ఈ లింక్ నొక్కి టైటిల్ సాంగ్ చూడండి: http://www.youtube.com/watch?v=K7mAayfjcUc
ఆ ఊరిలో ఒక శివాలయం వుంటుంది..! విలన్ ఆ కోవెల హుండీ దగ్గర కాపుకాసి డబ్బులిస్తేనే లోనికి వెళ్లనిస్తాడు. ఒకరోజు మన కార్తీక్ అండ్ టీం ని కూడా అలాగే ఆపుతాడు. వాడి పనిపట్టడానికి శివుడు విశ్వరూపం చూపించి మూడోకన్ను తెరిచి వాడిని భస్మం చెయ్యడం తో కధ సుఖాంతమౌతుంది. ఊరివాళ్ళతో పాటూ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల రహస్యాన్ని తెలుసుకొని ఆశ్చర్య పడి పోయేస్తారు.
సినిమా చూస్తున్నంతసేపూ ఎంత తిట్టుకున్నానో చెప్పలేను. పిల్లలు చూస్తున్నారు..కాబట్టీ నాకూ తప్పింది కాదు. బాపు కార్టూన్లో చెప్పినట్టు..ఇంత అవకతవక ఖంగాలీ సినిమా నేనింతవరకూ చూడలేదు. పైగా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకొన్నాడో అర్ధం కాదు.
హనుమంతుడు.. స్కూల్ బాగ్ తగిలించుకొని టోపీ పక్కకి తిప్పి తన స్కూల్ పిల్లలతో అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. 'కృష్ణ' లో కూడా రాధా కృష్ణుల మధ్య జరిగే సంభాషణలూ, విరహ గీతాలూ, మొదలైన వాటి గురించి మోతాదుకి మించి చూపించారు. 'ఘటోత్కచ' నేను చూడలేదు.
ఎంత కల్పితం అయితే మాత్రం పురాణాలూ, ఇతిహాసాల పాత్రలను చూపించేటప్పుడు మరీ ముఖ్యంగా పిల్లలని దృష్టిలో పెట్టుకొని చేసే కార్టూన్లూ లేక సినిమాలూ అసంబద్ధంగా చూపించడం మంచిది కాదు. పాత్రల నేపధ్యం, ఔచిత్యం, వ్యక్తిత్వాలని, పిల్లలకి అర్థమయ్యేలా చూపిస్తేనే అవి పదికాలాలపాటూ నిలిచి వుంటాయి. మన సంస్కృతి, వారసత్వాలను తరువాతి తరాలకు అందించే వారధులుగా నిలచిన చందమామ, అమరచిత్రకథ ల విజయ రహస్యం ఇదే.
ప్రేమ తో మార్చుకుంటే తప్పు లేదు .... వ్యాపారం(గా)తో మారిస్తేనే అభ్యంతర కరం...
ReplyDeleteపలు రామాయణాలలో... నాతి రాతి గా మారి నట్టు (నిజానికి ధూళి గా మారింది ), రాముల వారికి ఉడుత సహాయమందించి నట్టు, శభరి ఎంగిలి తినినట్టు, సౌమిత్రి లక్ష్మణ రేఖ గీసినట్టు, ఇలా మన పురాణ ఇతిహసాలలో ఎన్నో కల్పిత కథలు ఉన్నాయి . అయితే అవన్నిటినీ వారు భక్తిపారవశ్యంతో ప్రేమ తో రాసుకున్నవి.
వాస్తవానికి అవి ఒకరి చెప్పడానికి రాసిన వి కాదని నా అభిప్రాయం, ఎందుకంటే అనువదిస్తున్నంత సేపూ వారు పొందే అనుభూతి వర్ణించరానిది.
విశ్వనాధ సత్యరాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం పై ఎవరో విలేకరి " మీ రామాయణం అంతగా బాగాలేద"న్నాడట. దానికి వారు ఇచ్చిన సమాధానం "దానిని నేను ఇతరులకొరకు రాయలెదు కదా!" అని.
ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాధ చెప్పిన కారణం
మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి గాన
ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.
చివరగా పెద్దలకి ఒక విన్నపం , మూల గ్రంధాలకి , ఇతిహాసాలకి ... ఇప్పోడొస్తున్న వినోదాత్మక, వ్యాపారాత్మక సీరియల్లకి, కార్టూన్స్ కి, అలాగే వితండ మైన చర్చలకి, ఎలాంటి సంబంధం లేదని వారికి నచ్చచెప్పండి.
వివరణకై వారిని స్వాధ్యాయానికై ప్రేరేపించండి....లేకపోతే పసిహృదయాలు పొరపాటు పడే అవకాశముంది, "అమాయకులు మూర్ఖులు గా మారే ప్రమాదముంది.".
ధన్యవాదాలు.
అందుకేనండి ముందొక ముష్టి డిస్క్లైమర్ పడేస్తారు
ReplyDeleteఈ ప్రస్తావన తెచ్చినందుకు సంతోషమండి - నేనూ వ్రాద్దమనుకుంటున్నాను .. { చాల కాలం నుంచి ] ఈ మధ్య My Friend Ganesha-3 లో అనుకుంటాను - భస్మాసురుడిని బాలగణేశుడు చంపినట్టు చూపారు. మీరు చెప్పిన ధారావాహికల సంగతి చెప్పనక్కరలేదు. రోల్ నెం. 21 అని ఒకటి ఉంది అమ్దులో ఏకం కృష్ణుడు స్కూల్ పిల్లాడు ( పేరు క్రిష్ ) ప్రిన్సిపాలుడు కంసుడు - ఏమి చెప్పమంటారులెండి.
ఇమ్కో గ్రహపాటు ఏమిటంటే - ఆ తెలుగు మరియు- అన్ని హీరో పాత్ర్లలకీ వినిపించే ఒకే పిల్లాడి గొంతు
వీటిని ఇప్పుడే నివారించకుంటే రాబోయే తరాలకు తప్పుడు కథలే మిగులుతాయి. వ్యూహాత్మకంగా మన పిల్లలను పక్కదారిపట్టించే పథకాలుకూడా కావచ్చివి
ReplyDeleteఎవడి పైత్యాన్ని వాడు గ్రంధరూపంలో [సొంత డబ్బీట్టి మరీనూ]జనాల నెత్తిన రుద్దీస్త్తున్నారు మరి.కరుణానిధి,వీరప్ప మొయిలి లు రామాయణాలు రాసిపారేస్త్తున్నారు ఇందుకే
ReplyDelete@సత్య గారూ:
ReplyDelete/ప్రేమ తో మార్చుకుంటే తప్పు లేదు .... వ్యాపారం(గా)తో మారిస్తేనే అభ్యంతర కరం.../
మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదాలు.
@ఊకదంపుడు:
వీళ్ళ కల్పితాల లిస్ట్ కి అంతులేదు లెండి..
చరిత్రను మనము కథ చేసిన నాడే తప్పు దారి పట్టింది
ReplyDeleteచరిత్రను మనము కథ చేసిన నాడే తప్పు దారి పట్టింది
ReplyDelete