల్, శ్రో/ణి రాజత్కాంచీ కింకిణి రణితముల్, స్నిగ్ధవక్షోరుహద్వం/ద్వరోధోలోలత్ కచ్ఛపిముఖ మృదుక్వాణముల్.. సర్వనాదై/కరూపాత్మౌజ శ్శ్రీ బయలు పరుపన్ గ్రాలు వాణిన్ భజింతున్!(అవధానిపితామహ శ్రీ సి వి సుబ్బన్నశతావధానిగారు.. 1971 నెల్లూరు శతావధానములో..వాగ్దేవీ...
పూర్తిగా చదవండి...

Thursday, March 3, 2022

బ్రహ్మానందంగారి కారులో నేను..!

మీకు ఎప్పుడైనా హాస్యనటుడు బ్రహ్మానందంగారి కారు ఎక్కే అవకాశం వచ్చిందా..!? నమ్మండి నమ్మకపొండి..! నాకొచ్చింది.నేను ఇంటర్ పూర్తయి ఆర్కిటెక్చర్ లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం..! అప్పటికి ఇంకా మాకాలనీలో రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం సాయంత్రాలలో..! ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఉండగా మా పక్కనే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆగింది. కారులో వెనుక సీటులో...
పూర్తిగా చదవండి...

Friday, February 25, 2022

ఈనాడు దినపత్రికలో 80 లలో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్

కోరాలో "ఈనాడు దినపత్రికలో 80 లలో మూడో పేజీలో కింద బొమ్మల కథలు వచ్చేవి. అవి చదివిన జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడవి ఎక్కడైనా దొరుకుతాయా?" అన్న ప్రశ్నకు నేను వ్రాసిన సమాధానం:80 లలో ఈనాడులో ప్రతి రోజూ అమర చిత్ర కథ వాళ్ళ పుస్తకాలన్ని(అప్పట్లో అలా అని తెలియదు) తెలుగులో అవే బొమ్మలతో వచ్చేవి సీరియల్ లాగా..! 30 - 32 రోజులు నడిచేది. చాలా పిచ్చిగా చదివేవాళ్ళం....
పూర్తిగా చదవండి...

Saturday, April 24, 2021

👨‍🦲 నున్నగుండు కథ..! 👨‍🦲

అనగనగా ఒక పల్లెటూర్లో ఒకడుండేవాడు. వాడికి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా, బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాణ్ణి ఊర్లో అందరూ నున్నగుండు అని పిలిచేవారు. వాడి అసలుపేరు ఆ ఊర్లో ఎవ్వడికీ గుర్తుకూడాలేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి...! పలకరింపుకీ, వెక్కిరింతకూ, పని చెప్పడానికి, మాట్లాడదానికీ కూడా వాణ్ణి అందరూ "నున్నగుండూ..! , నున్నగుండూ..!!" అని పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషం గా ఉండేది....
పూర్తిగా చదవండి...

Friday, April 23, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..! (రెండవ భాగం)

మొదటిభాగం చదవని వారు ఇక్కడ చదవవచ్చు. తరువాత 10వ తరగతి పరీక్షలు: నేను యలమంచిలి GJ కాలేజ్ లో చదువుకున్నాను. ఐతే ఇక్కడ మొదట యూనిట్ టెస్ట్ స్టోరీ చెప్పాలి..! మాకు ఆ సంవత్సరం రమణరావు మాస్టారని లెక్కలు చెప్పడానికి వచ్చేవారు..! సిగిరెట్లు విపరీతంగా కాల్చేవారు. అంత నీట్ గా డ్రెస్సప్ అయ్యేవారు కాదు. ఇన్ షర్ట్ చేసేవారు, అదికూడా సరిగ్గా ఉండేది కాదు..! బెల్టు పెట్టుకొనేవారు కాదు.  గడ్డం కాస్త నెరిసి ఉండేది, నీట్ గా షేవ్ చేయ్యగా...
పూర్తిగా చదవండి...

Thursday, April 22, 2021

పరీక్షలు బాబోయ్ పరీక్షలు..!! (మొదటి భాగం)

[ఇది ఎప్పుడో 2018 మార్చిలో వ్రాసిన పోస్టు. అప్పుడు పబ్లిష్ చెయ్యలేదు ఎందుచేతనో..! ఇన్నాళ్లకు, మన పిల్లల స్కూలు, కాలేజి పరీక్షలు వాయిదా పడడం లేదా రద్దవడం వార్తలు చూసి ఇది గుర్తొచ్చి పోస్ట్ చేస్తున్నాను. కరోనా కాదుగాని, ఈ క్రింద రాసిన అనుభవాలు అన్ని బొత్తిగా జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సరే..! ఇంక విషయం లోకి వచ్చేస్తాను. ఇది 2018 లో వ్రాసినపోస్టు అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను.] నిన్నటి నుంచి మా అమ్మాయికి పదవతరగతి పరీక్షలు..!...
పూర్తిగా చదవండి...

Monday, March 29, 2021

తిరుపతి యాత్ర - ఊంజలసేవ

నా శ్రీమతి కుసుమకుమారి, శ్రీవారి ఊంజల సేవ (సహస్రదీపాలంకరణ సేవ) లో దాసప్రాజెక్టు లో భాగంగా పురందరదాసు కీర్తనలను 23.03.2021 నాడు ఆలపించింది. కరోనా మొదలవ్వకముందు సరిగ్గా అదేరోజున (మార్చి 23నే కార్యక్రమం ఖరారయ్యింది. కాని మార్చి 22 నుండి దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ ప్రకటించిన కారణంగా రద్దయ్యి మళ్ళీ సరిగ్గా ఏడాది తరువాత అదేరోజున మళ్ళీ పాడడానికి నిర్దేశితమయ్యింది....
పూర్తిగా చదవండి...

Sunday, March 28, 2021

శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో నాకు నచ్చిన పద్యం

శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా) నటీ నటులు:  కృష్ణుడు: ఎన్ టి రామారావు,  నారదుడు: కాంతారావు,  సత్యభామ: జమున, రుక్మిణి: అంజలీదేవి, అష్టమహిషులు: కృష్ణకుమారి తదితరులు. రచన: దైత గోపాలం సీ.సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు                 ధనమున్నదే...
పూర్తిగా చదవండి...

Sunday, January 26, 2020

నేను 30 ఏళ్ళ క్రితం వేసిన బొమ్మలు

 ఎప్పుడో 1990 లో అనుకుంటా, నేను వేసిన బొమ్మలు ఈ మధ్య కనబడ్డాయి. ఏదో పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే ఒక Full Sketchbook నిండా ఇవి కనబడ్డాయి..!           సింహాచలం ఘాట్ రోడ్ ఎక్కేముందు కనిపించే తోరణం ఇది. కొండ ఎక్కడానికి బస్సు ఎక్కి, అది ఇంకా బయల్దేరకపోయే సరికి ఈ స్కెచ్...
పూర్తిగా చదవండి...

Monday, January 13, 2020

పోతన కవితా చమత్కృతి - రవిబింబంబుపమింప పద్యం:

బమ్మెర పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో, వామనుడు త్రివిక్రమావతారుడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పద్యం ఇది. మత్తేభము. రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/ శ్రవణాలంకృతియై, గళాభరణమై సౌవర్ణ కేయూరమై/ ఛవి మత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర/ ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్! ఒక...
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)